మూడు రాష్ట్రాల్లో బాన్! ౩-౪ నెలల క్రితం నుండీ యూట్యూబ్ లో ట్రైలర్లు.. మంచి నటులు అన్నింటికన్నా మించి ఒక నాలుగు రోజుల వారాంతం.. చూద్దాం అని చాలా కుతూహలం గా అనిపించింది. అంతలా బాన్ చేయాల్సినంత ఏముందో చూద్దాం అని.. శుక్రవారం ఏడు గంటల షో కి సీట్లల్లో సెటిల్ అయ్యాం!
హాల్ పూర్తిగా నిండింది. ‘వైష్ణవ జనతో..’ తో రీ మిక్స్ అయిన ట్యూన్ వస్తూ రిజర్వేషన్ స్టాంప్ తో పేర్లు .. మొదటి సీన్ లోనే దళితుడైన సైఫ్ ఇంటర్వ్యూ కి వెళ్లి పానెల్ తన పుట్టుక, తల్లి చేసే (పాచి పని?) పని మీద అడిగే ప్రశ్నలకి చెప్పే సమాధానానికి హాల్లో చప్పట్లు, ఈలలు..
అమితాబ్ బచ్చన్, తన్వీ ఆజ్మీ (ఒకప్పుడు నేను ఆవిడ టీవీ లో నటించేప్పుడు పెద్ద ఫాన్ ని..), వాళ్ల కూతురు దీపిక పడుకునే , తన స్నేహితుడు ప్రతీక్ బబ్బర్ లని పరిచయం చేస్తూనే.. మొదటి పదిహేను నిమిషాల్లోనే ౨ పాటలు పెట్టటం..ఆశ్చర్య పరిచింది. కొద్దిగా భయమేసింది. దీని తర్వాత ఇక అన్నీ గొడవలే నేమో అని.
అనుకున్నట్టు గానే రెండవ పాట అప్పుడు సైఫ్ కి ఉద్యోగం వచ్చిందని అందరూ కంగ్రాట్స్ చెప్తుంటే ఒక దళిత నాయకుడు అప్పుడే ఏం చూశారు.. ఇంకా చాలా రిజర్వేషన్ల శాతం పెరిగి .. ముందున్న కాలం మాదే అన్నప్పుడు.. హాల్ లో ఒక పక్క హాహా కారాలు.. ‘మౌకా’ పాట ఒక పక్క అభివృద్ధి అవకాశాలు, ఇంకోపక్క అమ్మాయి తో అవకాశం అర్థాలతో..
ఇక కథ మొదలైంది. విలువలకోసం నిలిచే ప్రిన్సిపాల్ అమితాబ్ కీ, అత్తెసరు మార్కుల తో పాసైన తన మేనల్లుడికి ఆ కాలేజ్ లోనే సీట్ ఇప్పించాలని పంతం పట్టిన మంత్రి గారికీ మధ్య నడిచిన డ్రామా లో ట్రస్ట్ మెంబర్లని తన వైపు తిప్పుకుని, దళితద్వేషి మనోజ్ బాజ్ పాయ్ కి పట్టణం అంతా KK tutorials పెట్టుకునే అవకాశాన్ని ఎర గా చూపి తమ చెప్పు చేతల్లో ఉండే వైస్ ప్రిన్సిపాల్ గా మలచుకోవటం,.. ఈ లోగా సుప్రీం కోర్ట్ రిజర్వేషన్లు ౨౭% దృవీకరించిన తీర్పు ని హర్షిస్తూ ఆ లబ్ది పొందిన విద్యార్థులు ఊరేగింపు గా రావటం,.. కాలేజ్ గేట్ దగ్గర ఘర్షణ, వైస్ ప్రిన్సిపాల్ అమితాబ్ అనుమతి లేకుండా పోలీసులని పిలిపించటం తర్వాత జరిగిన కొన్ని గొడవల్లో అనుకోకుండా అమితాబ్ ఆ తీర్పుని సమర్దిస్తున్నట్టు మిస్ కోట్ చేయబడటం.. తప్పు చేయలేదు అని నమ్మిన అమితాబ్ ఉద్యోగం వదలవలసి రావటం, నిలువ నీడ లేకపోవటం, చక చకా జరిగిపోతాయి.
ఈ మెయిన్ కథ లో ఒక విశేషం ఏంటంటే రిజర్వేషన్ల గురించి అన్ని రకాల కోణాలు వివిధ కారక్టర్ల ద్వారా చూపించటం లో దర్శకుడు సఫలీకృత మయ్యారని అనిపించింది. ఒక్క మార్కు లో సీట్ కోల్పోయిన ఆత్మ హత్యా యత్నానికి ప్రయత్నించిన ఆర్థికం గా వెనక బడిన అగ్రవర్ణానికి చెందిన మెరిట్ విద్యార్థి, తన తెలివి తో, అవిరామ పరిశ్రమ తో సాధించిన విజయాలని ‘ఖైరాత్’ వల్ల వచ్చినవని వెక్కిరిమ్పబడిన దళిత విద్యార్థి, దళిత ద్వేషులు, ‘దళితులం! ముందున్నవి మారోజులే’ అని ఇతరులని రెచ్చకొట్టే నేతలూ, మోడరెట్లు, ‘నా బిడ్డ రిజర్వేషన్ల కారణం గా అవకాశాలు దొరకక బాధపడితే నాకు ఆక్రోశం వస్తుంది. నేను మామూలు అమ్మని! భారత మాత ని కాను’ అనే ఒక సగటు తల్లి, రిజర్వేషన్లతో తన కన్నా తక్కువ ప్రతిభ కల సబ్ ఆర్దినేట్ ఉద్యోగం లో పైకెల్లాడని బాధపడే ఆఫీసర్, ఎంతో కష్టపడ్డా తనకిష్టమైన బ్రాంచ్, కాలేజ్ లో సీట్ రాక బాధపడి మరీ ఆత్మహత్య కాకపోయినా మనసంతా చేదు నింపుకున్న అబ్బాయిలూ, అమ్మాయిలూ, నిజంగా రిజర్వేషన్లు లేకపోతే ‘పాపం.. ఈ పిల్లలేమౌతారు’ అన్నట్టుండే కుటుంబాలు.. ఆవేశాలు, ఆవేదనలు, పౌరుషాలు, దుఖం, రెచ్చగొట్టటాలూ.. ఇలాగ!
ఎక్కడా కొట్టుకోవటాలు లేవు నీట్ గా ఉంది. అలాగని ఆర్ట్ సినిమా లా కూడా లేదు.
ఒక్క క్షణం తల తిప్పితే ‘అయ్యో ఒక వ్యూ పాయింట్ మిస్ అవుతామేమో’ అన్నట్టు ఉన్న సంభాషణలు! చాలా బాగుంది. నాకైతే బాన్ చేయదగ్గ విషయమేమీ కనపడలేదు. రిజర్వేషన్ల నుండి దర్శకుడు నెమ్మదిగా పాత్రల మధ్య పరస్పర వ్యక్తిగత సంబంధాలనీ , సిద్ధాంతాలనీ మరియు ఎమోషన్లని బేస్ గా పెట్టుకుని పాత్రల వ్యక్తిగత మనస్పర్థలు అవీ చూపిస్తూ సాటి ఉద్యోగికి ‘అయ్యో’ అని హామీ ఇచ్చి, అప్పు ఇప్పించి, ఉండటానికి తన ఇల్లు ఇచ్చి మరీ సహాయం చేసిన అమితాబ్ ని వారు ఏవిధం గా మోసగించారో చెప్తూ.. కార్పోరేట్ కోచింగ్ సంస్థల గురించి టచ్ చేసి వదిలేసాడు.
నిజానికి సినిమా టైటిల్ కీ, కథ కీ లింక్ సరిగ్గా ఇంటర్వెల్ తో అయిపొయింది. ఇంటర్వెల్ తర్వాత కథ అంతా అమితాబ్ కీ మనోజ్ కీ మధ్య ఉన్న వ్యక్తిగత వైరం, విజయం.. అలాగే బలహీన వర్గాల వారికి ఉచిత కోచింగ్ ఇచ్చి అమితాబ్ తన వ్యక్తిగత సమస్యలని పరిష్కరించుకుని తాను పోగొట్టుకున్న గౌరవం, మిత్రులు, అభిమానులు మరియు ఇల్లు సాధించుకుని సమాజానికి కూడా కార్పోరేట్ కోచింగ్ సంస్థల కి ప్రత్యామ్నాయం గా ఒక సంస్థ ని ఏర్పరిచి…. హబ్బో… అంతా ఓకే.. కానీ…
సెకండ్ హాఫ్ కథ మరీ మేలో డ్రామాటిక్ గా ..ఒక్కోసారి సిల్లీ గా.. అనిపించింది. నాకు కొద్దిగా అసహనానికి గురిచేసిన రెండు విషయాలు..
రామాయణం లో గుహుడి తరహా లో అమితాబ్ కి అనుక్షణం సహాయం చేసే పాలమ్ముకునే అతను.. అతనే లేకపోతే..అమితాబ్ ఏం చేద్దును? ఇంకోటి బిలియనీర్ హేమ మాలిని (ఎంత అందం గా ఉందొ) వచ్చి ఆఖరి సీన్ లో వర ప్రదానం చేయకపోతే కథ ఏమౌను?
ఇదిగో ఇలాంటి ప్రశ్న లడిగితేనే.. నువ్వు మరీ బొత్తిగా పీకి పాకం పట్టావని అంటారు.
కానీ ఒకటి గమనించాను. జనాలు చాలా ఇన్వాల్వ్ అయ్యారు. మల్టీ ప్లేక్స్ జనాలు అంతలా సీరియస్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలకి చప్పట్లు, ఈలలూ ఇదే చూడటం. మా పక్కనున్న వాళ్లు ఇంటర్వెల్ తర్వాత లేచి వెళ్లిపోవటం కూడా చూసా. సినిమా అయ్యాక కూడా చాలా మంది గందరగోళం గా కోచింగ్, రిజర్వేషన్ల గురించి వేడి గా వాడిగా చర్చించుకుంటూ బయటకి రావటం కనపడింది.
సైఫ్ లెక్చరర్ గా అద్భుతం గా నటించాడు. మంచి నటుడని తెలుసు. కానీ అంత మంచి నటుడనుకోలేదు. అమితాబ్ గురించి కొత్త గా చెప్పుకునేందుకు ఏమీ లేదు. అద్భుతం గా నటించాడు., దీపిక కూడా బాగుంది. బాగా చేసింది. తన్వీ, ప్రతీక్, మనోజ్ ఇంకా నాకు పేర్లు తెలియదు..అందరూ అందరే. చాలా బాగా నటించారు. మొదటి పాట నచ్చింది.
అందరూ చాలా పెద్ద సినిమా అన్నారు కానీ.. నాకైతే ఒక్క టికెట్ కి రెండు సినిమాలు చూసినట్టనిపించింది. ఒకటి సీరియస్ సినిమా . రెండోది ఫెయిరీ టెల్.
- కృష్ణప్రియ
http://krishna-diary.blogspot.com/
Srikanth.M says:
ఆ సినిమాను బ్యాన్ చేసుండాల్సింది కాదు. రిజర్వేషన్ల గురించి చర్చించడానికో, చూడడనికో అంత ఖంగారు పడడమెందుకు. ఒక వేల అది తప్పనిపిస్తే, రిజర్వేషన్లను సమర్ధిస్తూనో లేక, తమ అభిప్రాయాన్ని తెలియ జేస్తూనో మరో సినిమా తీస్తే సరిపోతుంది. (బహుషా అలా తీసే వారు దళితులకు ఉండకపోవచ్చు, అదే సమస్యేమో). సినిమా తీయకపోయినా చర్చ జరుగుతుంది మన టీ.వీలలో, పేపర్లలో, ముఖ్యంగా బ్లాగుల్లో. ఆరోగ్యకరమైన చర్చ ఎప్పుడు ఆహ్వానించదగిందే. అది సినిమా ద్వారా అయినా సరే, టీవీల ద్వారా అయినా సరే.
Praveen Sarma says:
రిజర్వేషన్‌ల గురించి చర్చించడంలో తప్పేముంది? కులాంతర వివాహం వల్ల పుట్టినవాళ్ళు కూడా రిజర్వేషన్ కోసం తల్లి కులం పేరో, తండ్రి కులం పేరో చెప్పుకుంటున్న దేశం ఇది. వ్యక్తిగతంగా నేను రిజర్వేషన్‌లకి వ్యతిరేకం కాదు కానీ అవి కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక ప్రాతిపదికన ఉండాలనే నమ్ముతాను.
sudhakar says:
రిజర్వేషన్ల గురించి చర్చించడం లో తప్పులేదు. వక్ర భాష్యం చెప్పడంలో నే తప్పు వుంది.
ఆర్ధిక ప్రాదిపదికన రిజర్వేషన్లు ఉండాలంటారు. మరి ఏ ప్రాదిపదికన వేల కోట్ల ప్రాజెక్ట్లు పొందుతున్నారు అగ్ర వర్ణ కులాలు ?
ఏ ప్రాదిపదికన జనరల్ నియోజక వర్గాల్లో దళితులూ ఎన్నిక కావడం లేదు ?
ఏ ప్రాదిపదిక మీద ఒకే కులం వాళ్ళు రెండు మూడు సార్లు ముక్య మంత్రులౌతున్నారు ?
కొన్ని కులాల వాళ్ళకే మెడికల్ ఇంజనీరింగ్ డొనేషన్ కళాశాల అనుమతి దొరుకుతోంది ? అసైనేడ్ భూములు కొన్నికులాల వాళ్ళకే ఎందుకు దొరుకుతునాయీ?
అగ్ర కులాలూ వీధులు ఎందుకు వూదవడంలేడూ , పాకీ దొడ్లు ఎందుకు కదగాడంలేడూ చెపండి మహాశయా !
Praveen Sarma says:
అగ్రకులాలవాళ్ళలో కూడా గుడిసెలలో నివసించినవాళ్ళని చూశాను. మేము తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఉన్నప్పుడు మా ఇంటి వెనుక రెండు గుడిసెలు ఉండేవి. ఆ గుడిసెలు కాపు (OC) కులానికి చెందినవాళ్ళవి. వాళ్ళకి ఏ రిజర్వేషన్ ఫలాలూ అందవు, వాళ్ళ కులానికి చెందిన డబ్బున్నవాళ్ళు ఎవరూ వాళ్ళతో పెళ్ళి సంబంధాలు కలుపుకోరు. మనిషి నిజ జీవితంలో కులం కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. దళితుడు IAS అధికారి అయినా అతను తన కులానికి చెందిన పేదింటి అమ్మాయిని పెళ్ళి చేసుకోడు. సమాజంలో ఉన్న ధనిక-పేద వైరుధ్యాల గురించి ప్రజలు ఆలోచించకుండా చెయ్యడానికి రాజకీయ నాయకులకి కులం బాగా ఉపయోగపడుతుంది.
ఆ.సౌమ్య says:
మంచి పరిచయం చేసారు. తప్పకుండా చూడాల్సిన సినిమా అనిపిస్తున్నాది…వెంటనే చూస్తా
కృష్ణప్రియ says:
Alag Niranjan says:
Ivale maa office canteen lo cofffe break lo nenu cheppina opinion akshara rupam daliste as it is ga ee review avtundemo.
But nenu 2 minutes lo cheppina opinion ni 2 pages ki vishadikarincharu.
Good Movie. Nice review.
కృష్ణప్రియ says:
Kiran says:
Honest Film criticiser.. Don’t run for money … stick with your work and ideology.
కృష్ణప్రియ says:
వావ్! చాలా చాలా థాంక్స్! ఇది ఊర్కే సరదా కి రాసింది…
Athreya says:
“అగ్ర కులాలూ వీధులు ఎందుకు వూదవడంలేడూ , పాకీ దొడ్లు ఎందుకు కదగాడంలేడూ చెపండి మహాశయా ”
Delhi lo brahmanulu ippudu sulabh complex lu kadugutunnaru mahasaya. inkaa 50-70 va dasakam naati bhaavajalam maatladakandi. ikkada evaru venakabadda, munduki vellina adi ardhika praatipadika meede. mana mayavathi dalitulaku pratinidhini antundi – oka sweeper koothuriki inni aasthulu ela vachayi? aameki, agravarna chandrababu naidu ki teda emiti? pedarikaniki kulam kuda todai inkastha vedhimpulu untayemo kani, phalaana kulala vaare pedalu anatam ardharahitam. tana peru silaphalakam lo kinda rasarani saakshattu oka MP garu oka udyogi meda SC, ST atrocity case pedatananna charitra manadi. patishtamaina chattalu ila nirupayogam kakudanani aasiddam.
Alag Niranjan says:
Naaku telisina oka friend story idi.
Vaalla father RDO. Manchi position manchi jeetham
Vaalla peddabbay ki reservation kota kinda velite group -1 lo post gaurantee.
Kani RDO ayi vundi tana kodukki SC reservation applicable ayina vaddu ani cheppadu.
Nenu ee position ki ravataniki nenu resevation kota lone vacha.
So meeku andaritho samanaga ee samajam lo anni vasatulu kalpincha.
So meeru open competition lo ee udyogam vaste ade cheyandi aniannaru.
But vaalla abbay group officer kaavalani desperatega vunnadu.
3-4 trails taruvata adi kudaraka last ki bank manager ayyadu.
Maybe reservation use chesukuni oka position ki vachina vaallu antha ila alochichina roju
Aa reservation ki nijamina sartha katha labhistundi.
Ilanti real scenes cinemalo director vadi vundavalasindi.
Ravi says:
Kudos to that officer.
vijay says:
ayya sudhakar garu . now a days no body is asking u to do this work only … that means no cast based occupation .. any body can do that work which they feel comfortable .. no where it was written that only dalits should clean roads r toilets .. if it was written so . how could mayatji ji ,meena kumari ji and some other leaders (dalit ) could achieve that positions . fact is that will power and determination is need for any person (human ) to achieve anything .. mayathi ji is see not enjoying the power … i witnessed so many bramhmins begging on the roads , they r in such a position that unable do marriages for their daughters .. u need to accept this also . its no cast we should talk about . its all about d humanity .. with the votes of people like u only .. those cast people became cm … their is excised election procedure to elect our cm . we are in a democratic country mastru