Menu

గీతాంజలి -1

software జాబులు…జేబునిండా డబ్బులు…Live in relationship లు, one nightstandలు,take it easy loveలు…ఇవన్నిటి ముందు ఈవిషయం సాధారణం అయిపోయిందో…లేక అలవాటయ్యిందో లేక…మనం పెద్దగా ఫీల్ కావటం లేదో, కాని అప్పట్లో… ‘ వాళ్ళు ఇద్దరూ లేచిపోయారంట’ అన్న విషయం పెద్ద దుమారం లేపేది.క్షణాల్లో  ఊరు వాడా పాకి పోయేది. దీనిని పెద్దలు  మర్డర్ చేసిందానికంటే పెద్ద Crimeగా భావిస్తే..యువకులు అదో crazy..adventure లా ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటి రోజుల్లో” నేను నీకు నచ్చానా??అయితే మనిద్దరం ఉరు విడిచి లేచిపోదామా ?” అని ఓఅమ్మాయి నోట చెప్పించి, జనాల మతి పోగొట్టాడు మాస్టర్ అఫ్ ఇండియన్ celluloid మణిరత్నం.అయితే సినిమా లేచిపోవటం గురించి కాదని అందరికీ తెలిసిందే. 🙂

పేరులోనే ఓ కొత్తదనం..   ఆకర్షణీయమైన పోస్టర్ మీద పోస్టర్ మీద  వంపులుతిరిగి ఇంకా  ఆకర్షకంగా.. ” గీతాంజలి”

ఏముంది ఈ సినిమాలో?

ఏమి లేదు.బావుంటుంది అంతే.

అవుననుకో,అయనా…ఎందుకు దీనిగురించి ఇప్పుడు?

ఎందుకంటే ఎప్పుడో ఇరవై రెండేళ్ళ కిందటి సినిమా, ఇప్పుడు చూసినా ..ఈ కాలానికి కుడా  ఫ్రెష్ గా  ఉంటుంది కనక.

ఆ పాత్రలు.. ఆ నటన..ఆ మాటలు..ఆ పాటలు..ఆ సంగీతం..ఆ బాక్గ్రౌండ్ స్కోరు.. ఆ సినిమాటోగ్రఫీ.. అన్నీ అద్భుతం  కనక.. చూస్తున్నంతసేపు భావోద్వేగంలో పడి కొట్టుకుపోతాం కనక. సినిమా అంతా ఓకొత్త  ఒరవడిగా ఉంటుంది కనక. ప్రస్తుతం  కొత్తదనం కరువయ్యింది కనక… అలాంటి కొత్తదనం కోసం చాల తక్కువ మంది ప్రయత్నిస్తున్నారు కనక…పెద్ద పెద్ద దర్శకులే  ఎంత ప్రయత్నించినా  ఆ ఫ్రెష్ ఫీల్ రావటం లేదు కనక…ఈ సినిమాకో ఆత్మ ఉంది కనక…ఆఆత్మ ఏంటో మనవాళ్ళకి తెలియదు కనక… ఆ మాట కొస్తే నాకు తెలిసి తెలియనట్టు  ఉంటుంది గనక. ……

పోనీ అవన్నీ వదిలెయ్యి.. నేనే ఊరికె  పని పాట లేక రాస్తున్నాఅనుకో.. సరేనా.

అయితే ఒకే.

ఆడిటోరియం..డిగ్రీ ప్రధానోత్సవం ..  యువత గురించి VC ప్రసంగం..

”  కాలం… నవభారతానికి ప్రాణం”

లేట్ గా వస్తున్న కొందరు విద్యార్థులు.

“యువభారతం చట్టవిరుద్దంగా ఎప్పుడు ప్రవర్తించదనీ..అడ్డదారులు  తోక్కదనీ  నానమ్మకం.”

విద్యార్థులు గోడలు దూకుతారు.

‘నేటి యువభారతం..చక్కని నాగరికతను..సమాజ స్పృహ ను కలిగి ఉంటుందని’….

అమ్మాయిని చూసి ఈల  వేస్తారు..

‘మన భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది’

సిగరెట్టు చేతులు మారుతుంది.

‘మనదేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే  ఉంది అని మరొక్క మారు మనవి చేస్తున్నాను’

మరోసారి  దమ్ము లాగుతున్న హీరో ..

హీరో పేరు పిలవగానే … సిగరెట్టు పొగ వదులుతూ..పట్టా పుచ్చుకొని.. VC ని  చూసి..

I love U అంటాడు. ఇళయరాజా గారి బీట్ తో ఓ సాంగు  మొదలవుతుంది.

what a   crazy బిగినింగ్.

