Menu

సినిమాటోగ్రఫీ – 10

సినిమాటోగ్రఫీ లోకాంతి ఉపయోగం

దృశ్య సమాచారపు రూపురేఖల్ని  భావానికి తగ్గట్టుగా అందంగా.. ఆకర్షణీయంగా మార్చి వేసే శక్తి కాంతికి ఉంది. సినిమాలో దృశ్యాన్ని చూపించటం  కంటే భావానికి తగ్గట్టు కాంతిని ఉపయోగించటం  ముఖ్యం.
1 )  సన్నివేశం జరుగుతున్న ప్రదేశం  కనపడాలన్నా .. ఫిలింని/ సెన్సార్ ని   ఎక్ష్పొసె  చేయాలన్నా  సరి పడిన కాంతి కావాలి.  షాట్ లో డెప్త్ అఫ్ ఫీల్డ్ ఎక్కువ కావాలంటే    ఎక్కువ కాంతి అవసరం.

2). సైజు, ఆకారం, రంగు, లాంటి  వస్తు సమాచారం  రాబట్ట టానికి కాంతి అవసరం. ఎలాంటి సమాచారం అనేదాన్ని బట్టి కాంతి హెచ్చు తగ్గులు, దిశ  మీద ఆధారపడి ఉంటాయి.

౩). ఉషోదయం, సాయంత్రం, మధ్యాన్నం, రాత్రి, వెన్నెల  లాంటి సన్నివేశ సమయ సందర్భాల్నిచూపించటానికి కాంతి అవసరం.

4) సంతోషం,  వేదన, తపన.. ఆలోచన, భయం, లాంటి   సన్నివేశ భావోద్వేగాలని దృశ్యాత్మకంగా చూపించటానికి   కాంతి అవసరం.

5) ఒక నాణ్యమైన సంగీతం ఎలా  ఆనందం  ఇస్తుందో  .. ఒక నాణ్యమైన దృశం కూడా మనని ఆనందాన్ని డోలికల్లో తెలిపోయేలా చేస్తుంది . కాంతిని నైపుణ్యంగా ఉపయోగించటం వల్ల నాణ్యమైన దృశ్యం సాధ్యం అవుతుంది.

కాంతి వనరులు  (light sources ) :

మనకి రెండు రకాల కాంతి వనరులు ఉన్నాయి. ఒకటి సహజ కాంతి వనరు . రెండోది కృత్రిమ కాంతి వనరు .

సహజ కాంతి వనరు :  సూర్యుడు, చంద్రుడు  సహజ  కాంతి ఉత్పాదకులు. భూ బ్రమణం కారణంగా  పగలు రాత్రి ఏర్పడుతున్నాయి.  ప్రతి రోజు సూర్య కాంతి ఒకేలా ఉండదు. వాతావరణం కారణంగా  సూర్యకాంతి లో మార్పులు ఉంటాయి. భూమి చుట్టూ ఉన్న వివిధ వాయువులు..దుమ్ము ధూళి తేమ వంటి వాటిని కలిగియున్న పోరనే వాతావరణం అంటారు. ఈ వాతావరణం ఒక్కో ప్రదేశం లో ఒక్కోలాగా ఉంటుంది. దీనిని బట్టి ఆ ప్రదేశం లో ఉండే కాంతి లో మార్పు ఉంటుంది. శీతల ప్రదేశాల్లో గాలిలో తేమ కారణంగా మెత్తని కాంతి ఉంటె..అదే ఉష్ణ ప్రదేశాల్లో కాంతి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

