Menu

రన్నింగ్ కామెంట్రీ: డిజిటల్ వైపు ఓ లుక్కెయ్యండి

ఇప్పుడంటే డిజిటల్ టెక్నాలజీ వల్ల రకరకాల ప్రయోగాలు సులభమయ్యాయికానీ మొదట్లో సినిమాలకి టైటిల్స్ వెయ్యడం అనేది చాలా వ్యయప్రయాసలతో కూడిన పని. హాలీవుడ్ స్టూడియోలు తమ బ్రాండ్ లోగోపైన టైటిల్స్ వేస్తూండెవారు ముప్పైల వరకు. ఈ రోజుల్లో ప్రత్యేకమైన డిజైన్ ఏమీ ఉండేదికాదు, ఒకే రకమైన fontను అందరూ వాడేసేవారు. తర్వాత టైటిల్ డిజైన్‍కు ప్రత్యేకంగా ఒక ఆర్టిస్ట్ ను పెట్టుకోవడం మొదలుపెట్టారు. MGM వాళ్ళు తమ సినిమాలకు ఈ రకంగా ఆర్టిస్టులు తయారు చేసిన టైటిల్స్ ను glassపై అతికించి కెమెరా ముందు ఉంచడం ద్వారా టైటిల్స్ రికార్డ్ చేసేవారు. యాభైల్లో Hitchcock-Saul ద్వయం అయితే టైటిల్స్ అయ్యేలోపు ఆడియన్స్ సినిమా మూడ్‍లోకి వచ్చేసేలా వాళ్ళ టైటిల్స్ డిజైన్ చేసుకునేవాళ్ళు. ఈసారి హిచ్‍కాక్ సినిమా చూసేప్పుడు గమనించడం మర్చిపోకండి. ఆ తర్వాతి కాలంలో ఇది ఒక కళగా రూపాంతరం చెంది, ఇప్పుడు ఒక స్టాండర్డ్ సినిమా క్రాఫ్ట్ అయిపోయింది. 100% లవ్ సినిమా చూసిన చాలామంది టైటిల్స్ అదుర్స్ అంటూ పొగిడేస్తుంటే ఎందుకో ఈ వీడియో పంచుకోవాలనిపించింది. హాలీవుడ్‍లో టైటిల్ చరిత్రను ఒకసారి మననం చేసుకుంటే గమ్మత్తుగా ఉంటుంది.

RED Digital Cinema Company వాళ్ళు కొత్తగా విడుదల చేసిన RED Epic కెమెరాతో తీసిన ఓ చిన్న వీడియో ఇక్కడ. డిజిటల్ కెమెరాలను వాడడానికి విముఖత చూపించడాడినికి ప్రధాన కారణాలలో ఒకటైన డైనమిక్ రేంజ్ సమస్యను ఈ కెమెరా అధిగమించేస్తుంది. అలానే ఇప్పటికే ప్రాచుర్యం పొందిన RED One కంటే ఇది పరిమాణంలో కూడా చిన్నగా ఉండి భారీతనాన్ని తగ్గిస్తుంది. వీడియో పూర్తిగా లోడ్ అయ్యేవరకు ఉండి అప్పుడు ప్లే చెయ్యఓడి.

REDకు పోటీగా ఇప్పుడు అన్ని ప్రముఖ పిల్మ్ కెమెరా కంపెనీలు డిజిటల్ కెమెరాలు తయారు చెయ్యడం మొదలుపెట్టేసాయి. Arri వాళ్ళు మొదట D-20/21లతో తాము డిజిటల్‍కి వ్యతిరేకంకాదని నిరూపింఉకున్నారు. ఇప్పుడు Arri Alexaతో తాము పూర్తిగా డిజిటల్ కెమెరాల వైపు ప్రయానిస్తున్నామని చెప్పకనే చెబుతున్నారు. ఒక ఆస్ట్రేలియన్ కంపెనీ వాళ్ళు ఈ కెమెరాను సరదాగా ఇలా పరిచయం చేస్తున్నారు.

panavision genesis, sony cine-alta, F35, Thomson Viper వంటి 2K కెమెరాలు కూడా ఇప్పటికే చాలా ప్రాచుర్యమ్లో ఉన్నప్పటికి కొత్తగా వచ్చిన 3K-5K కెమెరాలు వీటిని మరుగున పరచె అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ డిజిటల్ టెక్నాలజీ చరిత్రను తెలుసుకోవడానికి వీటి గురించి తెలుసుకోవడం కూదా చాలా అవసరం. ఒక కెమెరామెన్ షూటింగ్‍కి ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తే లొకేషన్లో మిగతావాళ్ళ పని అంత సులభతరంగా ఉంటుంది. కెమెరాని షూటింగ్‍కి అనువుగా రకరకాల పరికరాలతొ ముస్తాబు చేయడానికి అసిస్టెంట్ కెమెరామెన్లు ఎలా పని చేస్తారో ఈ వీడియోలో చూడండి.

ఇక చివరిగా ఒక టెక్నికల్ బిట్. Depth of Field గురించి ఎంతో అనుభవం ఉన్న కెమెరా ఆపరేటర్లు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అసలు DOF అంటే ఏంటి, కెమెరాలోని apertuter, shutter మొదలగు సెట్టింగ్స్ ఎలా optimize చెయ్యాలి వంటి విషయాలు ఈ వీడియోలో అద్భుతంగా వివరించారు. ఒకసారి చూసి మీ పరిజ్నానాన్ని మరింత మెరుగు పరచుకోండి.

4 Comments
  1. కమల్ May 19, 2011 /
    • శంకర్ May 20, 2011 /
      • కమల్ May 20, 2011 /
      • శంకర్ May 20, 2011 /