Menu

బాలచందర్ కు దాదాసాహెబ్ ఫాల్కే

ప్రముఖ దర్శకుడు, దార్శనికుడు, రచయిత, నిర్మాత కైలాసం బాలచందర్ (కె. బాలచందర్)ను ఈ సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. తంజావూరు జిల్లాలొ నన్నిలం గ్రామానికి చెందిన ఈయన అరవైల్లో వ్రాసిన మేజర్ చంద్రకాంత్, సర్వర్ సుందరం వంటి నాటకాల రచయితగా వెలుగులోకి వచ్చారు. ఎమ్.జి. రామచంద్రన్ నటించిన “దైవ తాయి” ద్వారా రచయితగా సినీరంగేట్రం చేసి, అచిరకాలంలోనే దర్శకుడిగా ఎదిగారు. సంక్లిష్టమైన మానవ సంబంధాలను, అనుబంధాలను, సాంఘిక సమస్యలను చిత్రీకరించడంలో సిద్ధహస్తుడిగా బాలచందర్ పేరు గడించారు. తమిళ, తెలుగు, హిందీ బాషలలో ఆయన తీసిన చిత్రాలు వస్తు పరంగా, చిత్రీకరణ పరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించి యావత్త భారత సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి.

రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, వివేక్ వంటి హేమాహేమీలను పరిచయం చేసిన ఘనత, ఆయన పనిచేసిన ప్రతి ఒక్కరి నుండి అద్భుతమైన నటన రాబట్టిన గొప్పతనం బాలచందర్ ది. కొడుకు ప్రేమించే అమ్మాయిని పెళ్ళిచేసుకునే తండ్రి (అపూర్వరాగంగళ్), విడాకులతో మొదలై, పెళ్ళి జరిగి, తరువాత ప్రేమను తెలుసుకునే అను పాత్ర (అవర్ గళ్, తెలుగు: ఇది కథ కాదు), కుటుంబ భారాన్ని మోస్తూ తనకంటూ ఏమీ లేకుండా మిగిలిపోయే సరిత కథ (అంతులేని కథ), కోటి ఆశల పెళ్ళికూతురు సాడిస్ట్ భర్తతో నలిగిపోయే కథ (47 రోజులు), సంగీతమే ప్రధానమనుకునే తండ్రికి సంఘహితమే సంగీతమని చెప్పే కొడుకు కథ (రుద్రవీణ), ఆకలి కి తెర రూపం చూపే కథ (ఆకలి రాజ్యం), లైలా మజ్నూ, పారు దేవదాస్ సరస నిలిచే బాలు స్వప్నల ప్రేమకథ (మరో చరిత్ర) ఇలా ఎన్నో ఎన్నెన్నో వైవిధ్యాలని తెరకెక్కించిన ఈ దర్శకుడికి అందిన ఎన్నో పురస్కారాలలో మరో మణిగా దాదా సాహెబ్ ఫాల్కే అందటం పట్ల నవతరంగం హర్షం ప్రకటిస్తోంది.

గతంలో నవతరంగంలో బాలచందర్ గురించి వచ్చిన వ్యాసం మరోసారి…

గుండె భావాల బాలచందర్

 

2 Comments
  1. Apparao Sastri April 29, 2011 / Reply
  2. రమణ మూర్తి May 2, 2011 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *