Menu

కథానాయికల కథ

ఎప్పటికీ సినిమాలో గ్లామర్ అంటే హీరోయినే. హీరోయిన్ లేని సినిమా అంటే ఒయాసిస్సులేని ఎడారే! అందుకే సగటు ప్రేక్షకుడికి సినిమా నటి ఓ స్వప్నం! సౌందర్యం! ఓ మానసిక సంతృప్తి! ఓ అప్సరస! తెరమీద జిలుగు వెలుగులలోని హీరోయిన్ సౌందర్యం వెనుక నీలినీడపూన్నో! హీరోయిన్ సమ్మోహిత నవ్వుల వెనక పైకి కనిపించని బాధపూన్నో! అభిమాన నటి పెదాల లిప్‌స్టిక్ మెరుపుల వెనక కురవని మేఘాపూన్నో!

రకరకాల కథలతో ఎందందరో వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని సినిమాలను రూపొందించే మన సినీ దర్శక నిర్మాతలు సినిమా హీరోయిన్‌ల జీవిత నేపథ్యాలను ఇతివృత్తాలుగా చేసుకుని ఎన్నో సినిమాలు తీశారు. తీస్తున్నారు. సినిమా రంగం అనే వైకుం నిచ్చెనపూక్కిన హీరోయిన్‌లు… సర్పం మింగిన హీరోయిన్‌లు ఎందరో! అలాంటి వారి నిజ జీవిత గాథలను కొన్ని పరిమితులతో సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు.

అలా ఇటీవల కాలంలో చర్చల్లోకి వచ్చిన సినిమాలు- ‘ది డర్టీపిక్చర్’, ‘హీరోయిన్’.
రియలిస్టిక్ చిత్రాల దర్శకడు మధుర్ భండార్కర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారిన ‘హీరోయిన్’ సినిమా ఇంకా సెట్స్‌లోకి వెళ్లకముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను మొదట ఐశ్వర్యరాయ్ చేస్తుందని, ఆ తర్వాత కరీనా కపూర్ చేస్తుందనే వార్తలు ఒకవైపు…ఈ సినిమా కథ ‘మర్లిన్ మన్రో’ జీవితం ఆధారంగా రూపొందుతోందనే వార్తలు మరోవైపు. ‘హీరోయిన్’ సినిమాను పతాక శీర్షికలలోకి ఎక్కించారు. ఈ నేపథ్యంలో ‘భారతీయ సినిమా’లో హీరోయిన్‌ల నిజ జీవితగాథలతో రూపొందిన వివిధ భాషా సినిమాలను అవలోకించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ‘కథానాయికల కథ’లతో మలయాళ, హిందీ, బెంగాలీ దర్శక నిర్మాతలు చేసిన ప్రయోగాలను ఒక్కసారి విశ్లేషించాల్సిన అగత్యం ఏర్పడ్తోంది.

భూమిక

1940-50 దశకాలలో మరాఠీ రంగస్థలంపై, సినిమా తెరపై ఓ వెలుగు వెలిగిన హంసా వాడ్కర్ నిజ జీవిత ప్రస్థానమే ‘భూమిక’. 1977లో ప్యారలల్ సినిమాల దర్శకుడు శ్యామ్‌బెనెగల్ దర్శకత్వంలో స్మితాపాటిల్ అనంత్‌నాగ్, అమోల్‌పాలేకర్ వంటి అద్భుత నటులతో వచ్చిన ఈ సినిమా కథానాయికల జీవితం ఆధారంగా వచ్చిన భారతీయ సినిమాలలోనే ఓ మోడల్ అనడంలో ఆశ్చర్యంలేదు. 1978లో జాతీయ అవార్డులలో ఉత్తమ నటిగా స్మితాపాటిల్‌కు, ఉత్తమ స్క్రీన్‌ప్లేకి శ్యామ్‌బెనెగళ్-సత్యదేవ్ దూబే-గిరీష్ కర్నాడ్ త్రయానికి అవార్డులను సాధించిపెట్టిన ఈ సినిమా తారల వెనుక జీవితంలో దాగిన ఎన్నెన్నో పార్శ్వాలను అత్యంత సెన్సిటివ్‌గా చిత్రించింది.

మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామంలో సంప్రదాయ సంగీతాన్ని పాడే గాయకురాలి అమాయకపు మనవరాలు ఉష(స్మితపాటిల్), జీవన ప్రయాణంలో బొంబాయికి వెళ్లి అక్కడ నటిగా ఎదగడం… వయసులో చాలా పెద్దవాడైన వ్యక్తిని తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లాడి సైతం వృత్తిని కొనసాగించాల్సి రావడం… చివరికి విడిపోయి ఓ బడా వ్యాపారి రెండో భార్యగా వెళ్లడం… ఈ మధ్యకాలంలోనే ఉష ఎదుర్కొన్న జీవనానుభవాలు చివరికి ఆమెలో సొంతతనాన్ని, స్వఅస్తిత్వాన్ని మేల్కొల్పడం కథాంశం. ఈ సినిమాలోని ప్రతీ ఫ్రేమ్‌లో స్మితా పాటిల్ చూపించిన ఎక్స్‌వూపెషన్స్ సినిమా చూసింతర్వాత కూడా వెంటాడుతూనే ఉంటాయి. అలాగే ‘మంచాలు మారతాయి. వంట గదులు మారతాయి.. మగాళ్ల ముసుగులూ మారతాయి… కానీ మగాళ్లు మారరు’ అనే ఓ సీన్‌లో వచ్చే డైలాగ్‌లు మన గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.

ది డర్టీ పిక్చర్

1980వ దశకంలో తెలుగు, తమిళ, మలయాళ సినీ పరిక్షిశమలను ఒక ఊపు ఊపిన నటి సిల్క్‌స్మిత. విజయలక్ష్మిగా జన్మించిన స్మిత మలయాళంలో నటించిన ఓ పాత్ర పేరుతో సిల్క్‌స్మితగా పాపులర్ అయ్యింది. ఎంతోమంది అమాయక గ్రామీణ యువతుల్లాగే సినీరంగంలో హీరోయిన్‌గా వెలిగిపోవాలని అందమైన కలపూన్నో కన్న విజయక్ష్మి చివరికి వ్యాంప్ పాత్రలతో తన స్వప్నాన్ని నిజం చేసుకోవాల్సివచ్చింది. స్క్రీన్‌మీద ఆమె సొగసు- సోయగాలతో ఆటపాటలతో రెండు తరాల టీనేజ్ యువకులకు వెర్రెక్కించిన వెండితెర అప్సరగా సిల్క్‌స్మిత అవతరించింది. మత్తయిన కళ్లు- ఆహ్వానించే పెదాలు, ప్రొవోకింగ్ బాడీ ఆమె సొంతం. దక్షిణాది ప్రేక్షకులందరినీ తన అందాల మత్తులో మెస్మరైజ్ చేసిన సిల్క్‌స్మిత చివరికి ఆత్మహత్య చేసుకుంది. శరీరానికి అతీతమైన ప్రేమకోసం నిరంతరం తపించిన పట్టులాంటి హృదయమున్న సిల్క్‌స్మిత, చివరికి ప్రేమను ఇవ్వలేని ఈ నయవంచక సమజానికి ఓ ధిక్కారాన్ని తన ఆత్మహత్యతో విసిరింది. సిల్క్‌స్మిత జీవన గాథతో ప్రస్తుతం టీవీ సీరియల్‌ల క్వీన్ ఏక్తాకపూర్ నిర్మాణంలో ‘ది డర్టీ పిక్చర్’ తెరపైకెళ్లుతోంది. శృంగారం ప్రధానాంశాలుగా రెండు దశాబ్దాల క్రితం వచ్చే బి గ్రేడ్ సినిమాలను అప్పట్లో డర్టీ పిక్చర్ అనేవాళ్లు. అదే పేరును ఈ సినిమాకు టైటిల్‌గా వాడుకున్నారు. ఈ సినిమా కథ ప్రకారం1980ల నాటి దక్షిణ భారత సినీ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం క్యాస్టూమ్స్, సెట్స్, ఫ్యాషన్స్, సై్టల్స్ పరంగా ‘రివూటోలుక్’ను రీ క్రియేట్ చేశారు. ‘బయోపిక్ పీరియడ్ ఫిల్మ్’గా రూపొందుతున్న ఈ సినిమాలో సిల్క్‌స్మిత పాత్ర పోషిస్తున్న విద్యాబాలన్ కెరీర్ మేకప్ గర్ల్‌గా మొదలై, ఎక్స్‌ట్రా నటిగా, ఆ తర్వాత ఐటమ్ గర్ల్‌గా మారుతుంది. సినిమా కథ ప్రకారం విద్యాబాలన్ పాత్ర ముగ్గురు పురుషుల రిలేషన్స్‌తో నడుస్తుంది. వారే నసీరుద్దీన్ షా, ఎమ్రాన్ హష్మీ, తుషార్‌కపూర్. నసీరుద్దీన్ షా ఈ సినిమాలో వయసుపైబడిన సూపర్‌స్టార్‌గా నటిస్తున్నారు. విద్యాబాలన్ నసీర్‌ల కాంబినేషన్ మొన్నామధ్య ‘ఇష్కియా’ సినిమాలో బాగా కుదిరింది. నసీర్ ఈ సినిమా కోసం 22 ఏళ్ల తర్వాత(1989 నాటి త్రిదేవ్ సినిమాలోని ‘తిర్చీ టోపీ వాలే’ పాట) మళ్లీ స్టెప్పులేయబోతున్నాడు. తుషార్‌కపూర్ పాత్ర విద్యను నిజంగా ప్రేమించే అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ రచయితగానూ, ఎమ్రాన్‌హష్మీ విద్యాబాలన్‌ను మోసగిస్తూ క్యాష్ చేసుకునే పాత్రగానూ కథను రూపొందించారు. ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయి’ సినిమాను అత్యంత వాస్తవికంగా తెరకెక్కించిన మిలన్ లూధ్రియా ‘ది డర్టీపిక్చర్’కు దర్శకత్వం వహిస్తున్నాడు. విశాల్-శేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ట్రైలర్స్, పోస్టర్స్ ఇప్పటికే హాట్‌న్యూస్‌గా మారాయి. సిల్క్‌స్మిత పుట్టిన రోజైన డిసెంబర్ 2న ‘ది డర్టీ పిక్చర్’ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే విద్యాబాలన్‌లో సిల్క్‌స్మితకున్నంత రొమాంటిక్ లుక్‌లేదని, ఆమె ఈ పాత్రకు ఎంతవరకు న్యాయం చేకూరుస్తుందనే మాటలూ వినిపిస్తున్నాయి. కానీ పరిణీత(2005), లగే రహో మున్నాభాయ్(2006), భూల్‌భూలయ్యా(2008), ఇష్కియా(2010) సినిమాలతో పాటు ఇటీవలి ‘నో వన్ కిల్డ్ జెస్సికా’లోనూ ఆయా పాత్రల్లో విద్య ఒదిగిన తీరును బట్టి పెర్‌ఫ్మాన్స్‌పైనా ఆమె పోర్‌వూటెయిట్ పైనా అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇతి మృణాళిని

