Menu

White Nights (1985)

“ఇరు దేశాల సరిహద్దులపై భారీగా బలగాల మొహరింపు.”

“చర్చలు విఫలం. వాణిజ్యవ్యాపారాలకు తీవ్ర అంతరాయం.”

“యుద్ధం ప్రకటించిన … దేశం. ఖండించిన పలునాయకులు.”

ఇలాంటి వార్తా పతాక శీర్షికలు మన దైనందిక జీవితంలో తారసపడుతూనే ఉంటాయి. విని ఊరుకోవడమో, లేక వీలైనంతగా పరిస్థితులను గమనించటమో చేస్తుంటాం, మన తీరక, ఓపికలను బట్టి. ఎంత లోతుగా వీటిని విశ్లేషించినా మనకు లభించే అవగాహన పైపైనదే.

When two elephants fight, it’s the grass that suffers. రాజ్యాల మధ్య పోరు సామాన్య జనజీవనం అస్తవ్యస్తమయ్యే విధానం చాలా అరుదుగా మన ముందుకు వస్తూ ఉంటుంది. జర్నిలిజం నుండే కాక, ఆయా పరిస్థితులను బాక్డ్రా ప్లోు ఉంచి, కొన్ని హృద్యమైన కాల్పనిక కథనాలు సాహిత్య రూపంలోనో, సినిమా రూపంలోనే రావచ్చు. అగ్రరాజ్యాల పోరులో ఓ కళాకారుడి జీవితమెలా మలుపు తిరిగిందన్న కథాంశంతో రూపొందిన చిత్రం 1985లో విడుదలైన White Nights.

చిత్రకథ:

అమెరికాకు చెందిన ప్రఖ్యాతి బాలే డాన్సర్, నాట్యప్రదర్శనకై టోక్యోకి వెళ్తుండగా, మార్గమధ్యంలో విమానం దుర్ఘటన పాలై సైబిరియాలో క్రాష్ లాండ్ అవుతుంది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాన్సర్నుం వైద్యం నెపంతో తక్కిన ప్రయాణికులకు దూరం చేస్తారు రష్యన్ పోలిసులు. “రష్యాను వీడి అమెరికాలో స్థిరపడినందుకు మా దృష్టిలో నీవు క్రిమినల్విూ.” అని నిర్ణయించిన ఓ రష్యన్ ఆఫీసరు, అతడిని జైల్లో పడేయక, మచ్చిక చేసుకొని అతడిచేత రష్యన్ రంగస్థలంపై నాట్యం చేయించాలని పథకం వేస్తాడు. ఆ పనిని, అమెరికా నుండి రష్యన్కు వలస వచ్చిన ఒక నల్లజాతీయుని అప్పజెప్తాడు.

ఆ నల్లజాతీయుడు టాప్ డాన్సర్. అమెరికాలో దుర్భర జీవితాన్ని గడిపి, రష్యాలో తలదాల్చుకుంటాడు, కొన్నళ్ళ బట్టి. ఒక రష్యన్ యువతితో పెళ్ళైయ్యుంటుంది. ఇప్పుడు అతడికి ఇష్టం లేకపోయినా ఈ అమెరికన్గాజ-మారిన-రష్యన్ చేత ఇక్కడి నాట్యం చేయించాలి. ఇదంతా అతడి భార్యకు నచ్చకపోయినా, గతిలేక ఒప్పుకుంటాడు.

అమెరికా, రష్యాలలో వీరిద్దరూ ఏ దేశాన్ని ఎన్నుకుంటారు? ఇద్దరిలో ఎవర్ని ఎవరి దారికి తెచ్చుకుంటారు? లాంటి ఆసక్తికరమైన విషయాలతో తక్కిన సినిమా పూర్తవుతుంది.

