అద్వితీయ ప్రతిభాశాలి సచిన్ భౌమిక్ ఇకలేరు

సినిమా అభిమానులకు,ముఖ్యంగా హిందీ చలనచిత్రప్రియులకు ఆశనిపాతం లాంటి వార్త.సచిన్ భౌమిక్ ముంబైలోని ఆయన స్వగృహంలో ఈ రోజు అనగా ఏప్రిల్12 గుండెపోటుతో మరణించారు. నర్గీస్ నటించిన లజ్జావతి(1958) హిందీచిత్రాలకు రచన ఆరంభించిన సుమారు డెబ్భయ్ సినిమాలకు తనప్రతిభ తో ప్రాణం పోసారు.బహుశా భారతదేశం మొత్తం మీద ఏభాషాచలనచిత్ర పరిశ్రమ లో కూడా సచిన్ భౌమిక్ లా నూరుశాతం విజయవంతమైన సినిమాలను అందించిన వారు లేరనే చెప్పాలి.

తాళ్, కరణ్ అర్జున్, సోల్జర్, కోయి మిల్ గయా, క్రిష్, ఆరాధన, లవ్ ఇన్ టోక్యో, బ్రహ్మాచారి, కార్వాన్, గోల్‌మాల్, హమ్ కిసి సే కమ్ నహీ, యాన్ ఈవెనింగ్ ఇన్ పారిస్, ఆయీ మిలన్ కి బేలా, జాన్వర్ ….ఇవి సచిన్ భౌమిక్ అందించిన చిత్రాల లోని ఒక చిన్న జాబితా మాత్రమే.
మన ఆచార్య ఆత్రేయలానే తన సుదీర్ఘ చలన చిత్రయాత్రలో కేవలం ఒకేఒక్క సినిమాకు మెగాఫోను చేపట్టారు.అది 1973 సంవత్సరంలో రాజేష్ ఖాన్నా, షర్మిలా టాగోర్ నటించిన రాజా రాణి.ప్రతి చిత్రంలోనూ దర్శకులు ఎవరైనా హృషికేష్ ముఖర్జీ,నాసిర్ హుస్సేన్,సుభాష్ ఘాయ్,రాకేష్ రోషన్ లేక మరెవరయినా కావచ్చు గానీ తనముద్రను విస్పష్ఠంగా చూయించగలిగిన ప్రతిభాశాలి సచిన్ భౌమిక్.ఆయన మరణంతో చలనచిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది.
సచిన్ భౌమిక్ రచన,స్క్రీన్-ప్లే అందించిన చిత్రాలన్నిటి్నీ చూసిన ఒక మామూలు ప్రేక్షకుడిగా ఇది నా అక్షరనివాళి.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

రచయిత:

