Menu

Monthly Archive:: March 2011

ధవళేశ్వరం బుడుగును నేను…

ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు ఫిబ్రవరి 23, 2011 చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. నవతరంగంలో చాలా రోజుల పాటు ఆగిపోయిన ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనుకున్నాము. రమణ గారి స్మృత్యర్థం ఆయనతోనే ఈ ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనతో వ్యాసాలను ప్రచురించడం జరుగుతోంది. రమణ గారి గురించి మీరు కూడా వ్యాసాలు పంపించవచ్చు. మీ వ్యాసాలు venkat at navatarangam dot com కి పంపించగలరు. రమణ

‘‘తెలుగు చలన చిత్ర అకాడమీ’’ కావాలి!

దేశంలో హిందీ తరువాత అత్యధిక సంఖ్యలో సినిమాలు వచ్చిన ఘనత తెలుగు సినిమా రంగానికి ఉంది. భక్త ప్రహ్లాదతో మద్రాసులో వేళ్ళూనుకుని ఉన్న తెలుగు సినిమాను మాతృభాషాభిమానం తదితర కారణాలతో హైదరాబాద్ తరలించేందుకు అనేక మంది మఖ్యమంత్రులు కృషి చేశారు. సినిమా వాళ్లకు రెడ్ కార్పెట్ పరిచి స్టూడియోలు కట్టుకోవడానికి, డబ్బింగ్, రికార్డింగ్ థియేటర్లు నిర్మించుకోవడానికి రాయితీలు, రుణాలు ఇంకా ఎన్నో వసతులు కల్పించారు. వేలాది ఎకరాల హైదరాబాద్ భూములను అప్పగించారు. తెలుగు సినీ ప్రముఖులు ప్రభుత్వ

రాష్ట్రవ్యాప్తంగా క్యాంపస్ ఫిలిం క్లబ్ లు

ఆధునిక యువత ముఖ్యంగా విద్యార్థులు సమాజంపై దుష్ప్రభావం చూపే కార్యక్రమాలు చూస్తూ వ్యసనాల ఊబిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి ధోరణి నుంచి నవ సమాజాన్ని రక్షించడమే కాకుండా వారిలో సృజనాత్మకత శక్తిని పెంచుతూ ఉపాధి అవకాశాలు విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సృజన, కళలు, సందేశాత్మక, పర్యావరణం, విద్యాపరంగా గుణాత్మక విజ్ఞానం అందించే మంచి సినిమాలు చూపించి విద్యార్థులను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దీనికోసం డిగ్రీస్థాయి విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంది. భారత సినిమా సంస్థల సమాఖ్య సంకల్పం దీనికి

సినిమా ‘సిత్రాలు’

సినిమా: మాయాబజార్ సంవత్సరం: 1957 డైరెక్టర్: కదిరి వెంకటరెడ్డి (కె.వి.రెడ్డి) సినిమాటోగ్రాఫర్: మార్కస్ బార్‌ట్లే. సీన్: ‘లాహిరి లాహిరి లాహిరిలో’ పాట చిత్రీకరణ. కథా రచయిత పింగళి నాగేంద్రరావు. ఈ పాటకు లీడ్‌గా వచ్చే సన్నివేశాలను చెప్పారు… తన మనోఫలకంపై ఓ దృశ్యాన్ని ఊహించారు.. అర్థరాత్రి… పండువెనె్నల శశిరేఖ- అభిమన్యులు నదిలో విహారానికి వస్తారు! ఎవరికీ తెలీకుండా వచ్చిన ఈ ప్రేమజంట విహారం సంగతి శశిరేఖ తల్లిదండ్రులైన బలరామ దంపతులకు తెలుస్తుంది! సంగతేంటి చూద్దామని బయలుదేరతారు…! వాళ్ళు

మన ‘జేమ్స్ బ్రాండ్స్’

హీరో మహేష్‌బాబు స్టైల్‌గా ఓ కూల్‌డ్రింక్‌ని సిప్ చేస్తూ ఉంటాడు… హఠాత్తుగా ఎక్కడినుండో ఓ అల్ట్రామోడ్రన్ అందాల భామ జీన్స్ నిక్కర్‌లో ఆయన పక్కన దర్శనమిస్తుంది… మహేష్‌బాబు తాగుతున్న కూల్‌డ్రింక్‌ను తీసుకుని పరిగెత్తడం మొదలెడ్తుంది… ఇక హీరో పోనీలే అది కూల్‌డ్రింకేకదా అని ఊరుకుంటాడా? లేదు… ఓ స్పోర్ట్స్ బైక్ వేసుకుని అందాల భామ వెంటపడ్డాడు. ఆమెను కన్‌ప్యూజ్ చేసి కూల్‌డ్రింక్ బాటిల్‌ని అతి లాఘవంగా అందుకుంటాడు… ఒకలాంటి కవ్వింపు చూపుల్తో వెళ్తున్న అందాల భామ వెనక్కు