జీవననైరాశ్యాలని జీవితం చేసుకుని రాజీపడిన జీవితంలో ఆనందం వెతుక్కుంటున్న ముగ్గురు స్నేహితులు, ఎప్పుడో చేసుకున్న బాస కారణంగా ఒక విహారయాత్రని మొదలుపెడతారు. విహారం వినోదమై, వినోదం విన్నూత్న అనుభవమై, ఆ అనుభవం హృదయసంగమమై, ఆ సంగమంలో గుబులుతీరి, భయంజారి జీవన సత్యాల్ని నూతనజవసత్వాల్ని కూర్చుకునే ఒక హాయైన ప్రయాణం “జిందగీ న మిలేగీ దుబారా”.
తప్పక చూడండి.
మనమో లేక మనకు తెలిసిన ఇంకొకరో ఈ సినిమాలోని పాత్రల్లో కనపడకపోతే మీరు జీవించడం లేదనే కనీస సత్యాన్ని గ్రహించడానికైనా చూడండి.
Indian Minerva says:
“మనమో లేక మనకు తెలిసిన ఇంకొకరో ఈ సినిమాలోని పాత్రల్లో కనపడకపోతే మీరు జీవించడం లేదనే కనీస సత్యాన్ని గ్రహించడానికైనా చూడండి.”
too much huzoor
సూరంపూడి పవన్ సంతోష్ says:
నిజమే మరీ బెదిరిచేస్తే ఎలా
Krishna chaitanya allam says:
మరీ “అంత” భావుకత ఎం లేదు సినిమాలో. ఎవరికీ వారు ఇది మాదే కథ అనుకునేట్టు ప్రేక్షకున్ని కథలో కట్టి పడెయ్యడం అంత కష్టమయిన పనేం కాదు. మామూలుగా మాట్లాడుకునే, వేస్కునే నాలుగు జోకులు ఇమిడ్చి, రోజూ చేసే నాలుగు సామాన్యమయిన పనులు, చిన్నతనపు జ్ఞాపకాలని, స్నేహాన్ని మిళితం చేస్తే కథ దగ్గరవుతుంది. ఎక్కడో చూసినట్టుందేమో.. అవును.. దిల్ చాహతా హై.. అది వేరు ఇది వేరా? సరే.. మొత్తం కథేంటి ఇంతకీ.. ముగ్గురు మిత్రులు, obviously అందర్లో ఏదో లోపం. ఈ ట్రిప్ వాటన్నిటికి సమాధానం కావాలి. అంతే కదా. ఒకరికి పరుగెత్తడం ఆపి కొంచెం నెమ్మదిగా వెళ్తే లైఫ్ ఉంటుంది అని నేర్పుతుంది.. ఇంకోళ్ళకి కుటుంబ బాంధవ్యాన్ని.. ఇంకోళ్ళకి సరయిన డెసిషన్ గురించి..predictable story, obvious narration, routine twists. ఇందులో “అంత” జీనియస్ ఏముందో అర్ధం కాలేదు..”పరవాలేదు” అని మాత్రమె అనిపించింది. నాతొ ఏకీభవించే పని లేదు.. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇలాంటి Journey type of feel good movies లో “రూట్ నంబర్ 66″, ట్రై చేయండి. బహూశా మీకూ నచ్చొచ్చు.
( ఈ సినిమా నచ్చక పొతే నాకు జీవించడం రాదా? Overrated statement. Funny, and crappy statement. సినిమాలు చూసి జీవించడం నేర్చుకునే స్థితిలో ఎం లేను, ఉన్నంతలో బాగానే జీవిస్తున్నా.)
రాకేశ్వర రావు says:
“మనమో లేక మనకు తెలిసిన ఇంకొకరో ఈ సినిమాలోని పాత్రల్లో కనపడకపోతే మీరు జీవించడం లేదనే కనీస సత్యాన్ని గ్రహించడానికైనా చూడండి.” మఱీమీరింతకు దిగజారతారని కలలో కూడా ఊహించలేదు. ఇట్సమూవీఫర్ క్రైస్సేక. అని నేననంటాను.
సినిమాల ప్రకారం జీవితాన్ని అంచనా వేసుకుంటే, మూఁడుగంటల్లో మనమందరం చచ్చి ఊరుకుంటాం.
అబ్రకదబ్ర says:
ఈ సినిమాకి అంత దృశ్యం లేదు. సగం దాకా అతి కష్టమ్మీద చూసి ఆపేయాల్సొచ్చింది. Sh*t, Bi*ch లాంటి పదాలతో కూడిన వాక్యాల్ని పాండిత్యంగానూ, ప్రధాన పాత్రలు భావాతీత మొహాలతో అవసరమున్నా లేకున్నా అప్పుడప్పుడూ లోతుగా చూట్టాన్ని భావుకత్వంగానూ భావించేవాళ్లకి ఈ సినిమా విపరీతంగా నచ్చొచ్చు.