Menu

ఎందుకో నచ్చింది.

ఎందుకో నచ్చింది. పాటలో..మాటలో.. నటనో..స్టైల్ లో .. సినిమాటోగ్రఫీ నో.. నేపథ్య సంగీతమో.. హీరో హీరోయిన్ ల మధ్య రొమాన్సో.. అన్ని కలిపో..విడివిడిగానో.. తెలిదు.. కాని నచ్చింది.    థింక్ పాజిటివ్ అన్నారు పెద్దలు అందుకే ఎంత సేపు తెలుగు సినిమాని తిట్టకుండా ‘నచ్చిన సినిమా’ గురించి చెప్పాలి అని అనిపించి ఈ వ్యాసం.

 

టూకీ గా కథ:
ఆకలి కోసమో,  డబ్బుకోసమో.. ..పాత కక్షో…తెలిదు కాని ఓ హత్య చేసి పారిపోయి సిటీ కొస్తాడు. అన్నం పెడితే చాలు విశ్వాసం చూపే అనాధ..అందుకే ఆకలి కడుపును చూసి అన్నం పెట్టు అన్న సాధు అంటే  అభిమానం అతనికి. సాధు పెంపకంలో పెరిగి పెద్దయి..ప్రొఫెషనల్ కిల్లెర్ గా ఎదిగిన అతడు, opposition లీడర్  హత్య కోసులో చిక్కునోని..తప్పించుకొని పారిపోతుంటే………….., ఎప్పుడో చిన్నపుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి  పెరిగి పెద్దయి..తనవాళ్ళు ఇంకా తనకోసం వెతుకుతున్నారని  తెలిసి..సొంత ఉరికి  బయలు దేరిన  ‘పార్థు’ అనే ఓ యువకుడితో  మాటలు కలపాల్సోస్తుంది. కాని దురదృష్టవశాత్తు.. తనకి తగలాల్సిన  బుల్లెట్టు అతనికి తగిలి చనిపోతాడు. ఇక వేరే దారి లేక పార్థుగా ఆ ఇంటికి వెళతాడు.
ఆ ఇంట్లో  ప్రేమించే మనుషులు దొరుకుతారు. అనాధగా పెరిగిన తనకి ఇల్లంటే ఇలా ఉంటుందా అని అతని  ‘కిల్లెర్’ గుండె కూడా చెమ్మ గిల్లుతుంది. దానికి తోడు , తనని కావాలనుకునే ‘పూరి’. అమ్మాయికి ఆమడ దూరంలో ఉండే అతనికి ..’పూరి’ని ఎలా ప్రేమించాలో  తెలియదు. ఎలా చెప్పాలో అసలే తెలిదు. అందుకే గోడ బద్దలు కొట్టి ఇంకెలా చెప్పను అంటాడు.
గుండెనిండా ప్రేమ..కాని ఎలా వ్యక్తం చేయాలో తెలిదు.. అందుకే ఇద్దరి మధ్య ఉన్న తలుపు ఎలా తెరవాలా  అని ఆమె ఆరాటం ..ఎప్పుడు తెరుచుకుంటుందా   అని అతని నిరీక్షణ.
పొలాన్ని  ఆక్రమించుకోకుండా కాపాడతాడు. పూరి అక్కయ్య పెళ్ళికి ధన సహాయం చేస్తాడు. పార్థువల్ల నష్టపోయిన వాళ్ళకి సహాయం చేస్తాడు.

ఇంకోవైపు నుండి  సిబిఐ అతన్ని వెతుకుతూ వస్తుంది. పూరి అక్కయ్య పెళ్లి అయిపోవటం సిబిఐ వాళ్ళ ద్వారా పార్థు పార్థు కాదని.. పార్థు ప్రమాదవశాత్తు చనిపోయాడని ..అతని స్థానంలో ఉన్నది ఓ ప్రొఫెషనల్ కిల్లర్ అని ఆ ఇంటివాళ్ళ కి తెలుస్తుంది. సిబిఐ వాళ్ళకి దొరక్కుండా మళ్ళీ  ఆ ఇంటికి వస్తాడు. తను సంజాయిషీ చెప్పుకోవలసిన మనుషులు ఇద్దరు ఉన్నారని తను వాళ్ళని మోసం చేయాలను కోలేదనీ..’పార్థు’ గా ఉండిపోవాలని అనుకోలేదని  సూటిగా ..నిజాయితీగా చెపుతాడు.
ఆతడు  ప్రొఫెషనల్ కిల్లర్ అయితే కావచ్చు  కాని అతని మంచితనం , సహాయం చేసేగుణం అన్నింటికీ మించి ‘పార్థు’గా ఆ కుటుంబాన్ని ప్రేమించినతత్వం అతన్ని పార్థుగానే ఉండిపోమ్మంటాయి. అతడు కుడా అలా ఉండిపోవటానికే నిర్ణయించుకుంటాడు.

‘ప్రేమ’ అదొక్కటే  మనిషిలోని మానవత్వాన్ని మేలుకొలుపుతుంది.

నచ్చిన అంశాలు:

మణిశర్మ సంగీతంలో అన్ని  పాటలు.. బాక్గ్రౌండ్ స్కోరు కుడా చాల బాగుంటుంది ఈ సినిమాలో.
” ఎవరని ఎదురు నిలిస్తే..పలికే బదులతడే..తర తరాల నిశీది దాటే నిప్పుకణం అతడే. ”  మహేశబాబు ని మహా stylish గా చూపించే  పాట ఇది. దృశ్య  పరంగా..పాట పరంగా..మహేష్ ఆకాశం అంత ఎత్తున కనపడతాడు..ముఖ్యంగా అభిమానులకి.
‘పిల్లగాలి అల్లరి వాళ్ళంతా గిల్లి’…ఈ పాటతో పార్థు రాకతో..ఆ ఇంట్లో వెల్లివిరిసిన ఆనందాలు చూస్తాం.

తను చాల అందంగా ఉంటుందని ఫీల్ అయ్యే పూరిని,  ఏమాత్రం పట్టిచుకోకుండా ..ఎం బావుంటావ్ ? ఎవరన్నారు ? ఏదో నీవు బాధపదతావ్ అని అలా అంటున్నారు కాని నీవు పెద్దగా బావుండవు అంటాడు ..  కోపం.. ఉక్రోషం పట్టలేని   “పూరి” అతన్ని పడగొట్టా టానికి  పడే కష్టాలతో మొదలైన రొమాన్సు, కోపాలు ..తాపాలు..పోట్లాటలు ,  చూపులు..మాటలు..సరసాలు, సైగలు, ముద్దులు, మురిపాలతో   రక్తి కట్టిస్తాయి. కొన్ని సన్నివేశాలు మనకి ఏవో పాట జ్ఞాపకాలని కుడా  గుర్తుకు తెస్తాయి.  ఈ సన్నివేశాలకి తగ్గట్టు “చందమామా చందమామా వింటర్ లో  విడిగా ఉంటానంటావేమ్మా..”,   ” ఔను నిజం నేవంటే నాకిష్టం.” , “నీతో చెప్పనా నాక్కూడా తెలిసినా..”  అనే పాటలు సందర్బానుసారంగా వస్తాయి.  పాటల్లో సాహిత్యం చాలా చోట్ల ‘పాత్రల’ మనసులోతులని  తెలియజేస్తూ ఉత్తమంగా ఉంటాయి.

మనసు ఆనందంగా ఉన్నపుడు మనసుకు నచ్చిన వాళ్ళు ఎదురుగా ఉంటే, వాళ్ళతో కలివిడిగా ఉండాలని మనసు ఆరాటపడుతుంది.  అందుకే అక్కయ్య పెళ్ళిలో  ‘ పిలిచినా రానంటావా..కలుసుకోలేనంటావా..నలుగురూ ఉన్నారంటావా ” అని అడుగుతుంది పూరి .  ప్రేమలో పడిన మనసులు,  ఏకాంతంగా కలుసుకోవాలని పడే తపనగా భలేగా ఉంటుంది.

పాటలన్నీ సంగీతం, సాహిత్యం,దృశ్యం చాల బాగా అల్లుకుపోయి  ఆనందాన్ని కలిగిస్తాయి.   ‘పూరీ’ గా  త్రిష మళ్ళీ హోణీ కట్టి..తెలుగు అమ్మాయిగా బాగా కనిపించింది. బాడి లాంగ్వేజ్ ,చూపులు,  హావ భావాలతో బాగా  ఆకట్టుకుంది.

ఇక మాటలు అయితే చెప్పనే అక్కరలేదు. అవే సినిమాని ఆద్యంతం రసవత్తరం గా నడిపించింది.
సినిమాటోగ్రఫీ చాలా బావుంటుంది . lighting ..compositions..camera movements .. చాల బాగా కుదిరాయి. దృశ్యాలలో  అడుగడుగునా మంచి నాణ్యత కనిపిస్తుంది. అన్నిరకాల ప్రేక్షకులని అలరించే సినిమా ఇది.

సినిమా హిట్ అయ్యిందో లేదో తెలియదు ..ఎందుకో కాని నాకు చాల బాగా నచ్చింది.అందుకే  మళ్ళీ మళ్ళీ చూస్తుంటాను.    మీకూ నచ్చిందా ???

19 Comments
 1. రమణ June 7, 2011 /
 2. Anupama June 7, 2011 /
 3. Anupama June 7, 2011 /
  • jd_ June 7, 2011 /
  • jd_ June 7, 2011 /
   • nagesh June 7, 2011 /
 4. శంకర్ June 7, 2011 /
 5. Sanjeev June 8, 2011 /
 6. anil kumar June 8, 2011 /
 7. శ్రీ June 9, 2011 /
 8. swechaa June 9, 2011 /
 9. naresh nunna June 10, 2011 /
  • chakri June 13, 2011 /
   • naresh nunna June 13, 2011 /
   • chakri June 13, 2011 /
 10. పులి రాజా June 16, 2011 /
 11. bystander July 12, 2011 /
  • చక్రధర్ July 12, 2011 /
 12. సామ్రాజ్ఞి July 13, 2011 /