హాబీఫోటోగ్రఫర్ గా ఉంటూ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా ఒక గమ్యం వైపు ఎదగాలనుకునే ‘కార్తీక్ స్వామినాథన్’ అనే ఒక సాధారణ యువకుడి గతుకులప్రయాణం “మయక్కమ్ ఎన్న”
సినిమా పేరే తెలుగులో చెప్పాలంటే ‘ఎందుకీ మత్తు?’. తన సామర్థ్యం తనకే తెలీని మత్తో, కేర్ లెస్ నెస్ మత్తో, సామాజికచట్రలో ఇమిడి ఎగదాలంటే ఏంచెయ్యాలో తెలీని మత్తో, స్నేహాల మత్తో, అర్థంకాని ప్రేమానుబంధాలమత్తొ, తాగుడుమత్తో…చివరికి విజయం మత్తో… మొత్తానికి జీవితం మత్తోగానీ అన్నిటినీ కలగలిపిన ఒక జీరోటూ హీరో కథ ఈ సినిమా.
చాలా మందికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. నాకూ అప్పుడప్పుడూ ‘ఇలా ఉందేంటి ఈ సినిమా’ అనిపించింది. బహుశా ఇందులోని అతిసాధారణత్వం అందుకు కారణం కావొచ్చు. సినిమా మరీ బయోగ్రఫిక్ జీవితంలాగా ఉంటే బోర్ కొడుతుంది. అలా అలవాటుపడ్డాం మనం. దాదాపు ఒక నవలలాంటి అనుభవాన్నిచ్చే ఈ సినిమాకు బలం, బలహీనత రెండూ ఇవే. హీరోహీరోయిన్లు అనే కాన్సెప్టుని మర్చిపోయి, తెరమీద కనిపించే పాత్రల్ని పరిచయం చేసుకుని, వాళ్ల జీవితాన్ని దగ్గరగా చూసి, వాళ్ళ అనుభవాల్ని పరికిస్తూ వాళ్ళ స్పందనలకు ప్రతిస్పందిస్తూ కొంచెం పాజిటివ్ వయొరిస్టిగ్గా తిలకిస్తే మాత్రం ఒక భావపూరితమైన అనుభవం మత్తుతో తిరిగొస్తాం. లేదా ‘ఈ డైరెక్టర్ ఏం తాగి ఈ సినిమా రాశాడో, తీశాడో’ అనుకుంటూ నిరసిస్తాం. రెండూ కరెక్టే…మన అభిరుచిని బట్టి. మన సినిమా నిర్వచనాన్ని అలవాటునీబట్టి.
కారీక్ గా ధనుష్ నటన ఈ సినిమాకి పెద్ద బలం. యామిని గా రిచా గంగోపాథ్యాయ నోరుమూసుకుని లుక్స్ ఇస్తూ ఉంటే, ‘నిజంగానే భలే నటించిందే’ అనిపించేంతగా దర్శకుడు మభ్యపెట్టగలిగాడు. కొన్ని టిపికల్ తమిళ్ ఏడుపు సీన్లలో మాత్రం ఈ అమ్మాయిలో విషయం ఉంది అనిపిస్తుంది. స్నేహితులుగా నటించిన వాళ్లందరూ మన స్నేహితుల్లాగానే ఉంటారు. వాళ్ళెవరూ నటించలేదు. అలా ఉన్నారు కార్తీక్ జీవితంలో. అంతే. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మాథేష్ గా నటించిన నటుడు, కార్తీక్ మిత్రుడు సుందర్ తండ్రిగా నటించిన నటుల నటన అభినందించ దగ్గది. కొన్ని సీన్ల బలం వాళ్ళవల్లే వచ్చింది.
దర్శకుడు సెల్వరాఘవన్ (శ్రీరాఘవ) ప్రతిభ, రచయితగా తన పరిణితి ప్రతి సీన్ లోనూ తెలుస్తుంది.
ఇది ఒక ఆత్మ ఉన్న సినిమా. ఆత్మకథలాంటి సినిమా. అలాంటి సినిమాలు చూసేవాళ్ళు మాత్రమే చూడండి.
ఆ.సౌమ్య says:
I liked it….మధ్యలో చాలా బోర్ గా అనిపించింది. లేచి వచ్చేద్దామా అనిపించింది కానీ చివరికొచ్చేసరికి good movie అనిపించింది. నాకు నచ్చింది. ఇందులో ఫొటోగ్రఫీ అద్భుతం..మరో మాట లేదు. selva raghavan is different అని మరోసారి నిరుపించుకున్నాడు. ధనుష్ కే మొత్తం క్రెడిట్ అంతా. రిచా, మిగత మితృలు చాలా బాగా చేసారు.
రాక్ స్టార్ తరువాత వెంటనే ఈ సినిమా చూసానేమో…రాక్ స్టార్ ఫీల్ ఇంకా పోకుండానే చూడడం వలన ఇంకా బాగా ఎక్కింది. రెండూ ఒకే రకం సినిమాలు కదా!
Sowmya says:
నిన్ననే ఈ సినిమా చూడబోయి – “7am arivu” చూశా…ఇదెలా ఉంటుందో ఏమో అని.
మీర్రాసింది చదివాక ధైర్యం వచ్చింది
నాగన్న says:
తమిళంలో మయక్కమ్ అంటే తెలుగులో మైకం అనుకుంటాను!