సినిమా హీరోయిన్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని 2010లో వచ్చిన బెంగాలీ సినిమా ఇది. ఇతి మృణాళిని(మీ మృణాళిని) సినిమాను ప్రముఖ నటి దర్శకురాలు అపర్ణాసేన్ తన దర్శకత్వంలో తెరకెక్కించింది. 1961లో సత్యజిత్‌రే తీసిన ‘తీన్ కన్య’ చిత్రంతో నటిగా సినీరంగ ప్రవేశం చేసిన అపర్ణాసేన్ 1981లో ‘36 చౌరంఘీ లేన్’తో దర్శకురాలిగా మారి తొలిచివూతంతోనే జాతీయ ఉత్తమ దర్శకురాలిగా అవార్డును సాధించింది. ఇప్పటికి ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న అపర్ణాసేన్ ‘ఇతి మృణాళిని’ సినిమాను ఎంతో హృద్యంగా తెరకెక్కించింది. ఈ సినిమా ఓపెనింగ్ సీన్ ఓ వయసుపైబడిన నటి రాసే సూసైడ్ నోట్‌తో మొదలవుతుంది. ఆమే మృణాళిని. అనుభవమున్న నటిగా తెరపై కనిపించే సీన్‌లో పాత్రలు ఎప్పుడు ఎంటర్ అయి, ఎప్పుడు వెళ్లిపోతే బాగుంటుందో అనే విషయం బాగా తెలుసు. అందుకే జీవిత సినిమాలో తన ఆగమనం ఎలాగూ తన చేతుల్లో లేదు. కనీసం నిష్ర్కమణం అయినా తన చేతుల్లో ఉండాలని ఆమె స్లీపింగ్ పిల్స్‌ని తీసుకుంటుంది. తన ఇంట్లో ఒంటిరిగా ఉండే మృణాళిని దానికంటే ముందు తెరపై తన ప్రాభవవైభవాలను చూపించే అన్ని రకాల జ్ఞాపకాలను తగలేయాలనుకుంటుంది. ఉత్తరాలు, ఫోటోలు, పత్రికా కథనాలు, అవార్డులు, సన్మాన పత్రాలు…అన్నిటినీ దగ్థం చేయాలనుకుంటుంది. అలా ఒక్కొక్కటీ చూస్తున్నప్పుడు మృణాళినికి గత జ్ఞాపకాలు వెల్లు ఇలా సినిమా అంతా ఫ్లాష్‌బ్యాక్ ప్రజెంట్ ప్యాటర్న్‌లో రివీల్ అవుతుంది. ఆమెకు జీవితంలో ఎదురైన ప్రేమలు, మోసాలు, వంచనలు విజయాలు, వైఫల్యాలు, విషాదాలు, ఆనందాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తాయి. అర్ధరాత్రి చీకట్లలో మొదలయ్యే ఈ సినిమా వేకువ జామున మసీదు నుంచి వచ్చే అజా వరకూ నడుస్తుంది. క్రమక్షికమంగా ఉదయ కిరణాలు ఆమె గది అంతటా వ్యాపిస్తాయి. ఆమె పెంపుడు కుక్క అలికిడితో మెలకువలోకి వచ్చిన మృణాళిని చిన్నగా నవ్వి, పక్కనే ఉన్న సూసైడ్‌నోట్‌ని చించేసి కొత్త రోజుకు ఆహ్వానం పలుకుతుంది. ఈ సినిమాలో వయసు పైబడ్డ నటి మృణాళినిగా అపర్ణసేనే నటించింది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే యంగ్ హీరోయిన్ మృణాళినిగా ఆమె కూతురు కొంకణాసేన్ శర్మ అద్భుతంగా నటించింది. ‘ఏక్ జె అచ్ఛే కన్యా (2000)’ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన కొంకణా ‘మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్’ సినిమాలోని నటనకుగానూ జాతీయ ఉత్తమనటిగా అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత ‘పేజ్3’ ‘లక్ బై ఛాన్స్’ ‘వేకప్ సిధ్’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా తన టాలెంట్‌ను నిరూపించుకుంది. యంగ్ మృణాళినిగా ఆమె ప్రదర్శన మల్టీ డైమన్షన్స్‌ని మనం హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.

తిరక్కథ

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల ఒకనాటి నటి శ్రీవిద్య జీవితం ఆధారంగా మలయాళంలో రూపొందిన సినిమా ‘తిరక్కథ’. అంటే స్క్రీన్‌ప్లే అని అర్థం. 2008లో రూపొందిన ఈ సినిమాకు రచనా దర్శకత్వ బాధ్యతలను రంజిత్ నిర్వహించిగా ఇతర పాత్రల్లో పృద్వీరాజ్, అనూప్ మీనన్ నటించారు. శ్రీవిద్యకు తెరపై జీవం పోసిన నటి ఎవరో తెలుసా? ప్రియమణి. ప్రముఖ కర్ణాటక సంగీత విద్యాంసులు ఎం.ఎల్. వంసతకుమారి గారాల బిడ్డగా, అందమైన తారగా శ్రీవిద్య అప్పట్లో ఎంతో మంది దక్షిణాది ప్రేక్షకుల ఆరాధ్య దేవత. అలాంటి అద్భుత నటీమణి తెర వ్యక్తిగత జీవితం ఎన్నెన్నో గొడవలతో, సంక్షోభమయమై చివరికి బ్రెస్ట్‌క్యాన్సర్‌తో అంతం అయ్యింది. ‘తిరక్కథ’ సినిమాను శ్రీవిద్యకు నివాళిగానే తీశారు. ఈ సినిమా ఓపెనింగ్, మిడ్ పాయింట్, క్లయిమాక్స్ అన్నీ సినిమా టైటిల్‌కు తగినట్టుగానే హృదయాన్ని తట్టే స్క్రీన్‌ప్లేతో రూపొందాయి. ఈ సినిమా ఓపెనింగ్ సీన్ ఓ ఔత్సాహిక యువ దర్శకుడి తొలి సినిమా విజయోత్సవాల దృశ్యాలతో ఆరంభం అవుతుంది. సినిమా అంటే ఫ్యాషన్ ఉన్న మరికొంతమంది మిత్రులతో కలిసి ఈ యువ దర్శకుడు(పృద్వీరాజ్) తీసిన సినిమా సూపర్ హిట్ కావడంతో అతని రేంజ్ ఎక్కడికో వెళ్తుంది. ఇక రెండో సినిమా ఏం చేయాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎంతగానో ఆలోచించి చివరికి పృధ్వీరాజ్ గతతరం నటి మాళవిక పియమణి) జీవితంపై సినిమా తీయాలని నిర్ణయించుకుంటాడు. దానికోసం పృథ్వీరాజ్ ఆ నటి జీవితాన్ని అన్వేషించడం మొదపూడతాడు. ఆ క్రమంలో వెల్లడైన ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఈ సినిమాకు ఆధారమైన శ్రీవిద్య జీవితంలో ఆమెకు, కమల్‌హాసన్‌కు మధ్య నడిచిన ప్రేమాయణం ప్రధానంగా హైలైట్ అయింది. ఇక ఈ సినిమాలో ప్రియమణి నటన శిఖరాక్షిగస్థాయిని చేరుకుందని చెప్పాలి. ఆ ప్రియమణికి, మన తెలుగు సినిమాలోని ప్రియమణికి ఊహించలేనంత తేడా అనిపిస్తుంది. ‘పరుత్తివీరన్’(2007)లో ప్రదర్శించిన నటనకుగానూ జాతీయ ఉత్తమ నటిగా అవార్డును గెల్చుకున్న ప్రియమణి నటవిశ్వరూపం ఈ సినిమా. ముఖ్యంగా క్లయిమాక్స్ సీన్లలో కేన్సర్ బారిన పడిన తర్వాత వెంట్రుకలన్నీ రాలిపోయిన దృశ్యాల్లో ఆమె పండించిన మహా విషాదం సినీతారల తళుకు బెళుకు ‘గ్లిట్జ్-గ్లామ్-గ్లో’ జీవితాలలోని విషాదవాస్తవికతను కళ్లముందు ప్రత్యక్షం చేస్తుంది.

