కృష్ణలీలలు (1959)

an-1290714434232

లక్ష్మీరాజ్యం సమర్పించు, కృష్ణలీలలు – అని వీసీడీ కవర్ పైన కనబడ్డది. అయితే, కింద పేర్లు రాస్తూ – లక్ష్మీరాజ్యం, ఎస్వీరంగారావు, రేలంగి,గుమ్మడి అని ఉంది. అక్కడ నాకు క్యూరియాసిటీ మొదలైంది – ఎవరు ఈ లక్ష్మీరాజ్యం అని. సరే, సినిమా ఏదో బాగుండేలాగుందని అనిపించి కొన్నాను ప్లానెట్ ఎం లో. టైటిల్స్ వేస్తూ ఉంటే గమనించాను, ఈ సినిమా దర్శకత్వం – జంపన అని. ఎవరూ – రైటరు జంపన గారే! అని ఆశ్చర్యపోయాక, చూడ్డం మొదలుపెట్టాను. నిజానికి టైటిల్స్ తరువాత ఈ సినిమా చూడ్డం కొనసాగించానంటే ’జంపన’ పేరే కారణం అనిపిస్తుంది, ఎస్వీ రంగారావుతో పాటు.

ఈ సినిమా కథని నేను ప్రత్యేకం పరిచయం చేయనక్కర్లేదు కదా. దేవకీ వసుదేవుల వివాహం మొదలుకుని కంసవధ వరకూ కథ ఉంది. అయితే, కథలో కృష్ణుడు, కృష్ణుడి లీలలే కాక, ఇతరత్రా గోకుల వాసుల కథలు కూడా కొంచెం ఉన్నాయి. సూర్యకాంతం ఒక పాటలో కనబడ్డం నాకు సంబంధించినంత వరకూ సర్ప్రైజ్ ప్యాకేజీ. ఆ పాట భలే ఉంది – అత్తాకోడళ్ళ మధ్య గొడవ. గోవర్థనగిరి సీన్ ఈ వీసీడీలో లేదు. కానీ, మొన్నే కదా గోవర్థన గిరి ఎత్తాడు అని డైలాగు మాత్రం ఉంది :-)

అసలు కృష్ణలీలలు ఎవరు తీసినా, ఎలా తీసినా బాగుంటుందని నా అభిప్రాయం. ఈ సినిమా కూడా నాకు విపరీతంగా నచ్చింది ఎందుకు? అంటే – ఎంటర్టైన్మెంట్ పరంగా చాలా బాగుంది కనుక. నందుడిగా రేలంగి ఉన్నందుకేమో – ఆ పాత్ర కూడా కొంచెం హాస్యం పండించింది. ఇదివరలో యశోదాకృష్ణ చూసినపుడు నందుడి పాత్ర ఇలా ఫన్నీగా ఉన్నట్లు అనిపించలేదుమరి! పాటలూ, పద్యాలూ నాకు విపరీతంగా నచ్చాయి. చూడ్డానికి కూడా బాగున్నాయి. సంభాషణలు కూడా చక్కగా, తేలిగ్గా అర్థమయ్యేలాగానే కాక, ఎంటర్టైనింగ్గా కూడా ఉన్నాయి. నటీనటులు కూడా పాత్రలకి అతికినట్లు సరిపోయారు. తారాగణం – గుమ్మడి, ఎస్వీఆర్, రేలంగి తప్ప నాకింకెవరూ తెలీదు. యశోద పాత్రధారి అనుకుంటాను లక్ష్మీరాజ్యం గారు – నాకు తెగ నచ్చేశారు. యశోద ఇలాగే ఉంటుందేమో, అనిపించింది. అసలు సినిమా ఎక్కడా బోరు కొట్టలేదు. ఎక్కడా ఆగకుండా, ఎక్కడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూశాను. ఐతే, వీడియో క్వాలిటీనే బొత్తిగా ఏమీ బాగోలేదు.

