Menu

Monthly Archive:: October 2011

“L O V E” – it just happens.

కొన్ని విషయాలు చాలా సరళంగా ఉంటాయి.. కాని ఆ సరళత్వం లోనే సంక్లిష్టత ఉంటుంది.జీవితం కూడా అంతే. చాలా సరళంగా కనపడుతుంది. ఈ స్నేహాలు,బాంధవ్యాలు.. ఒడిదుడుకులు..జీవితం విసిరే సవాళ్లు,కలయికలు..విడిపోవటాలు..తెలిసి తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. తద్వారా మనం గొప్ప భావోద్వేగాలకి గురి అవుతూనే ఉంటాం.ఆ భావోద్వేగాలే మనకి గొప్ప అనుభూతిని  కలిగిస్తాయి,ఒకింత దృష్టి పెడితే తద్వారా గొప్ప జీవిత సత్యాలని గ్రహిచగలుగుతాం. Ask Tesadüfleri Sever  (Love Likes Coincidences) ఈ సినిమా కూడా అంతే… చాల సరళంగా

జగ్జీత్ -ఒక అమర గీతం

సరిగ్గా రెండు మూడు వారాల క్రితం. నిండా పది సంవత్సరాలు లేని ఒక చిన్న కుర్రాడు.. నీలాకాశం లాంటి నీలి కళ్ళు, అమాయకత్వపు చూపులు , చూసిన వారికి ముద్దే కాదు బోలెడెంత ప్రేమ కలిగించే కనిపించే చూపులతనివి. అతను వచ్చిన ఒక మూరుమూల వెనకపడిన గ్రామానికి ఛిహ్నంలా అనిపిస్తుంది బక్కపలుచని దేహం. అంత బలహీన దేహం నుంచి వెలువడుతున్న స్వరం మనల్ని ఒక సంగీత ప్రపంచంలోకి తీసుకు వెళ్ళి పోయే ఓ హిందీ పాటను ఆలాపిస్తోంది.

పరమసిల్లీ కథనంతో ‘ఊసరవెల్లి’

సినిమా చూసొచ్చి రివ్యూ రాయడానికి టైప్ కొడుతూ, కథ కష్టపడి వెతుక్కునే స్థాయికి తెలుగు సినిమా గత పదిపదిహేను సంవంత్సరాలుగా దిగజారుతూనే ఉంది. కథకు కావలసిన సామాగ్రిని అడ్డదిడ్డమైన స్క్రీన్ ప్లే పేరుతోనో లేక హీరోని కూడా కామెడీ కోసం కథకు సంబంధంలేని నానాగడ్డీ కరిపించో అసలు కథను అద్భుతంగా  పారేసుకొనే సాంప్రదాయం మన ప్రత్యేకత. ఊసరవెల్లి సినిమా దానికి ఏమాత్రం మినహాయింపు కాదు. కథగా చెప్పాలంటే కొంచెం కష్టమే అయినా ప్రయత్నిస్తాను. గమ్యంలేకుండా చిన్నచిన్న గూండాగిరీచేసుకుని

Bose: The Forgotten hero (2005)

౨౦౦౪-౦౫ ప్రాంతంలో నాంపల్లి లోని గృహకల్ప కాంప్లెక్స్ లో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారి ఎగ్జిబిషన్లో సుభాష్ చంద్రబోసు గురించి శిశిర్ కుమార్ బోస్ రాసిన జీవితచరిత్ర పుస్తకం ఒకటి కొన్నాను. అప్పట్లోనే శ్యాం బెనెగల్ తీసిన “నేతాజీ సుబాష్ చంద్ర బోస్: ది ఫర్గాటెన్ హీరో” సినిమా గురించి కూడా తెలిసింది. నా ఖర్మ కొద్దీ బాగా కత్తిరించిన డీవీడీ దొరికి, గంటన్నర నిడివి ఉన్న సినిమా చూసి, అదే సినిమా అనుకుంటున్నప్పుడు చివరకి

గుల్జార్ కవిత్వం సెల్యులాయిడ్ పై: ఇజాజత్

ముందుగా కొన్ని disclaimers ఇది గుల్జార్ సాబ్ రాసి, తీసిన సినిమా ’ఇజాజత్’ గురించి నా ఆలోచనల వ్యాసం. సమీక్ష కాదు. నాకు సినిమాలంటే అట్టే ఇష్టం ఉండవు. మా కాల్విన్‍గాడు అన్నట్టు, Happiness is not enough for me. I need euphoria. సమిష్టి వ్యవసాయమైన సినిమారంగంలో ఒక అత్యద్భుతమైన ఉత్పత్తి రావాలంటే ఎందరో కల్సి పనిచేయాలి. ఇంకెన్నో కల్సి రావాలి. ఇలా అరుదుగా జరుగుతుంది. అలా జరక్కపోతే సినిమా ఎక్కదు నాకు. అలా