Menu

Cult classic – RAAKH

కొన్ని సినిమాల్నే “టైం లెస్” అంటాం. ఒక్కోసారి వాటి సబ్జెక్ట్ అలా ఉంటే ఒకోసారి ఎంత టెక్నాలజీ మారినా ఇప్పటికీ కొత్తసినిమాలాగానే ఉండే సినెమాటిక్ అచీవ్మెంట్ చేసిన సినిమాలు అలా ఉంటాయి. రెంటినీ కలిపిన అరుదైన కల్ట్ క్లాసిక్స్ కొన్నే ఉంటాయి. ఒకవైపు బలమైన కథాంశం, మరోవైపు సాంకేతిక నైపుణ్యం కలగలిపిన టైం లెస్ క్లాసిక్ కల్ట్ ఫిల్మ్ “రాఖ్”. చిత్రమేమిటంటే ఈ విషయం దర్శకుడికి ముందే తెలుసేమో అన్నట్టు, కథ ఒక కాల్పనిక కాలంలో, కాల్పనిక నగరంలో జరుగుతుంది.

 

ఈ అమీర్ ఖాన్ ద్వితీయచిత్రం సినిమా సర్కిల్స్ లో, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని సంపాదించి కొన్ని జాతీయపురస్కారాల్ని సంపాదించినా, అప్పట్లో కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అప్పటికే లవర్ బాయ్ గా, చాక్లెట్ హీరోగా అమీర్ ఖాన్ ను అంగీకరించిన ప్రజలకు ఒక నటుడిగా చూడటానికి మనస్కరించలేదు కాబోలు. ఒకవేళ ఈ సినిమా హిట్ అయ్యుంటే అమీర్ ఖాన్ ఇప్పుడు చేస్తున్న విన్నూతనత్వం అప్పుడే మొదలెట్టేవాడు. భారతీయ సినిమా కొన్ని అడుగుల ముందుండేది కాబోలు.

 

గొప్ప దర్శకుడు బిమల్ రాయ్ మనుమడు, మరో అద్వితీయ దర్శకుడు బాసు భట్టాచార్య పుత్రుడు ఆదిత్య భట్టాచార్య ఈ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ప్రముఖ సినెమాటోగ్రఫర్ సంతోష్ శివన్ ఈ చిత్రంతోనే జాతీయ-అంతర్జాతీయ గుర్తింపుని పొందారు. సుప్రియపాఠక్, పంకజ్ కపూర్ (ఈ చిత్రానికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నేషనల్ అవార్డ్ వచ్చింది), నైనా ల నటన ఆకట్టుకుంటుంది. అమీర్ ఖార్ రెండోచిత్రానికే ఇంత మెచ్యూర్డ్ గా యాక్ట్ చేశాడా అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది. తప్పకుండా చూడవలసిన చిత్రం ఇది.

One Response
  1. హెర్క్యులెస్ November 27, 2011 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *