జానీ సినిమాలో ఓ రొమాంటిక్ సన్నివేశంలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ క్రొవ్వొత్తి వెలుతురులో ఒకరి కళ్ళలో ఒకరు తదేకంగా చూస్తూ ఉంటారు. ఎంత బావుంటుంది ఆ సన్నివేశం!
గీతాంజలి సినిమాలో ఓ close up shot లో నాగార్జున. గిరిజతో లేచిపోదామా అంటాడు. అప్పుడు ఆమె కళ్ళలో కనిపించే ఆశ్చర్యాన్ని side view లో చూపిస్తారు దర్శకుడు మణిరత్నం అత్యంత కళాత్మకంగా.
అంజలి సినిమాలో షామిలి కనిపించే ప్రతీ సన్నివేశంలో లైటింగ్ అంతర్లీనంగా తన ప్రభావం చూపుతూనే ఉంటుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని సినిమాల్లో సన్నివేశాలు అలా జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. కాని అన్ని సినిమాలు అలా ఎందుకుండవు?
ఈ మధ్య నేను ప్రియా ఆనంద్ నటించిన ఒక సినిమా చూసాను. ఈ సినిమా లో ప్రతీ frame (మీరు సరిగ్గానే చదివారు) ప్రతీ frame ఒక అద్భుతమైన దృశ్యం. ఈ చిత్రానికి పనిచేసిన ఛాయాగ్రాహకుడు, artificial lighting తో పాటు natural lighting ని కూడా చాలా బాగా వాడుకున్నాడు. అతనికి తన imagination ద్వారా దర్శకుడు చేసిన తన వంతు సాయం ప్రతీ frame లో కనబడుతుంది. అంటే light meter కన్నా lighting మీద మంచి పట్టు ఉన్న ఛాయాగ్రాహకుడే మేలన్నమాట.
మనం లైటింగ్ ని ఉపయోగించిన విధానం బట్టి ఒక సన్నివేశం యొక్క రూపురేఖల్నే మార్చేయొచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి రాత్రి పూట నిద్రపోయి, ఉదయాన్నే నిద్రలేచే సన్నివేశాన్ని single shot లో తీయాలనుకున్నామనుకోండి. అప్పుడు ఏం చేస్తాం?! ముందుగా scene establish చేసుకుని, camera angles, movements finalize చేసి, lighting కొంచెం dim గా పెడతాం. Shoot start చేసి, gradual గా లైటింగ్ పెంచుకుంటూ వెళతాం. ఇది కొంచెం కష్టం కాని artificial lighting లేకుండా కేవలం natural light తో కూడా ఈ scene తీయవచ్చు. పగటి పూటే scene establish చేసుకుని, camera angles, movements fix చేసుకుని, అన్ని కిటికీలు తలుపులు మూసివేయాలి. ఇప్పుడు shoot start చేసి, ఒక్కొక్క తలుపు, కిటికీ నెమ్మదిగా తెరవాలి. Single shot లో take ok అవుతుంది. ఇక్కడ భావాన్ని వ్యక్తీకరించింది లైటింగే….కెమెరా కేవలం వాటిని చిత్రించింది.
మన సినిమాల్లో లైటింగ్ అంటే frame చాలా నిండుగా కనపడాలని color full గా ఉండాలని మెజారిటీ జనాల ఉద్ధేశ్యం. నిజానికి లైటింగ్ అనేది ఆయా సన్నివేశానికి తగ్గట్టు mood ని create చేసేదిగా ఉండాలి. ఒక సన్నివేశం చిత్రీకరించేటప్పుడు camera angles, movements ఎంతైతే ముఖ్యమో….లైటింగ్ కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకి వివాదాలే ఊపిరిగా….బ్రతికే ఓ ప్రముఖ దర్శకుడి…..అంతకంటే ప్రముఖ నటులతో హిందీలో తీసిన ఓ చిత్రం యొక్క ఒకానొక సన్నివేశంలో….Tower crane నీడ కనబడుతుంది. ఇది లైటింగ్ లోపంగా పరిగణించొచ్చు. అంటే సన్నివేశ రూపకల్పనలో The direction of lighting అనేది చాలా ముఖ్యమని మరోసారి ఈ తప్పిదం ఋజువు చేసింది. Scene continuity కి పాత్రదారుల ఆహార్యం ఎంత ముఖ్యమో…..లైటింగ్ కూడా అంతే ముఖ్యం. ఇలాంటప్పుడు మనకు light meters బాగా ఉపయోగపడతాయి. అనుభవం లేని సాంకేతిక నిపుణులయితే lighting adjustment కి కొంచెం ఎక్కువ సమయం తీసుకోవచ్చు. ఈ లైటింగ్ continuity, ఉన్నంతలో మన భారతీయ సినిమాలలో మణిరత్నం చేసిన వాటిలో కొంచెం బెటర్.
ఇలాంటి లైటింగ్ ని మన సినిమాలలో ఎందుకు విస్మరిస్తుంటారో నాకైతే ఓ పట్టాన అర్థం కాదు
అలాగే మన సినిమాల్లో ఉరుములు, మెరుపులు చూపిస్తుంటారు అప్పుడప్పుడు. Without lighting effects, is it possible to film such scenes? చూసారా లైటింగ్ ఎంత ముఖ్యమో?!
Is not it a separate art?!
రమణ says:
Nice write-up on the role of lighting. Russ Lowell’s ‘Matters of light and depth’ is one of the best texts on lighting for movies I have come across so far. Lowell talks about many interesting approaches to -what he refers to as – “motivated lighting” / “Method lighting” . In Method lighting, lighting director manages to make all the artificial light introduced, to appear as if it is coming from existing light sources in the scene. The “motivated” sources could be windows, doors, sun, moon sky etc.
Kondaveeti Nani says:
chala bagundhi……indhulo manirathnam inka konni movies gurinchi chepparu kani….sekharkammula ANAND movie choodandi,ee movie 3seasons run avuthundhi,oka varsham kurisina rathri start aee seetha kalam lo brake theesukuni vesavi kalam lo mugusthundhi……indhu lo every season lo early morning,midday,eveng,&nite..untaee….aa seasons ni(ROOPA house) artificial ga creat chesaru dop VIJAY.C.KUMAR.
CINEMATOGRAPHY lo kooda ee movie chala kotthaga untundhi….naa carer stating lo ee ki movie nenu asst ga work cheuadam nijam ga naa LUCK…..
Mohan ram prasad says:
Very good and informative article..Thanks to you..