Menu

PAY FOR YOUR FILM ఇండిపెండెంట్ సినిమా కోసం ఒక ప్రయత్నం

సినిమాలు తియ్యాలనే తపన, తమకోసమై తామే అవకాశాలు సృష్టించుకోవాలనే ఆశయంతో హైదరాబాద్ కు చెందిన కొందరు ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్, ఫిల్మ్ లవర్స్ TELUGU INDEPENDENT CINEMA గ్రూప్ గా ఫేస్ బుక్ లో ఏర్పడి ఏప్రిల్ తొమ్మిదో తారీఖున అందరూ కలవడం జరిగింది. పరిచయాల తరువాత చర్చల్లో ఇండిపెండెంట్ సినిమా అంటే ఏమిటి, ఎలా మన ప్రయత్నాలు చెయ్యాలి అనే కొన్ని ఆలోచనల గురించి మాట్లాడుకోన్నాం.

సినిమాలపైన ఏర్పరుచుకున్న అభిమానం, ప్రేమ, పరస్పర సహకారం ఆధారంగా ఒక జట్టుగా ఏర్పడి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ స్వతంత్ర్య స్ఫూర్తితో సినిమాల రూపకల్పన చేసేలా ఆలోచించడం జరిగింది.

దానిలో భాగంగా ఇప్పటివరకూ ఔత్సాహికులు చేసిన సినిమాలను కలిసి చూడటానికి, చర్చించుకోవడానికీ, ప్రమోట్ చెయ్యడానికీ దానితోపాటూ మనవంతుగా “PAY FOR YOUR FILM” అంటూ కలిసికట్టుగా ప్రయత్నించడానికి నిర్ణయం జరిగింది. ఈ సిరీస్ లో భాగంగా మొదటగా ఈ శనివారం 23rd ఏప్రిల్ న On d way,Road number 45, Jubilee hills. Hyderabad లో చల్లా శ్రీకాంత్ చిత్రం “SONG OF LIFE” ప్రదర్శించడం జరిగుతోంది. వివరాలకు Facebook లో TELUGU INDEPENDENT CINEMA చూడండి.

17 Comments
  1. వసంతం.వాసు April 21, 2011 /
  2. ప్రదీప్ కుమార్ April 21, 2011 /
  3. శంకర్ April 22, 2011 /
  4. chakri April 22, 2011 /
      • venky April 23, 2011 /
      • వీర శంకర్ April 24, 2011 /
    • venky April 23, 2011 /
  5. venky April 23, 2011 /
  6. venky April 23, 2011 /
    • challa April 23, 2011 /
      • venky April 23, 2011 /
  7. kiran May 8, 2011 /
  8. satish December 18, 2011 /
  9. gopichandu November 18, 2016 /