మన తెలుగు సంగతేంటి?

తెలుగు సినిమారంగం సైతం సినిమా హీరోయిన్‌ల నిజ జీవిత సంఘటనలను స్ఫూర్తిగా తీసుకొని కొన్ని సినిమాలను నిర్మించింది. వాటిలో ‘సీతామాలక్ష్మి’, ‘శివరంజని’, ‘సితార’ ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమాలు. అయితే ఈ సినిమాలలో మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలలోని డ్రామా-మెలోవూడామాలే అధికంగా డామినేట్ చేశాయి. మిగతా భాషా చిత్రాలు ‘కథానాయికల కథ’లను ఎంతో సెన్సిటివ్‌గా రియలిస్టిక్‌గా ప్రజెంట్ చేస్తే ఇవి మాత్రం ఎప్పటిలాగే తెలుగు స్టయిల్‌లో ఓవర్ డ్రామెటైజ్ చేశాయి.

కొసమెరుపు:ఇండియన్ సినిమాలోని ఏ భాషా సినిమారంగంలోనైనా జనరల్‌గా హీరోల డామినేషన్ అధికం. దానికి తగినట్లే హీరోల పాప్యులారిటీ- క్రేజ్-ఇమేజ్‌లను బట్టే సినిమాలకు మార్కెట్ ఉండటం సహజం. సినిమా హీరోలకు ఫ్యాన్స్ నుండి విపరీతమైన హీరోవర్షిప్ కనిపించడమూ సహజమే. అలాగే ప్రతీ సినీ పరిక్షిశమలో ఎంతో మంది సూపర్ స్టార్స్ మెగా హీరోలున్నారు. కానీ విచివూతమేమిటంటే ఇప్పటి వరకూ ఇండియన్ సిల్వర్‌వూస్కీన్‌పై హీరోల రియల్‌లైఫ్ ఆధారంగా ‘ఇరువర్’(ఇద్దరు) మినహా మరే బయోపిక్ సినిమా రాలేదు. అమితాబ్, కిషోర్ కుమార్‌ల జీవితం ఆధారంగా సినిమాలు తీయాలనే ఆలోచనలు ఇప్పటికీ ఆలోచనల దశలోనే ఆగిపోయాయి.

7 Comments
  1. ravi September 10, 2011 /
  2. కొత్త పాళీ September 11, 2011 /
  3. సుజాత September 11, 2011 /
  4. అబ్రకదబ్ర September 15, 2011 /
  5. కల్యాణి September 15, 2011 /
  6. Challa September 17, 2011 /
  7. umamaheswar November 30, 2013 /