Menu

లే…చి…పో…దా…మా (గీతాంజలి – 2)

” నీకు Congenital హార్ట్ అంటే ఏంటో తెలుసా  ?

ఉ … ఉహు..

పక్కన ఉన్న పిల్లల గ్యాంగ్ మొత్తం టకా టకా అని చెప్పేస్తారు.

తెలిసి ఇలా ఉండగాలిగావా ??

హా ..

ఎలా ??

” చూడు నువ్వు చచ్చిపోతావ్ .. ఈ చిత్రా చచ్చిపోతుంది.. ఆ శారద ఉందే… అదీ చచ్చిపోతుంది.. పల్లికిలుస్తుందే,  చంటిది..ఇదీ చచ్చిపోతుంది.ఈ చెట్లూ  చచ్చిపోతాయి… ఆ తీగా చచ్చిపోతుంది…నేనూ చచ్చిపోతాను.కాకపోతే ఓ రెండురోజుల ముందే చచ్చిపోతాను.  రేపు గురించి బెంగ లేదు. నాకు ఈ రోజే ముఖ్యం. నేనూ ఇలాగే ఉంటాను..నీకిష్టమైతే ఉండు లేకపోతే పో..”

ఓ గొప్ప జీవిత సత్యం బోధపడుతుంది ప్రకాష్కి . జీవితం అంటే ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమలోంచి ప్రేమ నిర్ధారణ అవుతుంది.అందుకే చేతిలోఉన్నసిగరెట్టుని విసిరేస్తాడు, నిలకడ నడక గా మారి వడివడికి చేరి..పరుగెడతాడు. మనమీద మనకి ఉన్న ప్రేమ జీవించటానికి ఉత్సాహాన్ని ఇస్తుంది.

ఈ సారి ప్రకాష్ గీతని ఆట పట్టించటం మొదలెడతాడు.”మనిద్దరం ఉరోదిలి లేచిపోదామా?సాయంత్రం ఐదింటికి ఓల్డ్ బ్రిడ్జి కి రా “అంటాడు.

అక్కడ ప్రకాష్ ని నీళ్ళలో తోసి చర్చకి వస్తుంది, కాని అక్కడికీ వచ్చిన ప్రకాష్ గీతచే I LOVE U అని చెప్పించటంతో పాపం గీతకు కష్టాలు మొదలవుతాయి.ఇక తట్టుకోలేక  ఓరోజు ప్రకాష్ ని  నిలదీస్తుంది.

అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావ్ ??  నీ ఇష్టం వచ్చినట్టు ఏదోవిధంగా, నా నా గొడవా చేయోచ్చనుకుంటున్నావా ?? చర్చ లోపలేమో  అందరి ముందు లబో దిబోమంటూ అరిచావ్..మార్కెట్ లో నానమ్మ  దగ్గర నన్ను ఇరుకున పెట్టావ్…ఆ తరవాత… క్లినిక్ లోకొచ్చి లేని పోనీ గొడవంతా చేసావ్…ఇప్పుడు నాన్నగారి ముందు నా పరువంతా  తీస్తున్నావ్..ఏమిటి ?  నేనేమన్నా వెర్రి దాన్ననుకుంటున్నావా??..నువ్వేంచేసినా నోరుమూసుకొని పడతాననుకుంటున్నావా ??చొక్కా పుచ్చుకొని నీ సంగతేంటో తేల్చుకోడానికి వచ్చాను, ఏమంటావ్ ??

” I LOVE U,   I LOVE…. U,  ..  I …….LOVE……U… కళ్ళలోకి సూటిగా చూస్తుంటే.. గుండె లోతుల్లోంచి పెగుల్చుకొచ్చిన మాట.

అతని మౌన రాగం ఆమెకి వినపడుతుంది.. ఆ గొంతులో నిజాయితీ ఆ గుండెకు  తెలుస్తుంది.. ఆ తెల్లని మనసులోని చల్లదనం, కల్మషం లేని తెల్లదనం  మంచుగా ఆమెకు చుట్టు ముడుతుంది. ఆమె గుండె కుడా అతని గుండె లయతో ఏకం అయినట్టు అనిపిస్తుంది….కాని చిన్న అనుమానం..అందుకే అడుగుతుంది.

ఇది నిజమేనా..??  నీవు  చెప్పింది నిజమేనా ??

I LOVE  U

ఏ ?

ఎందుకో తెలిదు …కాని నిజమని మాత్రం తెలుసు

ఎలా ?

గుండె బద్దలయ్యేలా కొట్టుకుంటోంది..

నాక్కూడా

నిజంగా

ఉ ..

మనకి వినిపించేది  రేసోనేన్సు లో ఉన్న రెండు గుండెల  ఇ’లయ’ రాగం.

