Menu

సినిమా జ్వరం – చలం


మనుషుల కోసం కళా, కళ కోసం మనుషులూ..??

రెండు విధాల  అభిప్రాయలు ఉన్న వాళ్ళూ ఉన్నారు.

మన సినిమాల్లో కళ లేని లోపం కళ్ళు చెదరగొట్టే కాంతి తీరుస్తోంది. కళ అంతా మనుషుల కోసమే గాని,  కళకి  అవసరమైన మనుషులు లేరు.

మరి ఇంక దేనికోసరం ఉన్నారు? అని వాళ్ళని ప్రశ్నిస్తే ” తిండికోసం,  హెచ్చు ఏది లభిస్తే దానికోసం” అని నిర్మోహమాటంగా  నిజం ఒప్పుకొని,   “సినిమా కళ…  సినిమా నీతి” అని ఈ అబద్దపు రాతలు రాయకపోతే చాలా బావుంటుంది.

సినిమా ప్రస్తుతం చాల మందిని  పోషించే వృత్తి. ధనాన్ని  ఒకచోట నిలువనీక ఎక్కడో తాతలు గోతులలో బాంకుల్లో  పూడ్చి పెట్టిన దాన్ని తవ్వించి, సినిమావాళ్ళ   జేబుల్లోకి,   అక్కడినుంచి త్వరితంగా వర్తకుల దగ్గరికి పరిగెత్తిస్తోంది. కటిక దరిద్రుల దగ్గరనుంచి దమ్మిడీలు పోగుచేసి adventurers  వొళ్ళో పోస్తోంది. తాగుడు మాన్పి బీదవాళ్ళ సంసారాలని  ఉద్దరించాలని చూసే వారికి సినిమా తీవ్రంగా  తోడ్పడింది. ఏ ఖర్చు చెయ్యకండి,  తాగుడు… వేశ్యలు..కట్నాలు..జూదం.. ఇవన్నీ మాని డబ్బుకూడబెట్టండి,  అని బిగ్గరగా అని; గొంతు  మార్చి  అందంగా ” నా వొళ్ళో పొయ్యండి”  అని అంటోంది సినిమా కళావంతురాలు.

వృత్తులు దుర్భరత్వం లో  ఒకదానికి ఒకటి తీసిపోవు. అవి తమ సేవకులకు చేసే చెరుపుల్లో ఒక్కొక్కటీ ఒక్కొక్క గుణం specialize  చేస్తున్నాయి.. ఈ కొత్త సినిమా వృత్తి   తన “నాశన ప్రతిభని” గొప్పగా బైట పెట్టింది.సమస్త కలలకీ సమ్మేళనం కనుక వివిధాలైన వృత్తులన్నింటినీ అవసరం చేసుకుంది.  అన్నిటినుంచి   వాటి స్పెషల్  మరణ గుణాలన్నింటినీ తీసుకొని కేంద్రీకరిప చేసుకొని  పనిచేస్తోంది.

వర్తకం , కవిత్వం, సంగీతం,  జర్నలిజం,  ప్లీడరీ, ఉపాద్యాయత్వం,  సోమరితనం,  భుస్వామిత్వం ,వేశ్యాత్వం,  మధ్యవర్తిత్వం ఇంకా ఎన్నో పూర్వ వృత్తులోంచి  లాక్కెళ్ళింది ప్రజల్ని ఈ సినిమా. రెండు మూడేళ్ళలో వీళ్ళందరూ ఒకే రకంగా తయారైనారు. చాల విషయాల్లో,  వివిధ వృత్తుల వాళ్ళు, కులాల వాళ్ళు, గుణాల వాళ్ళు, అభిరుచుల వాళ్ళు, సమస్తమైన వారు మోసంలో, అబద్దంలో, మొహం తప్పించటం లో,  డబ్బు కాచేయ్యటం లో,  పని గడిపించుకోటంలో,  నిర్దయలో,  మొదటి  బహుమతుల  కోసం   తీవ్రంగా  కృషి  చేస్తున్నారు. ఇంకా చాల గుణాలు చూస్తున్నాం కాని అవి ఈ గుణాలంత   సర్వ సామాన్యం కాదు. అవి ప్రత్యెక పరిస్థితుల వల్ల   సంపాయించుకున్న gifts   కావొచ్చు.  చాల నమ్మకస్తులు, స్నేహితులు.. కవిత్వం, నాజూకు తనం,  నిజంగా హృదయం కలవాళ్ళు, చాల మార్దవమైన హృదయం కలవాళ్ళు  అభిమాన ధనులు  కొన్ని నెలలు  సినిమా పని చేసి  అద్భుతంగా మారారు,  గుర్తులేకుండా.  కారణాలు వెతకటం నాకు అలివి కావటం  లేదు.  పాటశాలలు ఎందుకు  మృత్యు శాలలు అవుతున్నాయో కనిపెట్టలేని నేను,  స్టూడియోలు అంటే ఏమిటో తెలీని నేను,  ఎట్లా చెప్పగలను కారణం ?

