Menu

Monthly Archive:: March 2011

అ‘మంగళ’

అనగనగా ‘మంగళ’ (ఛార్మి) అనే ఒక సినీనటి. ఆవిడకున్న అభిమానుల్లో లో ఒక పిచ్చి అభిమాని ‘చిన్నా’(విజయ్ సాయి). చిన్నా తండ్రి ఒంటికన్ను క్షుద్ర మాంత్రికుడు (ప్రదీప్ రావత్). మంగళ మీద అభిమానంతో చిన్నా ఒక బుల్లి కారుని కొని బర్త్ డే గిఫ్ట్ గా ఇద్దామనుకుంటాడు. చిన్నా ఉన్న అభిమానుల గుంపులో నుంచీ ఒకరు మంగళ ఒంటిమీద చెయ్యివేస్తే అది చిన్నానే అనుకుని మంగళ ఫ్రెండు/ డ్రైవరు ‘సుబ్బు’(సుభాష్) చిన్నను తన్నితగలేస్తాడు. ఈ అవమాన భారంతో

తడబాటు మాటల నుంచి ప్రభావంతమైన ప్రసంగం వరకు :The King’s Speech

అప్పటికి ఆయన ఒక యువరాజు. అదష్టం కలిసొస్తే మహరాజయ్యే అవకాశం వుంది. అడుగులో అడుగేసుకుంటూ ముందుకు వచ్చాడు. ఎదురుగా అశషంగా కనిపిస్తున్నప్రేక్షకులు, ప్రజలు. అతని వెనుకే నేను తోడున్నానని కళ్ళతోనే చెప్తున్నభార్య. తడబడుతూనే ముందుకు వచ్చాడు. అతను పలకబోయే ప్రతి మాటకోసం అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ప్రసంగం మొదలైంది. మాటమాటకి తడబడుతున్నాడు, నత్తితో పొడిగా పొడిగా అక్షరాలు పలుకుతున్నాడు. మాటపెగలని ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తోంది. ప్రజల్లో అసహనం పెరుగుతోంది. యువరాజు ఓడిపోయాడు. ***

2011-Oscar winners

గత ఏడాది విడుదలిన అత్యుత్తమ చిత్రాలకు ఇచ్చే ఆస్కార్ అవార్డుల ఫలితాలు నిన్న రాత్రి ప్రకటించబడ్డాయి. The King’s speech, Social Network మరియు Inception చిత్రాలకు వివిధ విభాగాల్లో అవార్డులు ప్రకటించారు. 2011కి గానూ ప్రకటించిన ఆస్కార్ అవార్డ్ ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. Best Picture Nominees Black Swan The Fighter Inception The Kids Are All Right The King’s Speech 127 Hours The Social Network