Menu

Monthly Archive:: September 2011

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- ఉత్తమ నటీ నటులు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు కేవలం ఉత్తమ చిత్రాలను మాత్రమే గుర్తిస్తూ ఈ అవార్డులను అందచేసే వారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు అంటే 1968 లో మొదటి సారిగా చలనచిత్రాల్లో నటించిన ఉత్తమ నటీనటులకు అవార్డులు అందచేయాలని అప్పటి భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ బాల నటీనటుల విభాగాల్లో మొత్తం మూడు అవార్డులు నటీనటులకు జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో కేటాయించారు. 1968 నుంచి 1974 వరకూ ఉత్తమ నటుడు అవార్డులను

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- దక్షిణ భారత సినిమాలు

మన దేశంలో హిందీ తర్వాత అత్యధిక సంఖ్యలో చలనచిత్రాలు నిర్మించే భాషల్లో తెలుగు, తమిళం, మళయాళం మరియు కన్నడ ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల సంఖ్య కలిపితే ప్రపంచం లోనే అత్యధికంగా సినిమాలు నిర్మించే ప్రాంతంగా దక్షిణ భారతదేశాన్ని పేర్కొనవచ్చు. 1954 లో మొట్టమొదటి చలనచిత్ర పురస్కారాలు అందచేసినప్పటినుంచీ 1966 వరకూ దక్షిణ భారతదేశానికి చెందిన కథాచిత్రాలేవీ స్వర్ణ కమలం గెలుచుకోలేదు. డాక్యుమెంటరీ మరియు ఇతర విభాగాల్లో స్వర్ణ కమలం అవార్డులు గెలుచుకున్నప్పటికీ మొదటిసారిగా దక్షిణాదికి చెందిన

జాతీయ చలనచిత్ర పురస్కారాలు – బెంగాలీ సినిమాలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలందుకున్న సినిమాలను సాధారణంగా అవార్డు సినిమాలని అంటుంటారు. అలాంటి అవార్డు సినిమాలనగానే మనకి గుర్తుకొచ్చేవి బెంగాలీ లేదా మళయాళీ సినిమాలే. గత కొన్ని రోజులుగా మనం జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి తెలుసుకుంటున్నాం. అయితే గత 58 ఏళ్ళగా కొనసాగుతూ వస్తున్న ఈ పురస్కారాల్లో 22 బెంగాలీ సినిమాలు ఉత్తమ చిత్రంగా ఎంపిక కాబడ్డాయంటే బెంగాలీ సినిమాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరాలాల్ సేన్ దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి భారతీయ