Menu

Monthly Archive:: August 2011

వేలాది ‘ పూరో’ ల వేదన ఒక ‘ పింజర్’!

ఆధునిక భారత దేశ చరిత్ర లో ‘ దేశ విభజన’ అనేది ఎప్పుడు తలుచుకున్నా హృదయాన్ని బద్దలు చేసే సమయం, సందర్భం, సన్నివేశం.అప్పటి రక్తపాతం, హింస తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుట్టించే భయానక దుస్వప్నం. లక్షలాది మంది చనిపోయారు. లక్షలాది మంది స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. మనసుని దుఃఖంతో మెలిపెట్టే ఆ జ్నాపకాలు ఇండియా, పాకిస్తాన్ కి చెందిన ఏ ఒక్కరూ ఎప్పటికీ మరిచిపోలేని కఠిన వాస్తవం. మానవత్వం సిగ్గుతో తలదించుకున్న క్షణాలు అవి. ఒకరినొకరు చంపుకున్నారు.

‘అర’క్షణ్ – సగం సమస్య మిగతా సగం మామూలే

మూడు రాష్ట్రాల్లో బాన్! ౩-౪ నెలల క్రితం నుండీ యూట్యూబ్ లో ట్రైలర్లు.. మంచి నటులు అన్నింటికన్నా మించి ఒక నాలుగు రోజుల వారాంతం.. చూద్దాం అని చాలా కుతూహలం గా అనిపించింది. అంతలా బాన్ చేయాల్సినంత ఏముందో చూద్దాం అని.. శుక్రవారం ఏడు గంటల షో కి సీట్లల్లో సెటిల్ అయ్యాం! హాల్ పూర్తిగా నిండింది. ‘వైష్ణవ జనతో..’ తో రీ మిక్స్ అయిన ట్యూన్ వస్తూ రిజర్వేషన్ స్టాంప్ తో పేర్లు .. మొదటి

చూసినవారికి “దడ” పుట్టించే దడ

నాగచైతన్య నటించిన కొత్త సినిమా దడ ఈ రోజు విడుదలైంది. 100% లవ్ సినిమా సక్సెస్‌తో ఇప్పుడిప్పుడే అంచనాలు పెరుగుతున్న నటవారసుడు కాబట్టి, పోస్టర్లు గట్రా కొంచెం రిచ్‌గా వున్నాయికదా అని ధైర్యం చేసి (చాలా రోజుల తరువాత ఒక తెలుగు) సినిమాకి వెళ్తే నిరాశే మిగిలింది. ఒక పక్క తమిళ సినిమాల జోరులో ఆంధ్రదేశమంతా కొట్టుకుపోతుంటే మధ్యమధ్యలో విడుదలౌతున్న తెలుగు సినిమాలు మధ్యలోనే పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆ మధ్య శక్తి సినిమా చూసి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న

నీలాల కన్నుల్లో సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే!

శుభసంకల్పం చిత్రంలో గురువుగారు శ్రీ సీతారామశాస్త్రి గారు వ్రాసిన పాటలు రెండు: అవి హరి పాదాన…, హైలెస్సో… అన్నవి. రెండు పాటలూ కూడా నీలాల కన్నుల్లో సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే! అన్న మకుటంతో సాగుతాయి. ఆ మకుటం నిజంగా వేదాంతపరంగా మకుటాయమానమైనదని కీర్తిశేషులు వేటూరి గారు కూడా శాస్త్రి గారిని మెచ్చుకున్నారట. “అందులో వేదాంతాన్ని వివరించ”మని గతంలో యిద్దఱు ముగ్గురు స్నేహితులు అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా నాకు అర్థమైనది వ్రాస్తున్నాను. గురువుగారి పాట కనుక తార్కికంగా ఆలోచిస్తే తడుతుందన్న ప్రయత్నమే తప్పించి నేను