Menu

మీరూ హిచ్‌కాకియనా?

అదేంటి “మీరూ హిచ్కాకా?” అని అడగాల్సింది పోయి “హిచ్కాకియనా?” అని అడుగుతున్నాడేంటానీ చూస్తున్నారా?

ఆల్‌ఫ్రేడ్ హిచ్కాక్ ఎంత గొప్ప దర్శకుడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక వ్యక్తి హిచ్కాక్ లాంటి ఆలోచనా ధోరణిని ఎలా అలవర్చుకోవాలో మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఎన్నో నిద్రలేని రాత్రులు, వందల సినిమాలు, గంటల తరబడి చేసిన బ్రౌసింగ్, రోజుల తరబడి చేసిన రిసర్చ్…ఇవన్నీ ఆ మనిషినీ, అతని ట్రేడ్‌మార్క్ని క్లుప్తంగా అర్ధం చేసుకోవడానికి నాకు సహాయపడ్డాయి. అందుకనే అతని కంటే అతని పనితనం గురించి చెప్పాలని అనుకున్నాను.

నేడు ప్రపంచంలో అపారమైన తెలివితేటలు, అద్బుతమైన సామర్ద్యం ఉన్నాయి అని నిరూపించుకున్న క్రిస్టొఫర్ నోలన్, డేవిడ్ ఫించర్, స్టీవెన్ స్పీల్‌బర్గ్, టెర్రీ గిలియం అందరూ హిచ్కాక్ని ఎక్కడో ఒక దగ్గిర అనుసరించినవారే, అతని నుండి స్పూర్తి పొందినవారే. అసలేంటి ఈ “హిచ్కాకియన్”అని అనుకుంటున్నారా?

మీరు రాసుకున్నకథలు కానీ, పాత్రలు కానీ, చెప్పాలనుకున్న విధానంకానీ, ఎన్నుకున వస్తువులుకానీ వీటిని పోలి ఉంటే మీలో కూడా ఒక ఆల్‌ఫ్రేడ్ హిచ్కాక్ నిద్రపోతున్నాడని అర్ధం. తెలుసుకోండి. అతన్ని నిద్ర లేపండి.

 1.   కూల్ ప్లాటినమ్ బ్లాండ్. (మీ కథలో ముఖ్యపాత్రకి గనుక ఒక మేరిలిన్ మోన్రో లా తెల్లటి జుట్టు ఉన్నట్టయితే).
 2. క్రూరంగా, అధికారంగా ప్రవర్తించే తల్లి.
 3. నేరం మోపబడిన ఒక అమాయక వ్యక్తి.
 4. టెన్షన్ ని తారా స్థాయికి తీసుకెళ్ళడానికి ఆక్షన్ ని ఒకే లోకేషన్ కి పరిమితి చేయడం.
 5. నమ్మకద్రోహులైన పాత్రలు లేదా సమయం చూసి వర్గాన్ని మారే పాత్రలు.
 6. పాత్రలని తీసుకెళ్ళి చావో-బ్రతుకో అన్న సన్నివేశాల్లో పడేయడం.
 7. సాధారణ మనుషుల్ని భయంకరమైన లేదా వింత సన్నివేశాల్లోకి తోసేయడం.
 8. వింతగా ప్రవర్తించే లేదా సామర్ధ్యం లేని అధికారులు, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్లు.
 9. రాబోతున్నదురదృష్టాన్ని చెప్పడానికి చీకటిని సంకేతంగా వాడడం. (నల్లటి బట్టలు, నీడలు, పొగ లాంటివి).
 10.   ప్రేక్షకులని తప్పు పట్టించడానికి సృష్టించిన తప్పుడు పాత్రలు. (కథ చివరి వరకు అవి తప్పుడు పాత్రలు అని కలలో కూడా ప్రేక్షకుడు ఊహించలేకపోవడం).
 11. మీ కథలో కూడా పాత్రలు, సన్నివేశాలు ఈ విధంగా ఉన్నట్టయితే, మీకు సస్పెన్‌స్ కథల మీద మంచి పట్టుఉన్నట్టే. కానీ దాన్ని సాన పెట్టండి.

Before ending up this “Hitchcockian ” article, i would like to write a bunch of lines about one of the Hitchcock’s movies which left a deep scar on my brain cells. The movie is “Psycho”. After watching this movie, i didn’t talk to anyone for a couple of days. I thought so deep and so deep about the way the story was told, the way the suspense was unfolded, the way the characters were fabricated that i immediately discovered the deep rooted passion in me to tell stories.

My Anatomy on Psycho:

One name…’Norman Bates’ and one scene…’Shower scene’ completely changed the definition of horror and the way we look at motels, enjoy the shower!. ‘Psycho’ gives you goosebumps and pushes your butt to the edge of the seat and after the movie, if you look at your nails, they were already half bitten in order to resist psycho’s thrill, confront its enigma. Every frame of the movie looks like it is utterly calculated and organised. And every camera angle provides detail and claustrophobic feel. And a climax which gives a feeling of nothing less than a missile about to explode right inside your head.

That’s the kind of scenario and ambience Hitchcock sets in your mindspace and was widely regarded as one of the best directors ever lived. With a reputation for manufacturing & injecting horror, thrill and suspense into viewers’ minds, he’s sometimes referred to as the “Master of Suspense.” He inspired the adj. “Hitchcockian” for suspense thrillers. That’s the reason i dig him. I love his dark humour and dry wit. All his creations have their core element ‘suspense’ but i wrote ‘psycho’, coz i learnt a lot from it. (plot, characters, secrecy, unfolding, mood, suspense, pace, some stunning cinematography, attention to details and the last of all…a great climax). To me,watching psycho is like attending a filmschool workshop. In a word, Psycho, Every wannabe filmmaker’s bloody mandatory recipe.

నేను సైకో గురించి ఇక్కడ ఎక్కువగా చెప్పకపోవడానికి కారణం, మీరు చూడబోయే సన్నివేశాల్లో ఉండే టెన్షన్, పాత్రల మనస్తత్వాలు, కేమరా కదలికలు, కథలో మార్పులు మీరు నేర్చుకోవడం కావాలి నాకు. నేను చెప్పడం కాదు.

Ciao.
Phanindra Narsetti.

4 Comments
 1. j_ July 12, 2011 /
 2. shree July 14, 2011 /
 3. hemanth July 15, 2011 /
  • chinna July 17, 2011 /