Menu

డిజిటల్ SLR – సినిమాటోగ్రఫీ

 

ఎన్నో రకాల options/features తో   వీడియో చిత్రీకరించే డిజిటల్ video కెమెరాలు ఎన్నో అందుబాటులో ఉండాగా..స్టిల్ ఫోటోగ్రఫి కోసం తయారు చేయబడిన  డిజిటల్ SLR నే ఎందుకు సినిమాటోగ్రఫీ కి వాడుతున్నారు ?

డిజిటల్ SLR కెమెరాలు ప్రొఫెషనల్ స్టిల్ ఫోటోగ్రఫి కి ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి. మరి ఉన్నట్టుండి ఒక్కసారిగా డిజిటల్ SLR కెమేరా తో సినిమాటోగ్రఫీ అన్న విషయం ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది  ?

వీడియోకెమేరా:

  1. మొదటినుంచీ వీడియో కెమెరాల ఉపోయోగమే వేరు. అవి ముఖ్యంగా domestic & మార్కెట్ broadcasting   television కు కావలసిన అవసరాలని దృష్టిలో పెట్టుకోని  తయారు చేయబడింది.
  2. డిజిటల్ వీడియో కెమెరాలు ‘సినిమా’ లుక్ ఇవ్వలేకపోవటానికి కారణం .. వీడియో కెమెరాల depth of filed ఎక్కువగా ఉండటమే. అంటే వీడియో కెమెరాలతో చిత్రీకరించినపుడు ఈ depth of filed ఎక్కువగా ఉండటం వల్ల  దృశ్య పరమైన రసానందం కలిగించలేక పోయింది.
  3. లెన్స్ లు   మార్చుకోగల సదుపాయం అన్నివీడియో కెమెరాలలో లేదు.
  4. వీడియో కెమెరాలలో ఉండే సెన్సార్ సైజు చాలా తక్కువ. దృశ్యం నాణ్యత ‘సినిమా’ ని అందుకోలేదు.

డిజిటల్ SLR :

ఇక డిజిటల్ SLR  ‘స్టిల్  ఫోటోగ్రఫి మార్కెట్టు అవసరాలని  దాదాపుగా తీర్చగలిగింది. చిత్రీకరణ  సులువు అయ్యి  పని వేగం పెరగటం తో స్టిల్ ఫోతోగ్రఫేర్లు  అందరూ డిజిటల్ వైపు మొగ్గు చూపక తప్పలేదు.  అన్ని డిజిటల్ కెమెరాల్లో లాగే   డిజిటల్ SLR లో వీడియో క్లిప్స్ తీయగల సదుపాయం ఉన్నప్పటికీ  ఆది సినిమాకి కావలసిన ‘నాణ్యత ‘ ఇవ్వలేకపోయింది.
కనక అప్పట్లో DSLR సినిమాటోగ్రఫీ గురించి   ఎవ్వరూ ఆలోచించలేదు.


డిజిటల్ సెన్సార్ :
వీడియో/ స్టిల్ కెమెరాలలో వాడే డిజిటల్ సెన్సార్   ఫిలిం సైజు కంటే ( 35mm x24mm ) తక్కువగా ఉండటం  వల్ల నాణ్యత పరంగా 35mm ఫిలిం తో సరిసమానమైన  దృశ్యాలని ఇవ్వలేకపోయింది. నాణ్యత పక్కన పెడితే దృశ్య సైజు లో కూడా చాల వ్యత్యాసం ఉంది.  డిజిటల్ కెమెరాలతో చిత్రీకరించినపుడు.. డిజిటల్ తో చిత్రీకరించిన దృశ్యం ఫిలిం దృశ్యాని కంటే తక్కువగా ఉంటుంది. దీనిని  crop   factor అంటారు. అంటే ఉదాహరణకి 50mm లెన్స్ తో డిజిటల్ కెమెరాతో  చిత్రీకరించబడిన దృశ్యం,   ఫిలిం కెమేరాతో 75mm లెన్స్ తో తీసిన దృశ్యం సైజు తో సమానంగా ఉంటుంది. అంటే  డిజిటల్ కెమేరాతో   చిత్రీకరించిన దృశ్యం సైజు లో  తరుగుదల ఉంటుంది. దీనికి కారణం సెన్సార్ సైజు,  ఫిలిం సైజు కంటే తక్కువగా  ఉండటమే.

ఫుల్ సైజు డిజిటల్ సెన్సార్ :
digital సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకీ ముందంజ వేస్తుండటంతో ‘క్రాప్ ఫాక్టర్’ ని తొలగించటానికి   ఫుల్ సైజు డిజిటల్ సెన్సార్ ని కనుగొన్నారు. అంటే 35mm ఫిలిం సైజు  (35mmx24mm ) కి సరి సమానమైన సైజు .  అప్పుడు ఒక్కసారిగా డిజిటల్ SLR కెమెరాల పనితనమే మారిపోయింది. అంతకు ముందుకంటే ఎన్నోరెట్ల   క్వాలిటీ గల దృశ్యం తీయటం సాధ్యం అయ్యింది.  దాంతో పాటుగా SLR లో ఉన్న వీడియో ఆప్షన్ తో  మంచి quality గల వీడియోతో పాటు తక్కువ depth of field   ‘సినిమా’ లుక్ ఇవ్వగలిగింది.
ఇదొక్కటే DSLR కాక ఎన్నో  రకాల advantages కలిగి ఉండటం తో అందరి దృష్టి ఒక్కసారి డిజిటల్ DSLR సినిమాటోగ్రఫీ వైపు మళ్ళింది.

డిజిటల్ SLR  ఉపయోగాలు:

  1. సినిమాటోగ్రఫీ కెమెరాలు..వీడియో కెమెరాలతో పోలిస్తే డిజిటల్ SLR camera సైజు చిన్నది.  flexible గా వాడుకోవచ్చు.  ప్రత్యేకించి అసాధారణ కెమెరా angles.. fallowing shots ..సులువుగా చేసుకోవచ్చు.
  2. స్నోరి కాం షాట్స్.. లాంటి ప్రయోగాలు సులభం గా చేసుకోవచ్చు.
  3. సెన్సార్ సైజు పెద్దది అవటం వల్ల..దృశ్య నాణ్యత బాగా ఉంటుంది.
  4. inbuilt filters.
  5. ISO మార్చుకోగల సదుపాయం .
  6. low  light conditions లో కూడ నాణ్యమైన దృశ్యీకరణ సాధ్యం.
  7. తక్కువ depth of filed ఉండటం తో సినిమా ‘లుక్’ ( ఇది ఒక రకంగా disadvantage కూడా )
  8. extreme wide angle లెన్స్ లు ఉపయోగించ వచ్చు.
  9. సినిమా వీడియో ..డిజిటల్ సినిమాటోగ్రఫీ కెమెరాలతో పోలిస్తే  కెమేరా ఖరీదు చాల తక్కువ.
  10. తక్కువ ఖర్చుతో  grip /support systems.
  11. converter ల సహాయంతో ప్రస్తుతం 35mm ఫిలిం కెమేరా లెన్స్ లు, photography  లెన్స్ లు  కూడా ఉపయోగించుకునే  సదుపాయం.
  • Dead pixels
  • aliasing
  • over heating.
  • rolling shutter    లాంటి problems ఉన్నప్పటికీ  త్వరలోనే అన్నింటిని అధిగమించే అవకాశం కనబడుతోంది. 35mm కంటే పెద్ద సెన్సార్ ఉండే  మీడియం ఫార్మటు లేదా large ఫార్మటు కేమేరాలకి కూడా video option వస్తే   సినిమాటోగ్రఫీ ఉహించలేనంతగా  మారిపోవటం ఖాయం.
10 Comments
  1. శంకర్ June 15, 2011 / Reply
    • కమల్ June 16, 2011 / Reply
      • శంకర్ June 16, 2011 /
    • chakradhar June 16, 2011 / Reply
      • శంకర్ June 16, 2011 /
      • chakradhar June 16, 2011 /
      • శంకర్ June 18, 2011 /
  2. సుజాత June 18, 2011 / Reply
    • శంకర్ June 18, 2011 / Reply
  3. srinu August 13, 2011 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *