Menu

గుర్తుపెట్టుకోవలసిన యాక్సిడెంట్ – “ఎంగెయిమ్ ఎప్పోదుమ్”

భారతదేశంలో సగటున ప్రతి సంవత్సరం 1,30,000 మంది రోడ్ ప్రమాదాల్లో చనిపోతారనేది ఒక అంచనా.

ప్రతిరోజూ మనం ఇలాంటి ప్రమాదాల గురించి పేపర్లో చదువుతూ ఉంటాం.

ఎంత మంది చనిపోయారో లెక్కలు వింటూ ఉంటాం.

కానీ ఆ చనిపోయినవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైతే…

పరిచయమున్నవాళ్ళు అయితే…

బాగా కావలసినవాళ్లైతే…

మనం ప్రేమించినవాళ్లైతే…

ఆ వార్త అక్షరాలు కన్నీళ్ళవుతారు. అంకెలు గుండెల్ని తూట్లు పొడుస్తాయి.

ఇలాంటి అనుభవాన్ని రెండు హృద్యమైన ప్రేమకథలతో ముడివేసి, మనం ఖచ్చితంగా మరోసారి రోడ్డెక్కినప్పుడు ఈ ప్రమాదాలకు కారణమయ్యే ఆ వేగాన్ని తగ్గించే విధంగా గుర్తుండిపోయేలా చేసిన చిత్రం “ఎంగెయిమ్ ఎప్పోదుమ్”.

 

జై, అంజలి, శర్వానంద్, అనన్య నటించిన ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం శరవణన్ అందిస్తే, ప్రముఖ దర్శకుడు మురుగదాస్ (గజిని) మరియు ఫాక్స్ స్టుడియో సంయుక్తంగా నిర్మించారు.

చెన్నై సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గౌతమ్ (శర్వానంద్) కి ఒకరోజు ఇంటర్వ్యూ కోసం త్రిచి నుంచీ చెన్నై వచ్చిన అమ్మాయి అముద (అనన్య) మధ్య ఆ రోజులో కలిగే అనుబంధం ఒక కథ అయితే, మరో కథ త్రిచిలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేసే చిరుద్యోగి కదిరేశన్ (జై) కి డేరింగ్, డాషింగ్ అన్డ్ ప్రాక్టికల్ నర్సు అంజలి(అంజలి)కి మధ్యజరిగే ఆహ్లాదకరమైన ప్రేమకథ మరొకటి. ఒక ప్రమాదం కారణంగా ఈ ప్రేమల సౌధాలకు ఏం జరుగుతుందనేది మొత్తంగా సినిమా కథ. దీనితోపాటూ ఆ బస్సుప్రయాణికులకున్న కొన్ని ఉపకథలు తోడయి అత్యంత ప్రభావవంతమైన సినిమాగా దీన్ని మార్చాయి.

నటీనటుల నటన అత్యంత సహజంగా ఉండటంతోపాటూ పాత్ర తీరులు విపరీతంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో అంజలి నటన అద్భుతంగా ఉంటే, శర్వానంద్ మరోసారి మెరిసాడు.

సత్య సంగీతం, వేల్ రాజ్ సినెమాటోగ్రఫీ సినిమాకు కావలసిన ఫీల్ ని అందిస్తే, క్లిష్టమైన యాక్సిడెంట్ సీన్లలో కిషోర్ ఎడిటింగ్ ఇంప్రెస్ చేస్తుంది.

ఇలాంటి సినిమాని తీసిని దర్శకుడు అభినందనీయుడైతే, ఇలాంటి సినిమాని ఎంచుకుని నిర్మించిన మురుగదాస్ అనుసరణీయుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఇలాంటి ట్యాలెంట్ ఉన్న దర్శకులు కార్పొరేట్ ఫండింగ్ తో నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మించే ట్రెండ్ ఒకటి వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది.

8 Comments
  1. Sowmya September 26, 2011 /
  2. Shankar September 26, 2011 /
  3. sasank September 26, 2011 /
    • ravi September 27, 2011 /
      • sasank September 28, 2011 /
  4. Pran September 27, 2011 /
  5. manv December 15, 2011 /