మన గురించి మనం రాసుకోవాలంటే కాస్త ఇబ్బందే.కానీ తప్పదు. స్వస్థలం:గుంటూరు జిల్లా నిడుబ్రోలు-పొన్నూరు ఉన్నతపాఠశాల విద్యవరకూ మా ఊర్లోనే, ఇంటర్మీడియట్,డిగ్రీ గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో యం.యే ఫిలాసఫి,మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్,అటూ ఇటు కాకుండా ఆగిన పిహెచ్.డి అన్నీ అంధ్రవిశ్వవిద్యాలయంలొనే,అక్కడే రెండేళ్ళు జర్నలిజం పాఠాలు చెప్పాను.మధ్యలో ఈనాడు జర్నలిజం స్కూలులో చదువు,కొన్నాళ్ళు హైదరాబాద్,వైజాగుల్లో ఈనాడు దినపత్రికలో స్టాఫ్ రిపోర్టరు ఉద్యోగం కూడా చేసాను.చాలా పత్రికల్లో వ్యాసాలు రాసాను,రాస్తున్నాను. పర్యావరణ సంరక్షణకు,sustainable development గురించి ఒక యన్.జి.ఓ స్థాపించి ప్రస్తుతం ఆ కార్యక్రమాల్లో ఉన్నాను. చిన్నతనం నుంచి నాకు ఏ కళారూపమైనా ఇష్తంగా ఉండేది.అన్నిటిలోకి సినిమాలు చూడటం,రేడియోలో వచ్చే సినిమా పాటలు వినడం మరీమరీ ఇష్టం బాల్యంలో.పదో తరగతి వరకూ వారానికి ఒక సినిమా(ఇంట్లొ తెలిసి)చూసేవాడిని,తర్వాత కూడా కొన్నాళ్ళు వారానికి ఒకటి గానే (ఆదివారమొకటి,సోమవారమొకటి ఇలా అన్న మాట),పది సంవత్శరాలనుంచి బాగా తగ్గింది కానీ కొన్నివందల.వేల సినిమాలు చూసుంటాను.కొంతకాలం ఒక సినిమా హాలులో సినిమా ఆపరేటరుగా పని నేర్చుకోవటం వల్ల కొన్ని సినిమాలను వందలసార్లు కూడా చూడాల్సొచ్చింది. నాకు ఊహ బాగా వచ్చేటప్పటికి కృష్ణ,శోభన్ బాగులు తరం నడుస్తుంది,సహజంగా కృష్ణ అభిమానినయ్యాను,అంతే కాక మా యిరుగుపొరుగు వారిలో కొందరికి కృష్ణ కుటుంబంతో బంధుత్వాలుండటం,వారి ఇంటి నుంచి ఎవరో ఒకరు వచ్చిపోవటం కూడా దాన్ని ధృడపరచింది.అలాగని మిగిలిన వారిసినిమాలు చూడటం మానలేదు,తిట్లకు లంకించుకుందీ లేదు.కాలేజీరోజుల్లో అమితాబ్ కు వీరాభిమానిని,అలాగే నాచిన్నప్పటి ఫావరెట్ హీరో ధర్మేంద్ర కొడుకు సన్నీడియొల్ సినిమాలు బేతాబ్,అర్జున్ కూడా బాగా నచ్చాయి. చాలా మందికి నాకూ తేడా ఏమిటంటే నేను ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తా,మిగిలినవారు ఎంజాయ్ చేద్దామని సినిమాలు చూస్తారు. నా ఆల్ టైం ఫావరైట్ ప్రపంచసినిమా:సెవెన్ సమురాయ్ భారతీయ సినిమాల్లో పధేర్ పాంచాలి, వెస్ట్ర్రన్ జనర్ నా బలహీనత,నాకు పరమబోరు కొట్టిన సినిమాలు యన్టీయార్ అదృష్టజాతకుడు,అక్కినేని,కృష్ణల ఊరికి సంక్రాంతి.ఎన్నిసార్లు చూసినా బోరు అనిపించనివి చాలా ఉన్నా అక్కినేని దేవదాసు,కృష్ణ మోసగాళ్ళకుమోసగాడు,అల్లూరిసీతారామరాజు, ఒక్కసినిమా నేను ఎప్పటికీ మరవనిది పాపియాన్,ఆసినిమాలో స్టీవ్ మెక్విన్ నటన ఇంకెక్కడా చూడలేదు.అందుకే అతను నాకొక అభిమాన నటుడు,హాలీవుడ్ లో రాబర్ట్ డినిరో,రాబర్ట్ రెడ్ఫోర్డ్,లీమార్విన్,ఆంథోని క్విన్,పీటర్ ఫోండా,మెరీల్ స్ట్ర్రీప్.జూలియారాబర్ట్స్,అభిమాన నటులు కాగా భారతనటుల్లో శివాజీ గణేశన్ బాగా ఇష్తం,సంగీతదర్శకుల్లో ఇళయరాజా తర్వాతే నాకు ఎవరైనా,మహేంద్రకపూర్ పాటలంటే చాలా అభిమానం,జిక్కీకి అతిపెద్ద పంకాను.పైన చెప్పాను కదా వెస్తన్ జనర్ నా బలహీనత అని తద్వారా ప్రపంచం లో ఎక్కడనుంచి కౌబాయ్ సినిమా వచ్చినా దొరికినా వదలకుండా చూస్తాను.బడ్ స్పెన్సర్,టెరెన్స్ హిల్ సినిమాల అతిపెద్ద కలెక్షన్ సంపాదించా,ఇంకా చాలా మిగిలి పోయాయి.మాయింటిల్లీపాది వీలున్నప్పుడల్లా ఆ సినిమాలు చూస్తుంటాం.సినిమాల వల్ల కేవలం వినోదమే కాక అసంఖ్యాకప్రయోజనాలు ఉన్నాయని ప్రగాఢంగా నమ్మేవాడిని నేను.నాభార్యాపిల్లలు మహేష్ బాబుకు వీరాభిమానులు.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories