Menu

Monthly Archive:: September 2011

గుర్తుపెట్టుకోవలసిన యాక్సిడెంట్ – “ఎంగెయిమ్ ఎప్పోదుమ్”

భారతదేశంలో సగటున ప్రతి సంవత్సరం 1,30,000 మంది రోడ్ ప్రమాదాల్లో చనిపోతారనేది ఒక అంచనా. ప్రతిరోజూ మనం ఇలాంటి ప్రమాదాల గురించి పేపర్లో చదువుతూ ఉంటాం. ఎంత మంది చనిపోయారో లెక్కలు వింటూ ఉంటాం. కానీ ఆ చనిపోయినవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైతే… పరిచయమున్నవాళ్ళు అయితే… బాగా కావలసినవాళ్లైతే… మనం ప్రేమించినవాళ్లైతే… ఆ వార్త అక్షరాలు కన్నీళ్ళవుతారు. అంకెలు గుండెల్ని తూట్లు పొడుస్తాయి. ఇలాంటి అనుభవాన్ని రెండు హృద్యమైన ప్రేమకథలతో ముడివేసి, మనం ఖచ్చితంగా మరోసారి రోడ్డెక్కినప్పుడు

కనుడు … కనుడు రామాయణగాథ

శ్రీరామరాజ్యం’… ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చే వినిపిస్తోంది. బాపు-రమణల కాంబినేషన్‌లో చివరి చిత్రం కావడం, బాలకృష్ణ-నయనతార సీతారాములుగా నటించడం…ఇళయరాజా స్వరాలందిస్తున్న తొలి పౌరాణిక సినిమా కావడం వంటి ఎన్నో కారణాలు ఈ సినిమాను ఇప్పుడు హాట్ టాపిక్‌గా మార్చాయి. అంతకన్నా మించి తెలుగులో దాదాపు 15 ఏళ్ల తర్వాత 1996 నాటి శ్రీకృష్ణార్జున విజయం తర్వాత వస్తున్న పౌరాణిక చిత్రంగా కూడా ఈ సినిమా ఆసక్తిని సృష్టిస్తోంది. ఇదే

తెలుగు సినిమాల్లో తెలుగెంత?

నేతి బీరకాయలో నేయి ఉంటుందా? పులిహోరలో పులి ఉంటుందా? మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా? ఈ ప్రశ్నలు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ప్రస్తుతం తెలుగు సినిమాలో తెలుగు భాష- సంస్కృతి పరిస్థితి అలాగే ఉంది. తెలుగులో తొలి టాకీ సినిమా విడుదలై నిన్నటికి ఎనభై సంవత్సరాలు. ప్రస్తుతం 81 వ ఏట అడుగు పెట్టిన తెలుగు సినిమాలో తెలుగుదనం ఎంత?గత కొంతకాలం నుంచి మనకు తరచూ వినిపిస్తున్న మాట… అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న మాట…‘తెలుగు భాష

రేపటి సినిమా మాండలిక సినిమా

తరాలు మారుతున్న కొద్దీ ‘మెయిన్‌వూస్టీమ్ కల్చర్’లోంచి కొన్ని సబ్ కల్చర్స్ విడివడుతాయి. తమదైన అస్తిత్వాన్ని, సొంత గొంతుకని వినిపిస్తాయి. కళలు, సినిమా కూడా దీనికి మినహాయింపు కాదు. అందుకే ఇపుడు తెలుగు నుంచి తెలంగాణ మాత్రమే కాదు హిందీ నుంచి భోజ్‌పురి, కన్నడ నుంచి తుళు భాషా చిత్రాలు కూడా రెక్కలను విప్పుతున్నాయి. సొంతంగా సినీవినీలాకాశంలోకి ఎగరడానికి సన్నద్ధమతున్నాయి. స్థానిక మూలాలతో కూడిన కొత్త నేటివ్ ప్రపంచాన్ని స్క్రీన్‌పై సృష్టిస్తున్నాయి. సినిమా: ఒరియరొదరి అసల్ సంవత్సరం: 2011

పోస్టర్ లో ఏముంది…!

పోస్టర్ ని చూసి సినిమా కథ చెప్పేరకాలు ప్రతి ఫ్రెండ్షిప్ గ్రూప్ కీ ఖచ్చితంగా ఒకడుండేవాడు ఒకప్పుడు. నిజానికి ఒక్కోసారి సినిమా కంటే ఈ కథలల్లేవాళ్ళ కథకుల కథలే బాగుండేవి. కానీ ఇప్పుడూ! పోస్టర్ చూస్తే కథకాదుకదా కనీసం సినిమా దేని గురించో కూడా తెలియట్లేదు. రాంగోపాల్ వర్మ ‘దెయ్యం’ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజైనప్పుడు జె.డి.చక్రవర్తిని ఎవరో మీడియా వాళ్ళు అడిగారట “సినిమాలో హీరోవి నువ్వేకదా, నువ్వు లేకుందా పోస్టరేంటి?” అని. దానికి జె.డి. వర్మ