లక్ష్మీరాజ్యం గారెవరు? ఏమిటి కథ? అన్న కుతూహలం మాత్రం పెరిగిపోయి, వివరాల కోసం వెదుకుతూ ఉంటే, ఆంధ్రప్రభలోని ఈ వ్యాసం కనబడ్డది. ఈ వ్యాసం సినిమా పరిచయమో ఇంకోటో కాదు. అనుకోకుండా ఈ సినిమా చూసి, నచ్చి – ఆనందంలో రాస్తున్న స్పందన – అంతే.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

సౌమ్య

రచయిత:

6 Comments to “కృష్ణలీలలు (1959)”

  • above photo is singer jikki krishnaveni not laxmi raajyam.

  • లక్ష్మీరాజ్యం గారి గురించి మొదలైన క్యూరియాసిటీ చివరికి ఆవిడ యశోద పాత్రదారేమోనని అనుమానించడంతోనే ముగిసింది. ఆవిడ గురించి కొత్తగా చెప్పిందీ లేదు, ఇచ్చిన ఫోటో కూడా కరెక్ట్ కాదు. కనీసం ఆవిడ నర్తనశాల నిర్మించారన్న విషయం కూడా ప్రస్తావనలోకి రాలేదు. పాటలు బాగున్నాయి గానీ చేసింది సుసర్ల గారన్న రెఫరెన్సు కూడా లేదు.

    ఏం చెప్పదలుచుకుని లేదా ఏం ఆనందం పంచుకోదలచి ఈ వ్యాసం రాసినట్టు?

    ప్లానెట్ ఎం, టైటిల్స్, క్యూరియాసిటీ, కొన్నాను, చూసాను అన్న ఇల్లాలి ముచ్చట్లు తప్ప?

    చూడడం, చదవడం, పరిశీలించడం, పరిశోధించడం – ఇలాంటి విషయాల్ని మించి ఏదో ఒకటి రాయడమే ఇష్టం అయినప్పుడు కలిగే అనర్థాలు – ఇలాంటి వ్యాసాలు !

    • “ఈ వ్యాసం సినిమా పరిచయమో ఇంకోటో కాదు. అనుకోకుండా ఈ సినిమా చూసి, నచ్చి – ఆనందంలో రాస్తున్న స్పందన – అంతే.”
      అని రాసాక కూడా మీరు ఇదంతా చెబితే నేనేం చేయలేనండీ. మీరన్నట్లు, ఇల్లాలో మరెవరో కానీ, అవి మాత్రం ముచ్చట్లే. అది obvious గా తెలుస్తూనే ఉంది అని నేను అనుకున్నాను.

      అసలు లక్ష్మీరాజ్యం అని ఒకరు ఉన్నారన్నదే నాకీ సినిమా చూస్తే తెలిసినప్పుడు, ఆవిడేం తీసారో ఎలా తెలుస్తుంది? ఇక ఫొటో సంగతి – ఆ సైటులో ఆవిడ ఫొటో గా అదే పెట్టారు.

      “(పైన పెట్టిన ఫొటో earlytollywood అన్న సైటులో పంతులమ్మ అన్న 1943 సినిమాకు సంబంధించి పెట్టిన లక్ష్మీరాజ్యం గారి ఫొటో.)”
      -అని కూడా రాశాను. అప్పుడు, మీరు ఆ సైటులోకెళ్ళి వాళ్ళకి చెప్పాలి.

      ఇన్ని విషయాలు తెలిసిన మీబోటి విజ్ఞాన ఖనులు వచ్చి మీరే ఆవిడ గురించి రాస్తారనే ఈ వ్యాసం రాసాను. ఐతే, మీ ఫోకస్ మాత్రం ఇతరుల అజ్ఞానాన్ని హేళన చేయడం పైనే ఉంటే, ఏం చేస్తాం లెండి!

      • Fitting Reply!.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories