Menu

దం మారో దం..

కధకి ఒక కధానాయకుడు ఉండాలి అనే రూలేదీ ఈ సినిమాలో కనపడదు. కధ ఏ హీరో. గోవాలో జరిగే మత్తు పదార్దాల అమ్మకం, దాన్ని ఆపడానికి వచ్చే ఒక పోలీసు ఆఫీసర్ కధ ఈ చిత్రం.

ఒక కుర్రవాడు ‘లోర్రి’ ( Prateik Babbar ) పై చదువుల కోసం, తను ప్రేమించిన అమ్మాయి కోసం అమెరికా కి వెళ్ళడానికి సిద్దమౌతాడు. అయితే అతడికి ఊహించిన స్కాలర్షిప్ రాకపోవడంతో.. డబ్బులకోసం,అమెరికాకు వెళ్ళడం కోసం తనతో పాటు డ్రగ్స్ తీసుకువెళ్ళడానికి ‘రికి’ అనే డ్రగ్స్ అమ్మే అతనితో ఒప్పందం ఏర్పరుచుకుంటాడు. సరిగ్గా విమానాశ్రయం లో అతను, కామత్ ( Abhishek Bacchan )అనే పోలీసు ఆఫీసరుకి చిక్కుతాడు. అదే సమయంలో.. ఆ కుర్రవాడికేమీ తెలియదు, ‘లోర్రి’ అమాయకుడంటూ..’జోకి’ ( Rana ) వస్తాడు. ఇక అక్కడినుండీ కధ పరుగులు పెట్టడం మొదలు పెడుతుంది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇప్పటి వరకూ జరిగిన కధలో వున్న పాత్రల ఫ్లాష్ బ్యాక్ లు ఎక్ష్ప్లెయిన్ చేయడానికి..ఆ పాత్రలు, ఈ సన్నివేసం వరకూ రావడానికి దారితీసిన పరిస్థితులను చూపించడానికి దర్శకులు వాడుకున్నారు. కళ్ళు తిప్పుకోలేనంతగా కధ స్క్రీన్ మీద కదులుతూ ఉంటుంది.

ఇక ఈకధలో విలన్ బిస్కట్ (ఆదిత్య పంచోలి). అతడే ఈ డ్రగ్స్ అమ్మకాలను ఇక్కడ నిరాటంకంగా సాగనిస్తుంటాడు. ఇక కామత్ బిస్కుట్ వ్యాపారాలను దెబ్బతీయడానికి ఒక టీం ను ఏర్పాటు చేసుకుంటాడు. కామత్ నుండి తమ సరుకు కాపాడుకోవడానికి మైకేల్ బార్బోస అనే గుర్తు తెలియని వ్యక్తికి తమ డ్రగ్స్ మొత్తం అప్పచెపుతారు అక్కడి డ్రగ్స్ వ్యాపారస్తులు. ఈ మైకేల్ బార్బోస ఎవరో ఎవరికీ తెలియదు కనీసం ఆ సరుకు ఇచ్చినవాళ్ళకు కూడా.. బార్బోస గురించి తెలుసుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు కామత్. కామత్ కి ‘జోకి’ సహాయం చేస్తుంటాడు. బిస్కట్ కి కామత్ కి మధ్య నడిచే దొంగాపోలిసులాటలో సెకండ్ హాఫ్ చాలా వరకూ వెళ్ళిపోతుంది. అందులో కామత్ తన టీం మెంబెర్స్ ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.

బిస్కట్ ని పట్టించే ఆధారాలు సంపాదించడంలో ‘జోకి’ తన (మాజీ ) ప్రియురాలిన ‘జోయె’ (బిపాషా బసు ) సహాయం తీసుకుంటాడు. ఆ తరువాత ఆమె ని బిస్కుట్ మనుషులు చంపేస్తారు. కధ ఇక్కడనుండీ మళ్ళీ వేగం పుంజుకుంటుంది. అసలు కామత్ చివరికి బిస్కట్ ను పట్టుకోగలిగాడా? అసలు ‘జోకి’ పాత్ర ఏంటి? ఈ మైకేల్ బార్బోస ఎవరు? ‘లోర్రి’ కి ఏమయింది? లాంటి విషయాలు బిగ్ స్క్రీన్ మీద చూసి తీరవలసిందే.

చాలా రోజులతరువాత చూసిన మంచి సస్పెన్స్ త్రిల్లెర్ ఈ సినిమా. ‘ప్రీతం’ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యం గా సినిమాలో మొదటి పాట చాలా బాగుంది; దం మారో దం అనే పాట పాట రిమిక్ష్ చేసారు. దానికి థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

కధ గోవా నేపధ్యంలో ఎంచుకున్నందుకో ఏమో మరి.. పాత్రలు పాపం చిన్న చిన్న బట్టలు మాత్రమే వేసుకుంటాయి.

నటన పరం గా Prateik Babbar పాత్ర ఎక్కవ ఏడుపుకే పరిమితం అయ్యింది. రానా ని చూస్తే లీడర్ సినిమాలో కనపడ్డ ఆ నటుడు ఇతను ఏనా ? అని అనిపించక మానదు. personality , dialogues , action , చాలా భిన్నంగా కనపడతాడు. అయితే ఈ పాత్ర ఎక్కువ సీరియస్ గాను టెన్షన్ గానూ ఉండేట్టు తయారు చేయబడింది. అభిషేక్ బచ్చన్ కి ఈలాంటి పోలిస్ పాత్రలు కొత్త కాదు. అతను సునాయాసంగా చేసుకుపోయాడు. అయితే విలన్ గా ఆదిత్య పంచోలి నటన మెచ్చుకోదగ్గది. మొత్తం సినిమాలో ఎక్కువ ఎక్ష్ప్రెస్సిఒన్స ఇచ్చిన పాత్ర ఇదే. విద్య బాలన్ గెస్ట్ అప్పియరన్స్ కనుక చెప్పుకోవడానికి ఏమి లేదు. బిపాషా బసు పాత్రోచితంగా నటించింది. దీపిక పదుకొనే ఒక్క టైటిల్ సాంగ్లో మాత్రం కనపడి మాయమైపోతుంది.

ఈ సినిమాకి కధ స్క్రీన్ ప్లే అందించిన ‘శ్రీధర్ రాఘవ’ కి కచ్చితంగా మంచి మార్కులు దక్కాలి. దర్శకుడు రోహన్ సిప్పీ కధను బాగా చూపించాడు. ప్రేక్షకుడు ఎక్కడా కన్ఫుస్ అవ్వడు. ఇక సినిమా బడ్జెట్ ఎంతో తెలియదు కానీ.. కలర్ఫుల్ గా రిచ్ గా ఉంటుంది సినిమా అంతా.

ఒక్క మాటలో దం మారో దం.. entertainment ఇచ్చే దమ్మున్న సినిమా.. ఫుల్ పైసా వసూల్. అయితే కొన్ని సన్నివేశాల దృశ్యా ఈ చిత్రం చిన్న పిల్లలకు నిషిద్దం.

–Siva Cheruvu

3 Comments
  1. Pasa April 24, 2011 /
  2. Santha Laxmi, Ongole April 28, 2011 /
  3. Siva Cheruvu May 1, 2011 /