Menu

స్నోరి క్యామ్

స్నోరి క్యామ్ గురించి విన్నారా?

హ్యాండీ క్యామ్, స్టడీ క్యామ్ లాగా స్నోరి క్యామ్ అనేది కెమెరాని ఆపరేట్ చేయడంలో ఒక కొత్త విధానం. ఈ టెక్నిక్ గత నలభై ఏళ్ళగా ఉన్నప్పటికీ ఈ మధ్యనే దీని ఉపయోగం కాస్త ఎక్కువవుతోంది. దీనినే సినిమా పరిశ్రమలో పని చేస్తున్న వారయితే బాడీ రిగ్ అని కూడా అంటారు. కెమెరా నటీ నటుల శరీరానికి (body) కి రిగ్ చేస్తారు కాబట్టే దీన్ని బాడీ రిగ్ అంటారు.

ఎందుకీ పేరు?

ఈ టెక్నిక్ ను Eidur Snorri మరియు Einar Snorri అనబడే ఇద్దరు సోదరులు మొదటి సారిగా కనిపెట్టారు.

ఇంతకీ ఏంటి దీని ప్రత్యేకత?

కెమెరా నటి/నటుడు శరీరానికి attach చెయ్యబడి ఉంటుంది కాబట్టి కెమెరా కి మరియు నటి/నటులకు మధ్య relative గా movement ఉండదు కాబట్టి నటి/నటుడు కదుల్తున్నప్పుడు కెమెరా దృష్టిలో వారు స్థిరంగానూ చుట్టుపక్కలంతా కదుల్తున్నట్టుగానూ కనిపించి ఒక వింత ఫీలింగ్ ని కలుగచేస్తుంది. ఈ టెక్నిక్ ఉపయోగించి గతంలో Mean Streets, Lock Stock and Two smoking Barrels లాంటి సినిమాలో కొన్ని సీన్లు చిత్రీకరించినప్పటికీ ఈ టెక్నిక్ ను పూర్తి స్థాయిలో effective గా ఉపయోగించుకుంది మాత్రం Requiem For a Dream అనే సినిమాలో.

మన దేశంలో Dev D సినిమాలో ఈ టెక్నిక్ ను ఎంతో సమర్థవంతంగా ఉపయోగించాడు దర్శకుడూ అనురాగ్ కశ్యప్.

ఉపయోగాలు:

Character యొక్క confused state of mind ని ఈ టెక్నిక్ ద్వారా చూపించవచ్చు. కాకపోతే ఈ రకమైన టెక్నిక్ అతిగా  ఉపయోగించినా కూడా ప్రేక్షకులకు తలనొప్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి.

ఎక్కడ దొరుకుతుంది:

స్నోరీ క్యామ్ ఎఫెక్ట్ కోసం బాడీ రిగ్స్ దొరుకుతున్నప్పటికీ చిన్న బడ్జెట్ సినిమాలు, లఘు చిత్రాలు, డిజిటల్ ఫిల్మ్ కోసం సొంతంగా ఒక బాడీరిగ్ ని మనమే తయారు చేసుకోవచ్చు. దానికంటే ముందు స్నోరీ క్యాం effect ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మీ మొబైల్ ఫోన్ ని మీ కుడి చేతిలోకి తీసుకుని కెమెరా లెన్స్ మీ వైపు పెట్టుకుని కెమెరా ని కదల్చకుండా పట్టుకుని మీరు మీ ఇంట్లోని/ఆఫీస్ లోని ఒక రూం లో నుంచి మరో రూం లోనికి నడిచి ఆ వీడియోని ప్లే చేసి చూసుకోండి.

అంత ఓపిక లేని వారికి, స్నోరీ క్యామ్ డెమో వీడియో మరియు స్నోరీ క్యామ్ కోసం బాడీ రిగ్ ఎలా నిర్మించుకోవాలో ఈ క్రింది వీడియోలు చూసి తెలుసుకోండి.

స్నోరీ క్యామ్ డెమో

Body Rig

8 Comments
  1. శి. రా. రావు November 28, 2009 / Reply
  2. రాజశేఖర్ December 1, 2009 / Reply
  3. srinivas November 5, 2010 / Reply
    • jd.srinu June 1, 2011 / Reply
  4. Sripal Sama June 5, 2011 / Reply
  5. don harish June 6, 2011 / Reply
  6. nagesh June 6, 2011 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *