Menu

మార్చి, 2011-ఫోకస్

ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు ఫిబ్రవరి 23, 2011 చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. ఒక మంచి కవి, తెలుగువాడు అని గర్వంగా చెప్పుకోదగిన రచయిత, నిర్మాత ఇక లేకపోవటం దురదృష్టం. ఇది “తెలుగు సినిమా” అని చెప్పుకోదగ్గ చిత్రాలు “ముత్యాలముగ్గు”, “మనవూరి పాండవులు”, “సీతాకల్యాణం”, “మిస్టర్ పెళ్ళాం”,”పెళ్ళిపుస్తకం” లాంటి ఎన్నో చిత్రాలు, ఇది తెలుగు పుస్తకం అని చెప్పుకోదగ్గ పుస్తకాలు “బుడుగు”, “జనతా ఎక్స్ ప్రెస్”, “కోతికొమ్మచ్చి” వంటివి ఎన్నో రమణగారు సృజించారు. బాలకృష్ణ రాముడిగా బాపు దర్శకత్వంలో రూపొందుతున్న శ్రీ రామరాజ్యం” ఆయన ఆఖరు చిత్రం.

నవతరంగంలో చాలా రోజుల పాటు ఆగిపోయిన ’ఫోకస్’ శీర్షిక ను,రమణ గారి స్మృత్యర్థం, తిరిగి ప్రారంభించాలనే ఆలోచనతో వ్యాసాలను ప్రచురించడం జరుగుతోంది. రమణ గారి గురించి మీరు కూడా వ్యాసాలు పంపించవచ్చు.

మీ వ్యాసాలు venkat at navatarangam dot com కి పంపించగలరు.

ఇప్పటివరకూ వచ్చిన వ్యాసాలు:

One Response
  1. ravi March 13, 2011 /