కథనం

కథ మాత్రమే ఆసక్తికరం కాదు, కథనంలో కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పొందుపరిచారు. ఏ ఇద్దరి జీవితాలలో ఇలాంటి మలుపులనూ, సంఘర్షణలూ చూపించినా కథ బాగానే సాగేది. కానీ ఇక్కడ ఇద్దరి కళాకారులను ఎన్నుకున్నారు. కలకు, కళకూ దేశ సరిహద్దులతో పనిలేదని, కళాకారుడి పని దేశజాతివర్గ విభేదాలను అధిగమించి అందరిని ఆకట్టుకోవడమేనని చెప్పకనే చెప్తారు.

సినిమా మొదలవుతూనే Jean Cocteau రాసి, Roland Petit చేసిన ‘Le jeune homme et la mort’ (Young man and the death) ను బాలే (ballet) గా ప్రదర్శించారు. ఆ పాత్ర ఓ పెద్ద కళాకారుడని ఎస్టాబ్లిష్ చేయడానికి దాన్ని ఉపయోగించుకున్నారు. అలానే అమెరికన్ టాప్ డాన్సర్ను పరిచయం చేయడానికి ఓ చక్కటి నృత్యరూపకాన్ని ( Porgy and Bess) ఎన్నుకున్నారు. అందులోని పాటలో “న్యూ యార్క్ మన ఇల్లు, అక్కడికే పోదామే!” అంటూ తోబుట్టువును బతిమిలాడేట్టు పెట్టి, మరో కీలక పాత్రను లాంఛనంగా ప్రవేశపెట్టారు.

ఓ కళాకారుడిగా తనకు జన్మనిచ్చిన థియటర్నుబ కాదనుకుంటున్న వాడి మనోవేదనను చూపడానికి కూడా ‘Fastidious Horses’ by Vladimir Vysotsky పాటకు నృత్యరూపేణ చూపించారు. ఆ సీన్ చూసితీరాల్సిందే!

ఇలా చెప్పుకుంటూ పోతే, సినిమాలో ఎక్కడా డాన్స్ అవకాశం ఏ మాత్రం ఉన్నా వదులుకోలేదు. పదేపదే చూడాలనిపించే డాన్స్ సీక్వెంసులు చిత్రంలో మెండుగా ఉన్నాయి.

కానీ, రెండు గంటలకు పైగా నిడివి ఉన్న ఈ సినిమాలో సగం దాటేసరికి, కథనం దాదాపుగా ఆగిపోయినట్లనిపించింది నాకు. చకచకా సాగకపోగా, రష్యన్ పాత్రలన్నీ వారి భాషలోనే మాట్లాడుకోవటం, దానికి సబ్టైయటిల్స్ లేకపోవటంతో కొద్దిగా ఇబ్బంది అనిపించింది. పైగా, ఈ సినిమాను మొదటిసారి చూసేవారికి, అప్పటి రష్యా-అమెరికా మధ్యన సంబంధబాంధవ్యాల గురించి, అప్పటి రాజకీయ సామాజిక పరిస్థితుల గురించి ఎంతో కొంత అవగాహన ఉండాలి. లేకపోతే, కేవలం వేరే దేశంలో ఉంటున్నందుకు అంతటి విపరీత స్పందనలేంటో అర్థం కాదు.

చిత్రాన్ని వీలైనంత కళాత్మకంగా తీయడానికి ప్రయత్నించారు. సఫలమయ్యారనే చెప్పొచ్చు. రాజకీయసామాజిక స్థితిగతులు అటుంచి, ఈ మొత్తం కథలో మానవీయ కోణాలను స్పృశించడంలో సఫలీకృతమయ్యారు.

నటీనటుల గురించి

ఇంతటి అపూరపమైన కథకు అవసరమైన నటీనటులు ఈ చిత్రానికి సమకూరారు.

లీడ్ పాత్ర చేసిన మైఖేల్ బారిష్నికొవ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! Watching him, makes my body feel so crippled and at the same time, my soul seems liberated. I feel like saying, “Dance is yours, ecstasy is mine.” All of his performances, in this movie, are breathtakingly good.

వికి లెక్క ప్రకారం “ఇరవైవ శతాబ్దపు ’గ్రేట్’ బాలే డాన్సర్స్”లో మైఖేల్ ఒకడు. ’గ్రేట్’కు నిర్వచనం ఏమిటో నాకు తెలీదు గానీ, ఈయన నాట్యం నయనానందకరం. ఆత్మానందకారకం. (కనీసం, నా వరకూ. నాట్యం గురించి నాకు తెలిసినది లేదు.)