రెండు మనసులు ఒకటయ్యాక ఏమనిపిస్తుంది. ఒకరితో ఒకరు ఉండాలని అనిపించదా  ??

అందుకే ఈ రోజంతా నీతోనే ఉండాలని ఉంది..అంటుంది గీత.

రాత్రి గీత ఇంట్లోంచి బయటికి వస్తోంటే..  గీత నాన్న ఎదురు పడతాడు. ‘ గీత కొంత కాలంగా సంతోషంగా ఉంది.ఎందువల్లనో అర్థం  కాలేదు.. ఇప్పుడర్థం అవుతోంది. …గీతకు నీ పరిస్థితి తెలుసా ??”

“తెలిదు..తెలియకూడదనే  నేను అనుకుంటున్నాను………..నేను గీతని పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతున్నాను. ”

చావుతో పోరాడుతున్న తన కూతురు బ్రతికినంతకాలం  అయినా  సంతోషంగా ఉండాలనే కదా, కడుపు తీపి ఉన్న ఏ తండ్రయినా  కోరుకునేది.

విత్తనం మొలకేత్తితే ఆ  చిరు  మొలక ఏమనుకుంటుంది ?  చిగురించాలని ..మొక్కగా ఎదగాలని ..ఆకులు, పూవులు, కాయలు వేయాలని….మనసులో  మొలకెత్తిన ప్రేమా  అంతే కదా ?  ప్రేమ ఎక్కడుంటే జీవితం  అక్కడ ఉంటుంది.

ప్రేమకి ఉన్న మొదటి తత్వం… “బ్రతకాలి”  అన్న కాంక్షను తట్టిలేపటం. అందుకే గీత అడుగుతుంది..

నాన్న నేనెందుకు చావాలి ? నేనేం తప్పు చేసాను నాన్న ??  నాకు బ్రతకాలని ఉంది నాన్న.. నేను ఇంకొంత కాలం సంతోషంగా ఉంది నాన్న.. ఏదన్నా చెయ్యండి నాన్నా..ప్లీజ్

దేవుడిని అడగాల్సిన ప్రశ్నని …దేవుడు కూడా సమాధానం చెప్పలేని  ప్రశ్నని  తండ్రిని అడిగితే…ఏమంటాడు పాపం… మౌనంగా రోదించటం  తప్ప.

ఆ జంటకి  ఓ చిన్న సంతోషం.. కాని దాని పక్కనే ఓ పెద్ద విషాదం.

చిలిపి పిల్ల గీత… నాకు ఈరోజే ముఖ్యం అని చెప్పిన గీత.. అందరు చచ్చిపోతారు..కానీ నేను రెండ్రోజుల ముందే అని నిబ్బరంగా చెప్పిన గీత  ..నేనిలాగే ఉంటాను ఇష్టమైతే ఉండు లేకపోతే పో అని అన్న గీత.. ఇప్పు డేమంటోంది ?

” నాకు చావొద్దు. నేను నీతోనే ఉండాలి . నేతోనే ఉంటె.. నాకేమి కాదు కదూ? నేను నిన్ను ఇలాగే గట్టిగా కౌగిలించుకొని ఉంటె..చావు కుడా నన్ను నీదగ్గరినుంచి వేరు చేయలేదు కదూ?నువ్వు నన్ను నీతోనే ఉండనిస్తావు కదూ ? నువ్వు నన్ను కాపాడుతావు కదూ.?? నువ్వు నన్ను చావనివ్వావు కదూ ? నువ్వు నన్ను చావనివ్వావు కదూ ? ”

ప్రకాష్ అమ్మగారు ప్రకాష్ ని చూడటానికి వస్తుంది. బాధలో కొడుకు ఎలా ఉన్నాడో అన్న బాధతో.. కాని ప్రకాష్ సంతోషంగా కనిపిస్తాడు. దానికి కారణం ..??

అమ్మ నీకే ఫోన్ అని ప్రకాష్, గీత ఫోన్ కాల్ ని తల్లికి ఇస్తాడు.ప్రేమంటే ఏంటో  ప్రేమకే తెలుస్తుంది. ప్రేమకి, నిజానికి దగ్గరి సంబంధం.అందుకే  ప్రేమ,నిజాన్నే  చెపుతుంది.  ప్రేమకి,నిజానికి దగ్గరి సంభందం. అందుకే రెండిట్లో  ఆనందం ఎంత ఉంటుందో దుఃఖమూ అంతే ఉంటుంది.

తను చచ్చిపోతే ఫరవాలేదు,కాని తన ప్రేమ చచ్చిపోతుందంటే??

మనం చచ్చిపోతాం అంటే ఫరవాలేదు,..కాని మనం ప్రేమించినవాళ్ళు చచ్చిపోతారు అంటే ? ఆ  వేదన.. ఆవేదన తట్టుకోగాలమా ??