 ఉదయం &  సాయంత్రం:  సూర్యోదయం  నుండి సూర్యాస్తమయం వరకు సూర్యకాంతి లో అనేక మార్పులు ఉంటాయి.  సూర్యోదయం ..సూర్యాస్తమయం లో  కిరణాలు ఎక్కువ దూరం ప్రయాణించటం,  ఏటవాలుగా పడటం మూలాన..కిరణాలలోని  blue లైట్ ఎక్కువ శాతం scattering అవుతుంది, మిగిలిన ఎరుపు / పసుపు  కాంతి భూమిని చేరుతుంది. అందుకే  ఉదయం సాయంత్రం భూమిని చేరే కాంతి  బంగారు రంగులో ఉంటుంది.  సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి  గంట ముందు గంట తరవాత కాలాన్ని గోల్డెన్ అవర్స్/ మాజిక్ అవర్స్ అని అంటారు. ఈ సమయంలో  కాంతి వాలుగా పడటం వల్ల   పొడవైన నీడలు ఏర్పడతాయి. ఈ సంధ్యా సమయాలలో లోకం బంగారు రంగులో అద్భుతంగా కనపడుతుంది.

అవుట్ డోర్ సన్నివేశాలు గోల్డెన్ అవర్స్ లో చిత్రీకరించటం ఉత్తమం.  landscapes ..architecture చిత్రీకరణకి మంచి సమయం.కురులు బంగారు రంగులో మెరుస్తూ మంచి portraits చిత్రీకరించవచ్చు. పశ్చిమ దేశస్తులు ఈ కాంతిని చాల అర్థవంతంగా, ఆకర్షనీయంగా చితీకరిస్తారు.  ఉదా:   Days of heaven , Legends of the fall .

మధ్యాన్నం : గోల్డెన్ అవర్స్ అయిపోయిన తరవాత  సుర్యునికి,  భూమికి  మధ్య దూరం తగ్గుతూ  సూర్యుడు నడి నెత్తి  మీదకు వస్తాడు. దాంతో పాటే   కాంతి తీవ్రత పెరుగుతుంది.  ఈ సమయంలో  కిరణాలు నిట్ట  నిలువుగా  తీవ్ర మైన కాంతి ఉంటుంది.గాఢమయిన పొట్టి నీడలని ఏర్పరుస్తుంది.   ఇలాంటి కాంతితో సినిమా చిత్రీకరించటం కష్టం. కాని సన్నివేశ పరంగా  ఉపయోచించు కోవచ్చు. ఈ తీవ్ర మైన కాంతిని  reflect చేసి interior లో చక్కని చిత్రీకరణ చేసుకోవచ్చు.  కొన్ని  సినిమాలు ఈ కాంతిని సమర్థవంతంగా ఉపయోగించు కుంటాయి ఉదా : కౌబోయ్ సినిమాలు.

 కాని ఈ మిట్ట మధ్యానం కుడా  మేఘాలు అడ్డు వచ్చినపుడు కాంతి తీవ్రత తగ్గి కాని కొంచం పలుచగా అవుతుంది. వస్తు నీడల ఘాడత తగ్గుతుంది. ఈ కాంతి చిత్రీకరణకు అనువైనది. కాని మేఘాలు వెళ్ళిపోగానే మళ్ళీ కాంతి తీవ్రమవుతుంది. ఇలాంటి సమయాలలో వస్తువు మీద నేరుగా సూర్యకాంతి పడకుండా రేఫ్లేక్టర్స ద్వార కాంతిని పరావర్తనం చెందింఛి ఛి త్రీకరించుకోవచ్చు.

overcast day:

    ఆకాశం అంతా దట్టమైన కారు మబ్బులు కమ్ముకుంటే సూర్యకాంతి నేరుగా భూమిని చేరదు. సూర్యుడు వచాడా లేదా అన్నట్టు అనిపిస్తుంది. నీలాకాశం, బూడిద రంగులోకి మారుతుంది. కాని ఆకాశం నుండి వచ్చిన మెత్తని కాంతి చుట్టూ పరచుకుంటుంది. కాని ఇది నిర్జీవంగా ఉండి వెలుగు నీడలు ఏర్పరచదు. overcast day లైట్ అంటారు. కొన్ని కథాపరంగా అవసరం అయితే తప్ప ఇలాంటి కాంతి లో చిత్రీకరణ గొప్పగా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో కృత్రిమ కాంతిని కుడా ఉపయోగిస్తే అందమైన చిత్రీకరణని సాధించవచ్చు.