ఈ చిత్రం గురించి గూగిలిస్తే తెలిసిన ఒక చిత్రమైన విషయం. ఈ కథలో మైఖైల్ పోషించిన పాత్రకూ, ఆయన నిజజీవతానికి దగ్గర పోలికలున్నాయి. ఆయన కూడా రష్యను వీడి అమెరికాలో స్థిరపడినవారే! అందుకే ఈ సినిమా రష్యాలో జరుగుతున్నట్టు చూపుతున్నా, అసలు తీసింది ఇతరత్రా యూరపియన్ దేశాల్లో అట.

సినిమాలో మరో ముఖ్యపాత్ర చేసిన గ్రెగరీ హైన్స్ కూడా విలక్షణమైన నటనను ప్రదర్శించారు. ముఖ్యంగా, ఇంటిలో ఉన్న అతిధి ముందు, ఓ ఒక్క భార్య వారిస్తున్నా, ఎక్కువగా తాగి, తన గతాన్ని గురించి టాప్ డాన్స్ చెప్పే సీను నాకు చాలా నచ్చింది. ఆల్కహాల్ సేవించి అతినటన చేయడమే చూసాను, ఇన్నాళ్ళు. ఇక్కడ మాత్రం, ఆ పాత్ర ఆవేదనను ఆయన వెళ్ళగక్కిన తీరు బా నచ్చింది. అలాగే, ఈయనకిచ్చిన డాన్స్ సీక్వెన్స్ అన్ని బాగా చేసారు.

ఇహ, తొలి పరిచయం అంటూ టైటిల్స్ లో చూపిన ఇసబెల్లా రోసల్లిని, భర్తంటే పంచప్రాణాలు పెట్టే భార్యగా నాకు నచ్చేసింది. ఈవిడ పాత్ర చిన్నది. పైగా డైలాగులు తక్కువ. కానీ ఆవిడ్ ఫ్రేమ్లోభ ఉంటే ఆమె మొహంలో తన భర్తను గురించిన చింత, వాక్యులత లాంటివి ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి. అసలైతే అంతగా ప్రాధాన్యతలేని ఈ పాత్రకు ఆవిడ కొత్త జీవాన్నిచ్చారు.

తక్కిన వారూ, తమ తమ పాత్రలకు అనుగుణంగా చేసుకొచ్చారు.

ముగింపుగా:

ఓ మంచి చిత్రాన్ని బేరీజు వేయడానికి గల కొలమానాలు నా వద్ద లేవు గానీ, ఉపోద్ఘాతంలో చెప్పినట్టు, దేశాల మధ్య సంబంధాలు మారినప్పుడల్లా, గ్రాస్-రూట్ లెవెల్లోప మనుషుల జీవితాలు ఎన్ని ఒడిదుడుకులకు లోనవుతాయనేది చాలా చక్కగా చూపించగలిగారు. అందులోనూ ఇద్దరి కళాకారుల జీవితాలనూ, వారి అంతస్సంఘర్షణలూ సామాన్య ప్రేక్షకుడికి చేరువయ్యేలా చిత్రీకరించారు. అక్కడక్కడా ఆగినట్టనిపించినా, చివరికి “వావ్!” అనిపించచ్చు. కాకపోతే, జనరంజకమైన అంశం కాదు. కొద్దిగా ఓపికుండాలి, ఇంక్కొద్దిగా అలాంటి జీవితాలను తరచి చూడాలన్న ఆసక్తి ఉండాలి.

మనుగడకోసం ఓ ప్ర్దదేశాన్ని వదిలి సుదూరతీరాలకు చేరుకునే స్వేచ్ఛ వలస పక్షులకున్నంతగా మనుషులకు లేదా?! ఏమో..

– పూర్ణిమ తమ్మిరెడ్డి

2 Comments
  1. rahul November 22, 2011 /
  2. jd- November 23, 2011 /