అందుకే చెప్పేసింది తనని వదిలిపోమ్మని…కాని ప్రకాష్..నిలదీస్తాడు..

” ఏ చావు నీదాకా వస్తే ఒప్పుకోగాలుగుతున్నావ్?? అదే నాకొస్తే ఒప్పుకోలేక పోతున్నవ్ కదూ ?

నా వల్ల   కాలేదు.

ఏ..

నా వల్ల కాలేదు..

ఏ…

నా వల్ల కాలేదు…

ఏ …….

ఎందుకంటే …నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే….నా  ప్రాణం కంటే …నువ్వు నాకు ముఖ్యం. ..ఎందుకంటే…….నా  ప్రాణం…. …కంటే ……నువ్వు నాకు ముఖ్యం.. ”

ప్రేమ అసలు స్వరూపం ఇదే .ప్రేమలో మనకి మనం ముఖ్యం కాదు ఎదుటివాళ్ళు తప్ప. ఎందుకంటే… మనకి ప్రాణం ఉండదు, వాళ్ళ ప్రాణమే మనదవుతుంది కనక, ఎందుకంటే… మనకి జీవితం లేదు వాళ్ళే మన జీవితం కనక, ఎందుకంటే… రెండు ఆత్మలూ ఒకటై పోతాయి కనక, ఎందుకంటే…. ప్రేమ విశ్వాత్మ కనక.

శరీరానికి మనసుకు ఓ తెలియని తీగ ఉంటుంది. ఆతీగా ద్వారా శరీర ఆనందం మనసుకు పాకుతుంది.  మనసు బాధ శరీరానికి సోకుతుంది. గీత మానసిక  బాధ, శరీర బాధను పెంచింది. ఆసుపత్రిలో చేర్చారు ఆపరేషన్ చేయాలి. కానిబ్రతకటం అనుమానమే.ప్రకాష్ కి విషయం తెలిసి పరిగెత్తుకోస్తాడు, కాని గీత నాన్న, గీతకి ప్రకాష్ ని చూడటం ఎందుకో  ఇష్టం లేదని, బహుశ అదే అదే ఆమె ఆఖరి కోరిక అనిచెపుతాడు. బాధ మరిచిపోయి నవ్వుతు తుళ్ళుతూ ఉండే గీతని ప్రకాష్ ప్రేమ  ఇలా చావుకు దగ్గర చేస్తుందని అనుకుంటారు అందరు..కాని వాళ్ళకేం తెలుసు …అసలు సంగతి.

తను లేకుండా, ప్రశాంతంగా చనిపోవాలని  కోరుకున్న గీత కి జోల పాడుతాడు.గాలినీ ..కోకిలనీ మేఘాన్నీ..కంటి పాపని  అర్థిస్తాడు… సవ్వడి చేయకుండా  తనకి ప్రశాంత ‘నిద్ర’ని ఇమ్మని.

ఆపరేషన్ జరిగి కోమాలో ఉంటుంది. గీత. కొమాలోంచి బయటపడితే కాని తెలిదు గీత బ్రతికేది లేనిది.

గీత కోరిక మేరకు  ఉరువిడిచి వెల్లిపోటానికి స్టేషన్ కు చేరుకుంటాడు ప్రకాష్. వాళ్ళకేం తెలుసు …అసలు సంగతి.అదే… ప్రేమ ప్రేమని బ్రతికిస్తుందని.. ప్రేమ చికిత్స చేస్తుందని. రెసొనెన్స్ లో ఉన్న ఓ గుండె ఆగిపోతే మల్లి కొట్టుకోటానికి కొంత సమయం పడుతుందని..

గీత కోమాలోంచి కళ్ళు తెరుస్తుంది తనని ప్రకాష్ వద్దకు తీసుకెళ్ళండి అంటుంది. తీసుకొస్తారు. ట్రైన్ ఎక్కబోతున్న ప్రకాష్ గీతని చూస్తాడు.. దగ్గరికోస్తాడు..చేయ్యిపట్టుకుంటాడు. కళ్ళు మాట్లాడుకుంటాయి. మళ్లీ ఆ హృదయాలు ఒకే  లయలో కొట్టుకోవటం ప్రారంభంఅవుతుంది ..

లే    చి    పో    దా    మా  …

” ఇంకెన్నాళ్ళు  బ్రతుకుతారో తెలియదు..కాని బ్రతికినంతకాలం సంతోషంగా ఉంటారు”

– గీతాంజలి –

7 Comments
  1. రాజశేఖర్ April 3, 2011 /
  2. కమల్ April 3, 2011 /
  3. chakradhar April 3, 2011 /
  4. సామ్రాజ్ఞి July 13, 2011 /
  5. yuva July 14, 2011 /
    • chakradhar July 14, 2011 /