Menu

Monthly Archive:: December 2011

ద డర్టీ పిక్చర్ (నా ఆవేదన)

పురుషాధిక్య సమాజంలో స్త్రీని కేవలం ఒక మాంసపు ముద్దగా ఒక వినోద వస్తువుగా వ్యాపారం చేసుకుంటున్న ఒక స్థాయి లో ఉన్న రచయితలూ కానీ దర్శకులు కానీ ఇలా వాస్తవికత రియల్ పిక్చర్ అంటూ స్త్రీని అసభ్యంగా చూపించే సినిమాలు తీయడం బాగా అలవాటైన సినీ సమాజం మై పోయింది మనది. సినీ నటి కావాలనే అభిలాష కలిగిన ఒక స్త్రీ ఎన్నో విధాలుగా ఇలా వాడుకోబడటం అన్నది చాల పెద్ద పెద్ద వాళ్ల విషయాల్లోనే జరిగింది

రాజన్న – మంచీ చెడూ

చారిత్రాత్మకమైన చిత్రమనీ, మామూలు తెలుగు సినిమాలకన్నా ఈ చిత్రం భిన్నంగా ఉందని వెబ్‌సైట్లన్నీ మంచి రేటింగులిచ్చి తెగ పొగిడేశాయనీ, నవతరంగంలో కత్తి మహేష్‌కూడా మంచి కథ ఉన్న సినిమా అని కితాబు ఇచ్చాడనీ, పాటలు సాహిత్యంలోనూ, సంగీతంలోనూ విభిన్నంగా, బాగా ఉన్నాయనీ, నేను చాలా ఉత్సాహంగా ఈ సినిమా చూడడానికి వెళ్ళాను.   నచ్చిన విషయాలు: చిత్రమంతా హీరో చుట్టూనే తిరగాలనే తెలుగుచిత్రప్రపంచంలో నాగార్జునవంటి స్టార్‌హీరో తాను చిత్రంలో సగంకూడా ఉండని చిత్రంలో నటించడమే కాకుండా, నిర్మించటం

ఫెల్లినీ’s 8 ½

“నేను సాహిత్యాన్ని” అన్న కాఫ్కా రీతి లో.. “నేను సినిమాను” అని చాటిన ఇటాలియన్ దర్శకుడు ‘ఫెడెరికో ఫెలినీ’. ఆయన చేసిన సినిమాల ద్వారా ప్రపంచ సినీ చరిత్ర లో అరుదైన ఆర్టిస్టిక్ జీనియస్ అనిపించుకున్నాడు ఫెలినీ. ఆయన జీవితం గురించి చదివినవారికీ, ఆయన సినిమాలు చూసినవారికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.   కవితాత్మకమైన, భావావేశముతో కూడిన అసమాన దృశ్యాల తో ..సినిమా అనే మాధ్యమం ద్వారా ..మనిషి లోని కాంప్లెక్సిటీ ని చెప్పటానికి ప్రయత్నించిన

ఈ ’కథ’ చూసారా?

ముళ్ళపూడి వారి బుడుగుంగారు కథ చెప్పడానికి ఉపక్రమించే ముందే నీతి సెలవిస్తారు. ఎప్పుడోకప్పుడు చెప్పుకోవలసినదే కదా, ముందు ’నీతి’ అనేసుకుంటే అలా పడుంటుంది కదా, అని. మరే! కథ అన్నాక నీతంటూ ఉన్నాక చెప్పుకోవాలిగా. ఫలానా కథలో ఫలానా వాళ్ళ మధ్య ఫలానా సంఘటనలు జరిగినప్పుడు, ఫలనా అవుతుంది, దాన్ని బట్టి మనకు ఫలనా నీతి బోధపడుతుంది. మరి ఇలాంటి ఓ ఫలానా కథను తీసుకొని మనుషులకు, మారుతున్న పరిస్థితులకూ అన్వయిస్తే ఏమవుతుంది? అప్పుడే నీతులు బోధపడతాయి?

జానపద హీరో ‘రాజన్న’

చాలా రోజుల తరువాత తెలుగులో ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మిగిల్చిన చిత్రం ‘రాజన్న’. ఒక కాల్పనిక జానపద హీరో కథని చారిత్రక నేపధ్యంలో సృష్టించి ఆ కాలపు చరిత్రతోపాటూ, స్థానిక సంస్కృతిని, నమ్మకాలను, జనపద ఒరవడులను అల్లుకుంటూ హృద్యమైన కథ చెప్పడం అభినందించదగ్గ ప్రయత్నం. ప్రధానకథ ఊరిమంచి కోసం ప్రధానమంత్రి నెహ్రూకి దొరసాని దౌర్జన్యాల్ని వివరించడానికి చిన్నారి మల్లమ్మ (బేబి ఆనీ) చేసే అద్వితీయ ప్రయాణానిదే అయినా, ఉపకథగా మల్లమ్మ తండ్రి రాజన్న(నాగార్జున) సాహసగాధ