Menu

నవతరంగం నాలుగవ వార్షికోత్సవం

నవతరంగం నాలుగవ జన్మదినోత్సవ సందర్భంగా పాఠకులకూ, సభ్యులకూ అభినందనలు. 2007 నవంబర్ నెలలో మొదలు పెట్టిన నవతరంగం ఆన్ లైన్ ఫిల్మ్ జర్నల్ ఈ రోజుతో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఎంతో మంది సభ్యులు, రచయితలు, పాఠకులు, అభిమానులు మరియు శ్రేయోభిలాషుల ఆశీస్సులు, ప్రోత్సాహం మరియు ఆదరణతో మన నవతరంగం పత్రిక నాలుగు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఐదో సంవత్సరం లోకి అడుగు పెడుతోంది.

ఈ సంవత్సరంలో ముఖ్యంగా సత్యజిత్ రే “Our Films-Their Films” ని నవతరంగం సభ్యురాలు సౌమ్య తెలుగులోకి అనువదించగా నవతరంగం ఫిల్మ్ స్టడీస్ ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకం ప్రచురించడంలో సాయపడిన అందరికీ మా ధన్యవాదాలు.

గత నెలలో వైరస్ అటాక్ కారణంగా కొన్నాళ్లు నవతరంగం వెబ్ సైట్ పూర్తిగా మూతపడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము.

గతంలోలా నవతరంగం అంతగా యాక్టివ్ గా లేకపోయినప్పటికీ వచ్చే సంవత్సరం మరిన్ని వ్యాసాలు, కొత్త శీర్షికలతో మీ ముందుకు రావాలని ప్రయత్నం చేస్తామని మనవి చేసుకుంటున్నాము. ఎప్పటిలాగే మీ సలహాలతో, సూచనలతో మరింత మెరుగుపరుచుకునే అవకాశం మాకు అందివ్వండి.

ధన్యవాదాలు

నవతరంగం

డొనేట్

గమనిక: Paypal ద్వారా విరాళాలు ఇవ్వడం కష్టమైతే navatarangam at gmail dot com కి మైల్ చేస్తే మీకు బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలియచేయగలము.
3 Comments
  1. వనమాలి November 30, 2011 / Reply
  2. Purnima December 1, 2011 / Reply
  3. V Chowdary Jampala December 1, 2011 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *