Menu

Monthly Archive:: June 2011

దృశ్యమేతప్ప కావ్యంలేని ప్రేమకథ : 180 (ఈ వయసిక రాదు)

నటీనటుల కాంబినేషన్ నుంచీ టైటిల్ డిజైన్, ప్రోమోలవరకూ విపరీతమైన ఆశల్ని, క్రేజ్ ని ఈ మధ్యకాలంలో సంపాదించుకున్న చిత్రం  180 (ఈ వయసిక రాదు). ముఖ్యంగా ప్రోమోలు, పాటల్లోని దృశ్యాల పొందిక టివిల్లోచూసిన ఎవరైనా ఖచ్చితంగా ఇదొక దృశ్యకావ్యమని నిర్ణయించుకోవడంలో ఎలాంటి తప్పూలేదనుకుంటాను. ఇదొక గొప్ప ప్రేమకథ అని సిద్దార్థ పదేపదే చెప్పడం, ఇద్దరు అందమైన హీరోయిన్లూ తమ చిలక పలుకులతో ఆ విషయాన్ని నొక్కివక్కాణించడంతో ఒక దృశ్యకావ్యాన్ని చూద్దామన్న ఆశతో వెళ్ళిన ప్రేక్షకుడికి కొంత నిరాశ

అబ్బురపరిచే ‘అరణ్యకాండం’

2010 మధ్యలో అనుకుంటా ఒక యుట్యూబ్ లో తమిళ్ షార్ట్ ఫిల్మ్ కొన్ని చూస్తూ ఒక సినిమా ప్రోమో ఒకటి చూశాను. చూడగానే “వావ్” అనిపించింది. ఆ సినిమా పేరు ‘అరణ్యకాండం’. ఆ తరువాత సినిమా అగిపోయిందనో, పూర్తవలేదనో, కేవలం ఫిల్మ్ ఫెస్టిల్స్ కోసం తీశారనో ఇలా చాలా రూమర్స్ వచ్చాయి. ఆ తరువాత ఏమీ న్యూస్ లేదు. మధ్యలో ఎప్పుడో South Asian International Film Festival లో Grand Jury Award for Best

ఒక కవిత్వ ప్రేమికుడి ఉద్విగ్న గాథ – ద పోస్ట్ మాన్

ఆంటోనియో స్కార్మెటా స్పానిష్ నవల ఎల్ కార్టెరో డి నెరూడా కు ఇంగ్లిషు అనువాదం ద పోస్ట్ మాన్. ఈ ఆత్మీయ పుస్తకం గురించి రాయాలంటే అందులోని ఇతివృత్తం నాకు పరిచయమయిన దగ్గర మొదలుపెట్టాలి. అసలు అలాంటి పుస్తకం ఒకటి ఉన్నదని తెలియడానికి చాలముందే ఆ ఇతివృత్తంతో నా ప్రేమ మొదలయింది గనుక ఆ ఎనిమిదేళ్ల కథ చెప్పాలి. నేనప్పుడు హైదరాబాదు ఎకనమిక్ టైమ్స్ లో పని చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఆయన

మంచి సినిమా

సినిమా అంటే ఏంటి ? • దాదాపు 500 వందల మంది ఒక చీకటి గదిలో కనే ఒక సామూహిక స్వప్నమా? • ఒక దర్శకుడు తన జీవితంలోని అనుభవాలను కాచి వడబోసి సృష్టించిన రంగులతో చిత్రించిన ఒక దృశ్యకావ్యమా? • మనలోని బలహీనతలను సొమ్ముచేసుకోవడానికి కొంతమంది చేసే ప్రయత్నమా? సినిమా అంటే ఇదీ అని నిర్వచించడం చాలా కష్టం. Pirates of the Caribbean సినిమా తీసుకోండి లేదా స్పైడర్మ్యాన్ (Spiderman 3) సినిమా తీసుకోండి. అందులో

ఒక “పోస్ట్ మ్యాన్” జ్ఞాపకాలు

ఈ మధ్య కాలం లో చాల రోజుల తర్వాత ఫేసుబుక్ మిత్రుని (మహేష్ కుమార్ కత్తి) పుణ్యమా అని రెండు అందమైన లఘు చిత్రాలు చూడగలిగాను. ఒకటి అద్వైతం(తెలుగు) రెండు పోస్ట్ మాన్ (తమిళం). ఈ రెండు నన్ను చాల అమితంగా ఆకట్టుకున్నాయి. పోస్ట్ మాన్ చిత్రం విషయానికొస్తే ఓ అందమైన గ్రామం లో ఆత్మీయ సందేశాలను చేరే వేసే ఓ ఇంటివ్యక్తిగా పరిగణించే పోస్ట్ మాన్ కథ. ఇంటింటికి వెళ్లి వారి ఉత్తరాలను చేర వేస్తూ.