Menu

Monthly Archive:: March 2011

బాలీవుడ్‌లో మహిళా చిత్రాలజోరు!

‘నో వన్ కిల్‌డ్ జెస్సికా…’! ‘సాత్ ఖూన్ మాఫ్’…! ‘టర్నింగ్ 30’…! ‘ఐ యామ్…’! ఈ సినిమాలన్నింటిల్లో ఉన్న కామన్ పాయింట్ ఏమిటంటే ఇవన్నీ మహిళ ఇతివృత్త ప్రధాన చిత్రాలు కావడమే! ఇలా గతంలో ఎన్నడూ లేనంతగా బాలీవుడ్‌లో ఈ సీజన్‌లో లెక్కకు మిక్కిలి మహిళా చిత్రాలు రూపొందుతున్నాయి. సంఖ్యా పరంగానే కాకుండా, ఈ సినిమాల బడ్జెట్‌లు, వీటిలో నటిస్తున్న నటీమణులు, వీటికి దర్శకత్వం వహిస్తున్న దర్శకులు అందరూ కూడా టాప్ రేంజిలో ఉండడం ఇప్పుడు బాలీవుడ్‌లో

రియలిస్టిక్ థ్రిల్లర్-నో వన్ కిల్డ్ జెస్సికా

ఇన్నాళ్లకి బాలీవుడ్‌లో కొత్త సంవత్సరం నిజంగానే ‘కొత్త’ ఫీలింగ్‌ను తెచ్చింది. ప్రతీసారీ కొత్తసంవత్సరం ఆరంభంలో కూడా పాత కథలను, తిరగరాసిన కథలనే తెరమీద చూసే పాతదానికి అలవాటుపడిన ప్రేక్షకులకి నిఖార్సయిన ‘కొత్త’దనాన్ని సినిమాపరంగా ఆవిష్కరించిన సినిమా – ‘నోవన్ కిల్‌డ్ జెస్సికా’! బాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమా కథలను అల్లుకునే ట్రెండ్ పెరిగిపోతోంది. ఇది సినిమాటిక్ గ్రామర్‌లో ఓ అద్భుతమైన ధోరణే! అయితే నిజజీవిత సంఘటనలకు ఇన్‌స్పైర్ అయి తీసిన సినిమాలలో అన్ని

ప్రభుత్వం-సినిమా.

ప్రభుత్వం ఏదో మాటవరసకి సెన్సార్ బోర్డు నడపటం తప్ప.. ఎందుకు సినిమాలని నిర్మిచటం లేదో నాకర్థం కావటం లేదు. సినిమా INDUSTRY మొత్తాన్ని కొంత మంది పెద్దమనుషుల చేతికి అందించి. వినోదపుపన్ను జనాల నెత్తినవేసి..డబ్బు పిండుకోవటమే గాని, సినిమాలో కళనీ,విలువలనీ  కాపాడాలి అన్న విషయాన్ని  వదిలేసింది.ఈ పెద్ద మనుషులు వ్యాపారమే ధ్యేయంగా..డబ్బు రెట్టింపు చేసుకోవటమే ఆశయంగా..తమతమ వారసులను కథానాయకుణ్ణి  చేయటం,వాళ్ళు అందమైన అమ్మాయిలతో తైతక్కలాడటాన్ని,ఆ అమ్మాయిల దేహాన్ని చూపిస్తూ సినిమాగా తీసి సామాన్యజనాల నరాలు జువ్వుమనిపించెట్టు చేసి…వాడు

రమణీయ కథ – 1

ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు ఫిబ్రవరి 23, 2011  చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. నవతరంగంలో చాలా రోజుల పాటు ఆగిపోయిన ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనుకున్నాము. రమణ గారి స్మృత్యర్థం ఆయనతోనే ఈ ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనతో వ్యాసాలను ప్రచురించడం జరుగుతోంది. రమణ గారి గురించి మీరు కూడా వ్యాసాలు పంపించవచ్చు. మీ వ్యాసాలు venkat at navatarangam dot com కి పంపించగలరు. చాలా

మార్చి, 2011-ఫోకస్

ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు ఫిబ్రవరి 23, 2011 చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. ఒక మంచి కవి, తెలుగువాడు అని గర్వంగా చెప్పుకోదగిన రచయిత, నిర్మాత ఇక లేకపోవటం దురదృష్టం. ఇది “తెలుగు సినిమా” అని చెప్పుకోదగ్గ చిత్రాలు “ముత్యాలముగ్గు”, “మనవూరి పాండవులు”, “సీతాకల్యాణం”, “మిస్టర్ పెళ్ళాం”,”పెళ్ళిపుస్తకం” లాంటి ఎన్నో చిత్రాలు, ఇది తెలుగు పుస్తకం అని చెప్పుకోదగ్గ పుస్తకాలు “బుడుగు”, “జనతా ఎక్స్ ప్రెస్”, “కోతికొమ్మచ్చి” వంటివి ఎన్నో రమణగారు