శ్రమ లేకుండా మీరే షాట్ డివిజన్ చేసుకోండిలా !

0941188108.01._SX240_SCLZZZZZZZ_

మీ దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది. దానితో మీరు ఒక చిత్రం తీద్దాం అనుకున్నారు. కాని తీసేముందు మీ
visualization చూసుకోడానికి, షాట్ డివిజన్ చేసుకోడానికి  స్టొరీ బోర్డు వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. మీకేమో బొమ్మలు వేయడం రాదు. పోనీ ఎవరి చేతైనా వేయిద్దాం అంటే అందరు వేల రూపాయలు అడిగే వారే. మరెలా?

ఎక్కువ ఖర్చు పెట్టకుండా, అధిక శ్రమ లేకుండా మీరే షాట్ డివిజన్ చేసుకోవచ్చు. దానికి మీకు కావలసినవి:
1. White Charts
2. Sketch Pens
3. Scale with Circles
4. Pencil, Sharpener and Eraser

ముందుగా white chart ని 4*3 size లో (లేదా మీకు నచ్చిన సైజులో) కత్తిరించుకుని ఉంచుకోండి. ఆ చార్ట్ మీద కింద చూపిన విధంగా మీరు బోర్డర్ గీసుకుని, కళ్ళు మూసుకుని మీ visualization కి పని చెప్పండి.

<Drawing 1>

నేను తియబోవు సినిమాలో ఒక సీన్ ని తీసుకుని పైన ఉన్న చిత్రాన్ని గీసాను. ఇందులో మీరు గమనించినట్టు అయితే… orange, blue and pink లో ఉన్నవి పాత్రలు. ఆయా circles మధ్య ఉన్న గీతలు ఆ పాత్ర యొక్క Look Position. Green color తో numbering ఉన్నవి కెమెరాలు. Brown లో ఉన్నది Jimmy Jib. ఏది ఏ పాత్ర అన్నది పక్కనే ఉన్న INDEX లో తెలుపడమైనది. కెమెరాకి numbering ఉన్నట్టే పాత్రలకు కూడా numbering ఉండడం గమనించి ఉంటారు. అది పాత్ర యొక్క స్థాన చలనం. Orange రంగులో ఉన్న సూర్య మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి కదిలాడు అని అర్ధం చేసుకోవాలి. అలాగే సుధాకర్ పాత్ర కూడా కదిలింది. రంగు వేయని ఒక పాత్రను EXTRA గా పేర్కొనబడింది. అతడు ఎవరో దారిని పోయే దానయ్య.

సీన్ ని ఒకసారి గమనిస్తే…
EXT. VILLAGE ROAD – DAY

సూర్య, తన తండ్రి సుధాకర్ సైకిల్ మీద వెళ్తూ ఉండగా దారిలో వీరయ్య కొడుకు ఏడుస్తూ ఎదురైయ్యాడు. పలక తీసుకు రాలేదని స్కూల్ నుంచి పంపించేసారని ఆ బాబు ఏడవడం తో సుధాకర్ సూర్య పలక ఇచ్చేసాడు. అది సూర్య కి నచ్చలేదు.

ఈ సీన్ పాలమర్ల గ్రామం లో రోడ్ మీద జరుగుతుంది. నా మదిలో ఉన్న విధంగా ఆ రోడ్ ని గీసి, దానికి ఇరువైపులా చెట్టులు వేసాను. తండ్రి కొడుకులు సైకిల్ మీద రావడాన్ని నేను location కవర్ చేస్తూ అందంగా చూపించడానికి JIMMY JIB వాడాను. అదే నా మొదటి కెమెరా. ఆ తర్వాత నెమ్మదిగా నాకు కావాల్సిన విధంగా షాట్ డివిజన్ చేసుకుని వాటికి numbering ఇచ్చాను.

Left Corner లో చూస్తే మీకు 1-2-3-6-7-6-7-4-8-3-5 అని కనిపిస్తుంది కదా అది Suggested Editing Pattern. అంటే JIMMY JIB తర్వాత నేను చెట్టు వెనుక ఉన్న కెమెరా 2 వాడి Long Shot తీసుకున్నాను. ఆ తర్వాత వీరయ్య కొడుకు రావడం, వాడితో మాట్లాడడం అన్నీ రకరకాల angles నుంచి నాకు తోచిన విధంగా డివిజన్ చేసుకున్నాను. Editing Pattern చూస్తే ఈ సీన్ కెమెరా 5 తో తీసిన సూర్య Close-up తో ముగుస్తుంది.

ఇలా షాట్ డివిజన్ చేసుకోవడం వలన అసలు లాభం ఏమిటి? ఈ సీన్ నే తీసుకుందాం. shooting Spot కి వెళ్ళాక, ఏ షాట్ ముందు తీయాలి అన్న తర్జన బర్జనలు అవసరం లేదు. సాధారణంగా JIMMY JIB mount చేయడానికి 30 నిముషాలు నుంచి 45 నిముషాలు వరకు పట్టొచ్చు. అందుకని లొకేషన్ కి వెళ్ళగానే జిమ్మి ని mount చేయమని చెప్పేసి మనం కెమెరా 2 కి వెళ్లిపోవచ్చు. ఒకసారి, ఈ షాట్ అయ్యాక కావాలంటే జిమ్మి షాట్ తీయొచ్చు లేదా కెమెరా 3 కి పోవచ్చు. Editing Pattern ఒకసారి గమనిస్తే Camera 3 ని రెండు సార్లు వాడడం జరిగింది. ఒకసారి వీరయ్య కొడుకు ఎదురు వచ్చినప్పుడు, మళ్లీ ఆఖరున ముగ్గురూ కలిసి వెళ్లి పోతున్నప్పుడు. ఒకసారి మీకు Geography అంతా తెలిసిపోయింది కాబట్టి Camera 3 వాడినప్పుడు ఒకేసారి ఆ రెండు షాట్స్ తీసేసుకోవచ్చు. దీని వలన మనకి చాలా సమయం ఆదా అవుతుంది. అలాగే షాట్ డివిజన్ ముందే చేసుకోవడం వలన, ‘Screen Direction’, ‘Line of Interest’ లాంటి రూల్స్ వలన confuse కాకుండా ఉండొచ్చు. సీన్ 4 లోనే గమనిస్తే ఎక్కడా ‘Screen Direction’ ని break చేస్తూ షాట్ డివిజన్ చేయడం జరగలేదు.

ఇప్పుడు అదే స్క్రిప్ట్ లో ఉన్న ఇంకో scene మీ ముందు పెడుతున్నాను. మీకు మీరుగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నించి చూడండి.
<Drawing 2>

ముందు సీన్ గురించి విపులంగా చదివి, తర్వాత కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎడిటింగ్ ఎలా అనుకుంటున్నారు అన్నది గమనిస్తే ఆ సీన్ మొత్తం మన మస్తిష్కం లో మెదులుతుంది.

అయితే ఇక్కడ నిజానికి ఇదంతా పక్క వారికి అర్ధం అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఇది మన కోసం మనం వేసుకున్న షాట్ డివిజన్. మనకి, మన కెమెరా మాన్ కి అర్ధమైతే సరిపోతుంది. సీన్ మొత్తం తెలిసి, డైరెక్టర్ ఎలా తీస్తాడో అన్న అవగాహన ఉన్నవారికి ఇదింకా బాగా అర్ధమవుతుంది.

నేను నా సినిమా లో 132 scenes ఉండగా ఒక పదింటికి మాత్రం షాట్ డివిజన్ చేసాను. మిగతా వాటికి చేయడానికి బద్ధకమై మానేయలేదు. మనకి లొకేషన్ ఎలా ఉంటుందో తెలియకుండా షాట్ డివిజన్ చేయడం కూడా వృధా ప్రయాసే. సీన్ 5 లో క్లాసు రూం ని తీసుకుంటే, నేను దానికి కుడి వైపు Entrance పెట్టాను. ఒకవేళ నాకు అటువంటి క్లాసు రూం కాకా ఎడమ వైపు entrance ఉన్నదో, అందులో గీసినట్టు నాలుగు వరసల బెంచెస్ ఉన్నది కాకుండా అయిదు వరసలు ఉన్నదో దొరికితే? అప్పుడు నేను నా షాట్ డివిజన్ మార్చుకోవల్సిందేగా? అందుకే షాట్ డివిజన్ చేసే ముందు లొకేషన్ ఫిక్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. నేనైతే రేపు షూటింగ్ అనగా ముందు రోజూ ఒక గంట సేపు కూర్చుని షాట్ డివిజన్ చేసుకోడానికి ఇష్టపడతాను. దాని వలన స్పాట్ లో మనం చాలా సమయం ఆదా చేయొచ్చు. మనం డివిజన్ చేసుకున్నట్టే తీయలేకపోవచ్చు. కొన్ని సార్లు అప్పటికప్పుడు మార్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. కాని, మనకంటూ ఒక ఐడియా ఉండడానికి, సీన్ మీద పట్టు రావడానికి ఈ విధంగా ముందే గీసుకోవడం చాలా ఉపయోగ పడుతుంది.

నేను గీసినట్టే గీయాలని నిబంధనలు ఏవి లేవు. పాత్రలకు Circles బదులు Squares ఇచ్చుకోండి. చెట్టు గీయడం రాకపోతే వదిలేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి పాత్రలు, కెమెరాలు మరియు వాటి కదలికలు మాత్రమే ముఖ్యం. మిగతావన్నీ మరి కొంచెం అవగాహనకి మాత్రమే.

ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇందులో కెమెరా Position బట్టి మాత్రమే షాట్ ఏంటి అన్నది చెప్పగలం. స్పాట్ లో కెమెరా ని దూరంగా పెట్టి కూడా క్లోజ్ అప్ షాట్ తీయగలం. కానీ ఇక్కడ క్లోజ్ అప్ షాట్ అని తెలియ చేయాలి అంటే కెమెరా ని పాత్రకు దగ్గరగా పెట్టడమే మంచిది. లేదా ఆ కెమెరా దగ్గర 100mm lens లాంటివి మార్క్ చేసుకోవడం ఉత్తమం.

<Drawing 3>

ఇలా షాట్ డివిజన్ చేసుకోవడం తో పాటు దీనిలోనే మరిన్ని విషయాలు పొందు పరుచుకోవచ్చు.

Scene 4 shot division sheet వెనుక నేను పొందు పరిచిన విషయాలు ఇక్కడ తెలియచేస్తున్నాను…
1. Artists: Surya (4yrs), Sudhakar, Babu, Extra/Jr.Artsist
2. Costumes: (a) Surya – 3cn* School Uniform, (b) Sudhakar – 3cn* Pant and Shirt, (c) Babu – F* Half Pant and Shirt
3. Properties: School Bag, LKG books, Slate and Slate Pencil
4. Vehicles: Hero Cycle (1991 period)
5. Special Equipment: Jimmy Jib, 16mm lens
6. Note: Follow Screen Direction but give importance to Line of Interest.

*CN= Continuity
*F= Fresh

ఇక్కడ సీన్ 3 లో వేసుకున్న Costumes సూర్య సుధాకర్ వేసుకోవడం తో continuity అని మార్క్ చేయడం జరిగింది. అలాగే artists finalize కాలేదు కాబట్టి పాత్రలు పేర్లే రాయడం జరిగింది. లేదంటే ఆ పాత్ర ధరించిన వ్యక్తి పేరు రాయొచ్చు.

ఈ విధంగా ఈ చిన్న 4*3 sheet లో Pre-Production, Production, Post Production (Editing) జరిగిపోయింది. అంటే, Hitch cock అన్నట్టు “సినిమా మొత్తం పూర్తయిపోయింది. షూటింగ్ ఒక్కటే మిగిలింది”

-శ్రీను పాండ్రంకి

www.srinuthedirector.com

13 Comments

13 Comments

 1. jd srinu

  May 28, 2011 at 4:01 pm

  thank q srinu sir
  we need more from u
  thanks again on behalf of navatarangam fans
  – jd.srinu

 2. శంకర్

  May 28, 2011 at 10:09 pm

  మంచి సమాచారం ఇచ్చారు. celtxలో storyboarding మరియు shot division చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు అంతా కంప్యూటర్‍లోనే చేసుకునేట్తైతే ఇది చాలా సౌకర్యవంతమైన software.

  PS: I can create some screen casting on how to use celtx for this purpose. Can I use the above script excerpt for that so it will be easy for the readers to understand the workflow ?

 3. challa

  May 29, 2011 at 6:39 pm

  as usual a nice article seenu.. but the pics are very small ; they lack clarity ; can we do something about this??

  cheers
  srikanth

  • Srinu Pandranki

   May 29, 2011 at 9:00 pm

   I talked to mahesh regarding this. He said its not good if we enlarge. U can click on the image to enlarge. Or else read it n my notes in FACEBOOK 🙂

  • Patch

   July 8, 2011 at 2:03 pm

   This inorfmation is off the hizool!

 4. challa

  May 29, 2011 at 9:36 pm

  cheers.. will read in FB

 5. srinivas ittam

  June 1, 2011 at 12:26 am

  wonderful storyboarding srinu…i tried storyboarding but horrible pictures tho vesa kaani naaku maatrham ardam ayyedi…but bommalu geeyadam rakapoyina intha clear ga vesukovachani ippude telisindi…anyway thanks for sharing 🙂

 6. రాజశేఖర్

  June 1, 2011 at 10:13 pm

  చాలా మంచి సమాచారం ఇచ్చారండి శ్రీనుగారు. Thanks

 7. don harish

  June 4, 2011 at 7:19 pm

  kani charecters steady ga lekunda atu,itu move aithe ela?

 8. Sripal Sama

  June 5, 2011 at 9:44 am

  Awesome information. Thanks a lot for sharing.

 9. శ్రీను

  March 28, 2012 at 11:01 am

  అందుకోసమే పాత్ర కదిలికలు కూడా ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Subscribe to Navatarangam via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 24 other subscribers

Copyright © 2015 నవతరంగం. Love For Cinema, powered by Venkat Siddareddy.

To Top
Menu Title