వీనస్ బెల్ట్ :  

మధ్యాన్నం తరవాత కాంతి తీవ్రత తగ్గుతూ సాయంత్రానికి మళ్ళీ  మాజిక్ అవర్స్ తరవాత  కొంచం సేపు ఆకాశం  నీలం, ఉదా, పింక్  కలగలిసి ఒక పట్టి లాగ కనపడుతుంది. దీనినే వీనస్ బెల్ట్ అంటారు ఆ తరవాత ఆకాశం చిక్కని నీలం రంగులోకి మారుతుంది .సరిగ్గా ఈ సమయంలో  విద్యుత్దీపాలు  వెలిగి సహజ కాంతి ..కృత్రిమ కాంతి కలగలిసి  లోకం  ఒక రకమైన వింత శోభ తో దర్శనమిస్తుంది. దీనినే twilight zone   లేదా blue hour   అంటారు. రొమాంటిక్ సన్నివేశాలు..నాటకీయతతో కూడిన సన్నివేశాలు..city scape ఈ సమయం లో చిత్రీకరిస్తే అద్భుతంగా ఉంటుంది.

 

చంద్ర కాంతి :  సూర్యాస్తమయం తో పాటు చంద్రోదయం అవుతుంది. చిక్కని చీకటిలో మెత్తని కాంతి తో కూడిన  చల్లని వెన్నెల పరచుకుంటుంది. కన్ను అతి తక్కువ కాంతిలో కూడా స్పందిన్చగలదు కాని ఫిలిం/సెన్సార్ స్పందిచలేదు అందుకే  సినిమా విషయంలో ఫిలిం/సెన్సార్ మీద సెకండుకు 24 ఫ్రేముల  చిత్రీకరణ సాధ్యపడదు.  అయితే కృత్రిమ కాంతి వనరులని ఉపయోగించి/ day for night effect  ఉపయోగించి చంద్రకాంతి తో చిత్రీకరించినట్టు షూట్ చేసుకోవచ్చు.

అరోరా : 

    సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉందే ప్రదేశాలలో సూర్యకిరణాలు వాతావరణంలోని అణువులని   డీకొని   ఆకాశంలో  రంగుల విన్యాసాలని ఏర్పరుస్తాయి . ధ్రువ ప్రాంతాలైన   ఇది ఆర్కిటిక్  , అంటార్కిటిక్ లలో  సర్వ సాధారణం.

సినిమా అన్నాక కథని బట్టి  అవుట్ డోర్ సన్నివేశాలు, indoor సన్నివేశాలు ఉంటాయి. అయితే సహజ కాంతి ని  సన్నివేశానికి , సన్నివేశం లోని భావానికి  తగ్గట్టు ఎలా ఉపయోగించుకోవాలి అనేది cinimaatographer మీద  ఆధారపడి ఉంటుంది. cinematographer కి వివిధ ప్రాంతాలలో/దేశాలలో కాంతి ఎలా ఉంటుందో అవగాహన ఉండాలి. అందుకే షూటింగ్ కి ముందే ఆ సీజన్లో ని బట్టి ఆ ప్రాంత వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవాలి. దానికి తగ్గట్టు ఎలాంటి ఫిలిం, filters , lights etc   వాడాలి అనే  కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతాడు.

Assignment : ఉదయం నుండి సాయంత్రం వరకు కాంతిగమనించండి. సిటీ లో పల్లెలలో ఉండే కాంతి మార్పుని చిత్రీకరించండి. మీరు చూసే సినిమాలో  కథ/సన్నివేశ  పరంగా రోజులో ఏ ‘ టైం ‘లో ఎలాంటి కాంతి లో  చిత్రీకరిస్తున్నారు గ్రహించండి. వీలైతే  స్నాప్ షాట్స్ తీసుకొని రాసి పెట్టుకోండి.

 

2 Comments
  1. j_ July 6, 2011 /
  2. kondaveeti nani July 22, 2011 /