Menu

ప్రభుత్వం-సినిమా.

ప్రభుత్వం ఏదో మాటవరసకి సెన్సార్ బోర్డు నడపటం తప్ప.. ఎందుకు సినిమాలని నిర్మిచటం లేదో నాకర్థం కావటం లేదు.

సినిమా INDUSTRY మొత్తాన్ని కొంత మంది పెద్దమనుషుల చేతికి అందించి. వినోదపుపన్ను జనాల నెత్తినవేసి..డబ్బు పిండుకోవటమే గాని, సినిమాలో కళనీ,విలువలనీ  కాపాడాలి అన్న విషయాన్ని  వదిలేసింది.ఈ పెద్ద మనుషులు వ్యాపారమే ధ్యేయంగా..డబ్బు రెట్టింపు చేసుకోవటమే ఆశయంగా..తమతమ వారసులను కథానాయకుణ్ణి  చేయటం,వాళ్ళు అందమైన అమ్మాయిలతో తైతక్కలాడటాన్ని,ఆ అమ్మాయిల దేహాన్ని చూపిస్తూ సినిమాగా తీసి సామాన్యజనాల నరాలు జువ్వుమనిపించెట్టు చేసి…వాడు చల్లే డబ్బులు ఏరుకోవటం తప్పితే..కళా విలువలు గల సినిమాలు తీయటం బాధ్యతగా అనుకుంటున్నారా ?

అయినా వాళ్ళకి ఎందుకు ఉంటుంది సమాజం పట్ల బాధ్యత?? పెట్టుబడి పెట్టారు..రాబట్టుకోవాలి అని తప్ప.తాము తీసిన సినిమా సమాజాన్నిఎటు తీసుకుపోతే ఏంటి??

సంకృతిని కాపాడుతూ ముందు తరాలకి అందించటం..కళా విలువలు తెలియజెప్పే సినిమాలు నిర్మించటం ప్రభుత్వం భాద్యత. సినిమా వ్యాపారంగా మారిపోయిన ఈ రోజుల్లో..డబ్బు తప్ప ఇంకేం అక్కరలేదని ప్రజలు అనుకుంటున్న ఈ రోజుల్లో..డబ్బుతో వొచ్చే సుఖాలు తప్ప మరే ఆనందము లేదని భావిస్తున్న ఈ రోజుల్లో… కళా యొక్క ఉన్నతత్వాన్ని అది ఇచ్చే రసానందాన్ని కనీసం అప్పుడప్పుడు జనాకిని గుర్తు చేయాల్సిన భాద్యత ఎవరిదీ ?మనం ఏర్పరచుకున్న ప్రభుత్వానిది కాదా??

ఏం ?ప్రతి సంవత్సరం ఒక నలుగురు దర్శకులనో.. లేదా.. ఓ నాలుగు కథలు ఎంపిక చేసి.. సినిమాలుగా తీయొచ్చు కదా? అవార్డులు, ప్రశంశలు అందుకున్న పుస్తకాలని తెరకి ఎక్కించొచ్చు కదా ?బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్న వాళ్లకి మరో సినిమా తీసే అవకాశం కల్పించొచ్చు కదా. నవ,యువ దర్శకుల కథలు విని వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వొచ్చు కదా??

కాని దురదృష్టవశాత్తు కళ అంటే తెలియని నాయకులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.ఎంత సంపాదించాం?ఎన్ని తరాలకి కూడబెట్టాం?ఎంత పెద్ద ఇల్లు ఉంది?ఎంత తాగాం?ఎంత అనుభవించాం?ఏయే వేళ్ళకి ఏయే ఉంగరం తొడగాలి ?మెడలో ఎంత లావు పాటి గొలుసు చేయించాలి ??ఎంత ఖరీదైన కార్లో తిరుగుతున్నాం??ఇవే తప్ప.. కళ అన్నది ఏ  కోశాన్నైనా కనబడుతుందా వాళ్ళల్లో??

తెలుగు సినిమా ఇలా తగలడటానికి కారణం?

*ప్రతుత తెలుగు సినిమా ఇలా ఉండటానికి కారణం ఆసినిమాలు తీసేవాళ్ళకి కళలో అక్షరాస్యత లేకపోవటం.

*సినిమా డబ్బు..గ్లమౌర్ త్వరగా సంపాదించే మార్గం గానే కనపడటం తప్ప కళ అని అనిపించక పోవటం.

*ప్రాంతీయ తత్వం పేరుకొని పోయి అర్హత లేనివాల్లకీ సినిమాల్లో అవకాశం కలగటం.

*సినిమా సంఘాలలో..చేరే వాళ్ళకి కనీస చదువు లేకపోవటం.

*ఆయా రంగానికి చెందినా సాంకేతిక నిపుణులు తమరంగానికి సంబందించిన విద్యలో ఉత్తీర్ణత లేనివాళ్ళే

* సినిమాని పెట్టుబడి దారులకి అప్పగించి ప్రభుత్వంచేతులు దులిపేసుకోవటం.

ప్రభుత్వం మంచి సినిమాని ప్రజలకి అందించటం తన భాద్యతగా భావించి సినిమాని కళా జ్ఞానుల చేతికి అందిస్తే తప్ప.. తెలుగు సినిమా బాగుపడే అవకాశంలేదు.

సినిమా అంటే కేవలం సామాన్యజనం కోసమే అని కాకుండా.. సినిమా కళాభిమానుల  కోసంకూడా

అన్ని సినిమాలు గొప్ప కళాఖండాలు కావాలనీ..రావాలనీ  అనటం లేదు.. కానీ కనిసం సంవత్సరానికి రెండయినా రావద్దా ..ఆ నిర్మాణ బాధ్యత ప్రభుత్వానికి లేదా ?

5 Comments
    • శంకర్ March 17, 2011 /
  1. చక్రధర్ March 17, 2011 /
  2. rajendra kumar March 18, 2011 /