నాకు ప్రియ మైన వాళ్ళు, నా గౌరవం  పొందిన  మనుషుల  మరణ గీతం పాడవలసి వోచ్చిందనే బాధ ఒక్కటే తెలుస్తోంది.

కొద్ది రోజుల కింద దాకా,  ఈ సినిమా ప్రజ్వలించినదాక   భావ కవిత్వానికి ఉండేవి ఇట్లాంటి గుణాలు. ప్రజాదరణ తగ్గి వాటికి  అక్కడ ఆశ్రయం జారిపోయి,  పది రెట్లు బలాన్ని పొంది  సినిమాల్లో ప్రవేశించాయి.స్టూడియో వాతావరణాన్ని పూర్తిగా ముంచెత్తి  విజ్రుమ్బించి   దూరంగా ఉన్న వూళ్ళ  మీద,   కాలేజీలో,  ఇళ్ళలో ప్రవేశిస్తునాయి.


ఇది ఒక కొత్త రోగం. –  ఈ సినిమా జ్వరం, ఏదో విధంగా సినిమా పరిశ్రమ లో  చేరాలని  ఆ అదృష్టం  లభించే దాకా  పాత్రలని అనుకరిస్తో ఉండాలని, ఆ పాటల్ని కూని  రాగాలు తీస్తూ ఉండాలని, వాటి సంగతే చదవాలనీ,  వినాలని మాట్లాడాలనీ దాహం… unrest … ఇవి జ్వరానికి  కొన్ని చిన్హాలు. వృత్తి  కోసం సినిమాల్లో చేరితే అర్థముంది. సినిమా వృత్తి  లభించని నిర్భాగ్యులకే  తక్కిన  వృత్తులు. ఉద్యోగాలు, భూములు…ధనం ఉన్నవాళ్లకే, సుఖంగా జీవితం గడుపుతున్న వాళ్ళకే ఈ జ్వరం. నాటక రంగం మీద కూడా ఇలాంటి వ్యామోహం ఉండేది, కాని అడియన్సుని చూస్తే భయం ఉండేది. స్టేజి కి  అడియన్సుకి సమీప సంభంధం ఉండటం వాళ్ళ.. నచ్చకపోతే ఈలల దగ్గర్నించి.. తిట్ల నుంచి, బెడ్డలు లు , కుర్చీలు, చెప్పులు విసరడం దగ్గరికి జరిగేది. సినిమా వల్ల ఇప్పుడు self   exhibition   కోర్కె పూర్తిగా తృప్తి  పడుతూ  దానివల్ల వొచ్చే ఇబ్బందులన్నీ   తొలగి పోయినాయి. సినిమా వాళ్ళు  ఏ దూరం వూళ్ళలోనో,  అడవులలోనో షూటింగులు జరగటం వల్ల ఇది వరకి భయపడే స్త్రీలకి కూడా ఇప్పుడు ధైర్యం కలుగుతోంది.

తాము  పతివ్రతలు  కావాలనే కోర్కె పోయి పతివ్రతల వేషాలు ధరించాలనే కోర్కె హెచ్చింది . ఆ పురాణ పతివ్రతలలో చాల లోపాలున్నాయి అని వాటిని అనుకరించకండి అని రాసినపుడు,  మా పతివ్రతలని చెరుస్తున్నారని గోలపెట్టిన వాళ్ళందరూ ప్రతుతం ఆ పతివ్రతలు ఎట్లాంటి రూపాలు లేక తిరుగుతునారని గమనిచారేమో,

సీత, దమయంతి, సావిత్రి అని అనండి వెంటనే ఆ వేషాలు ధరించిన వేశ్యల పేర్లు తలుస్తున్నారు.అసలు ఆ వేశ్యల పేర్లతోనే పిలుస్తున్నారు పతివ్రతలని. పతివ్రతల అసలు కథలు వదిలి సినిమా అవసరాలకి వంకర తిప్పిన కథలనే నిజం  కథల కింద చెప్పుకుంటున్నారు.

అసలు పతివ్రతలని అనుకరించమని  ఈ నాడు కూడా నా పవిత్ర సోదరులు, దేశ బాంధవులు ఇంకా రాస్తూనే ఉన్నారు. కాని ఆ రాతల్లో  చీర అంచుల నుంచి జడల కోసల వరకు, శిగ  పూల నుంచి చెవిలో లోలకుల వరకూ ,  బెదురూ చూపుల నుండి నంగి మాటల వరకూ ప్రతి అక్షరము అనుకరిస్తున్నారు, అంటరాని వారిని దూరంగా తరిమిన  వేశ్యల్ని, వేశ్యా తల్లుల్ని. ఎందుకంటే   ప్రత్యక్ష పతివ్రతలు వాళ్లే కనుక . పూర్వపు పతివ్రతలు నవీన యువతుల మీద కనికరించి  సాక్షతరించారని  వాళ్ళని   పూజిస్తున్నారు. బాహ్యాడంబరాలు  మతం లో,  నీతుల్లో బాగా అలవాటైన వారు కదా మన ప్రజలు.

ఈ ఉపద్రవాన్ని చూసి సహించలేక ముసలి వితంతులువు తామూ సినిమాల్లో చేరి వాటిని సంస్కరణ  చేయాలనీ ప్రయత్నిస్తున్నారు.

ఏదో…  చదువుకున వాళ్ళు,  మీ అభిప్రాయం ప్రకారం హై కారక్టర్ ఉన్నవాళ్ళు..కుల స్త్రీలు..వెళ్లి సినిమాలని మార్చి ఉద్దరించ బోతున్నారని ఆశించకండి  వెళ్ళిన వాళ్ళ పేర్లు జ్ఞాపకం  తెచ్చుకుంటే చాలు.  దేశం నమ్మిన కళారాధకులు అందరూ   యాచకులు, .భట్రాజులు అయిపోయారు. కళని  ఈశ్వర రూపం అని నమ్మిన వాళ్ళు,  కళని పాతిక రూపాయలకి అమ్ముకుంటున్నారు.   మతాన్ని అట్లా అమ్ముకునే ఈ గతికి వొచ్చారు మన ప్రజలు,  మతులు పూర్తిగా పోయినట్టు ప్రవర్తిస్తున్నారు, ఈ దరఖాస్తు దార్లు, స్కీన్ అస్పిరెంట్స్ ..లావు వాళ్ళూ … దిబ్బ మొహాల వాళ్ళు.. కంఠం   లేని వాళ్ళు…కళ అంటే ఓనమాలు రాని వాళ్ళు…  ఎముకల  పోగుల వాళ్ళు..తగుదుమా  అని యోచన లేకుండా ఎప్పుడూ మొహం అద్దం లో చుసుకోనట్టే  .. తమ ఉచ్చారణ తాము విననట్టే ప్రవర్తిస్తారు.

ఏమిటి  నేను బాగాలేనూ  ?  వాడు నాకన్నా బాగా ఉన్నాడా   ??

ఏమిటి నా కంఠం  బావుండదా  ?? దాని కంఠం  ఇంతకన్నా బావుందా ??

ఇదీ వరుస.

సాధారణ విషయాల్లో ఉండే వివేకం సినిమా విషయం లో పోతోంది  ప్రజలకి.

ఈ జ్వరం ఏదో కొత్త గనక విజ్రుమ్భించింది . త్వరగా తగ్గుతుంది అని అనుకోవటానికి   వీలు లేదు. హాలివుడ్  లో ఏం తగ్గింది ?


సినిమాలో పని దొరక్క పోతే స్టూడియో లో ఉరికే పని చేస్తాను. భోజనం  పెడితే చాలు.ఇంటిదగ్గర్నుంచి డబ్బు తెసుకొని వొచ్చి పనిచేస్తాను, ఆది లేకపోతే ఏదో ఉరికే పని ఉన్నట్టు.. తారలకి కాఫీలు తెచ్చి… జోళ్ళు తుడిచి కొంగులు దులిపి సంతృప్తి పొందుతారు.

సినిమా కాంతి  తెరమీదనుంచి తీసేసినా ఈ  మనుష్యుల కళ్ళలోంచి తీసేయటం  కష్టం. కాకపోతే ఏంటి..  మొన్నటిదాకా ఎవరూ  తలెత్తి చూడని సాధారణుల  కోసం కార్లు పట్టుకొని జోహరులేందుకు చేస్తారు ? ?   సినిమాల్లో కనబడ్డంత మాత్రాన ? ?

ధనం కాదు … రూపం కాదు… పాట కాదు… అ ఆకర్షణ …ఫక్తు సినిమా కి మాత్రమే  చెందిన విషయం.

రెండవ భావం

One Response
  1. Praveen Sarma April 5, 2011 /