వెట్రిమారన్ సినిమాలో రానా

“ఆడుకళం” చిత్రంతో జాతీయ అవార్డ్ పొందిన దర్శకుడు వెట్రిమారన్ తర్వాతి చిత్రం  ’వడ చెన్నై’లో రానా దగ్గుబాటి శింబుతో కలిసి నటిస్తున్నాడు. మార్చి  నుండి మొదలయ్యే ఈ చిత్రంలో ఆండ్రియా ఒక ప్రధాన పాత్ర పోషిస్తుండగా మెయిన్ హీరోయిన్ ఇంకా ఎన్నిక కావల్సి ఉంది. ఇప్పటికే తెలుగు హిందీలలో తనకంటూ గుర్తింపు సాధించుకున్న రానా ఈ చిత్రంతో తమిళ చిత్రసీమలోకి కూడా ప్రవేశిస్తున్నాడు.