Menu

Monthly Archive:: October 2011

మైనే గాంధీ కొ నహీ మారా

ఈ సినిమా ౨౦౦౫లొ వచ్చినప్పుడు, చూడాలి చూడాలి అనుకున్నా కూడా, ఇప్పటికి చూసాను. అద్భుతమైన సినిమా. అర్రే! దీన్నా నేను మిస్సయింది! అనిపించింది. అందుకే, ఈ సినిమా గురించి ఒక చిన్న పరిచయం – కథ: ఇది హిందీ సాహిత్యం లో ఆచార్యులుగా పనిచేసి విశ్రమిస్తున్న ఉత్తమ్ చౌదరి అన్న వ్యక్తి కథ, అతని కుటుంబం కథానూ. ఆయనకి క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గుతూ, మొదట డిమెంషియా అనీ, తర్వాతా అల్జీమర్స్ అనీ….ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉండగా,

మాస్‌మసాలా కామెడీ ఏక్షన్ రొమాంటిక్ ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రం – “దూకుడు”

శ్రీనువైట్ల తీసిన “ఢీ”, “రెఢీ” వంటి సినిమాలు గుర్తుంటే ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు “పోకిరి” పవర్, “అతిధి” కామిడి కలగలిపితే ఇంక చెప్పేదేమీ లేదు. అయితే ఈ రెండింటిని కలిపితే వచ్చే మాస్‌మసాలా కామెడీ ఏక్షన్ రొమాంటిక్ ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రమే – “దూకుడు” అజయ్ అని ఒక హీరోగారు. సగటు తెలుగు సినిమా హీరో లాగానే వంటి చేత్తో వందమందిని మట్టి కరిపించగల మహా శక్తిమంతుడు. “మైండ్లో ఒక