” నాన్నా కాఫీ తాగుతారా ??  …………….మీకేప్పుడైన ఒంటరిగా ఉండాలనిపించిండా??  నాకనిపిస్తోంది.  ఉన్నట్టుండి  ఒకమ్మాయి..’నీవు నాలుగు రోజులల్లో చచ్చిపోతావ్’ అని చెపితే  తట్టుకోలేక పోయాను తెలుసా ….కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్లి ఒంటరిగా ఉండాలనిపిస్తోంది నాన్నా..  ”

కథపరంగా ఎంతో లోతయిన భావోద్వేగం గల సన్నివేశం.  కానీ  వెనకటిలా కాక.. సూటిగా.. గుండెల్లోకి దూసుకుపోయే సంభాషణలు… కొత్తగా ఉండి భావోద్వేగాన్ని రెట్టింపు చేస్తాయి.

వర్షంలో మొత్తం slow motion లో చిత్రీకరించిన పాటతో ఓ అందమైన  అమ్మాయి ” గీతాంజలి”  …  గీత,   హీరోయిన్ గా పరిచయం.  అ అమ్మాయి చాల చాల చిలిపి. అందరిని ఆట పట్టిస్తుంటుంది.  వాళ్ళ నాన్నని కుడా, అయినా ఆయనకి తన కూతురంటే  ప్రాణం.

వాళ్ళ నానమ్మతో ఒక ఫ్రెండ్ తో మాట్లాడినట్టు  మాట్లాడుతుంది.ఎంత కలుపుగోలంటే..

” నానమ్మా,  మనవేనకాలే ఒకడు నీడలా వస్తున్నాడు, నన్ను ఫాలో చేస్తున్నాడో నిన్ను ఫాలో చేస్తున్నాడో తెలీటం లేదు.”

” అ కొట్లో ఏదో కొంటున్నట్టు మనకి సైట్ కొడతాడు చూడు………………………….’ఆ దొంగచూపులు చూస్తున్నాడే.. పోరంబోకు వెధవ..’

“ఇది పట్టుకో నానమ్మ.. నేను వెళ్లి రెండు జాడించి వస్తాను.”   అని ఆ అమ్మాయి వాడి దగ్గరకు వచ్చి ” నేను నీకు నచ్చానా??   మనిద్దరం  ఉరు విడిచి లేచిపోదామా ? ”   అయితే చర్చ వెనకాలకి  7 గంటలకి రా  అని  స్మశానానికి పిలిచి,దెయ్యం లా వెంటపడి.. ……..పాపం..  వాడు ప్రాణాలు చేతిలో పెట్టుకోని పారిపోతాడు.

ఒకమ్మాయి నిజంగా ఇలా చేస్తే… గుండె ఆగి చచ్చి పోతారు.  😉

ప్రకాష్  (హీరో)  ఈ అమ్మాయి ఉండే  ఉరు వచ్చాడు. అందమైన  కొండకోనల్లో..మైదానాలతో.. ఉండే ఆ   hill stationలో తనకు కావలసిన ప్రశాంతత దొరికి  హాయిగా పాటలు పాడుకుంటూ ఉండగా..తన పిల్ల దయ్యాలగ్యాంగ్ తో వస్తున్న హీరోయిన్ కంట పడ్డాడు.  ఇంకేమన్నా ఉందా..

” నానమ్మ.. నీవు వయసులో ఉన్నపుడు ఎవరినైనా ప్రేమించావా..”

“నీకేమైనా పిచ్చా’

“ప్రేమించావా ?”

‘హే గట్టిగా అరవకే పరువు పోతుంది..’

” కాదు ప్రేమించి ఏదన్న అయిన్దనుకో …దేవదాసులైపోతారా ??”

‘నోరు మూసుకో..’

“లేదు నానమ్మ.. నిన్న ఒకతన్ని చూసాను..ప్రేమలో పట్టనుకుంటాను..పాపం. గడ్డం పెంచుకొని..నీలాగా శాలువా కప్పుకొని.. చుక్కలు లేక్కపెట్టుకుంటూ పాడుకుంటున్నాడు. నీవేప్పుడైనా అలా పాడావా ?”
‘ ఛి పోవే..”

” నిజంగా పాడాడు నానమ్మా. నేనాపాట పాడి చూపించనా ??”  అలా  పాడుతున్నప్పుడే ప్రకాష్ ఎంటర్ అయ్యాడు.ఇదంతా విని ఊరుకుంటాడా??తిన్నగా వెళ్లి   గీతని ముద్దు పెట్టుకున్నాడు.                 .. ఇది చూసి నానమ్మ ఊరుకుంటుందా ??

హీరోయిన్ కుడా దెబ్బకు దెబ్బ తీయాలని.. I LOVE U  హీరో కి చెప్పి  అని నాటకం ఆడుతుంది..తన రేగులేర్ ప్లేస్  స్మశానానికి రమ్మంటుంది. ప్రకాష్ వస్తాడు. కానీ…ఇంతాకు ముందు వాడిలా భయపడి  పారిపోకుండా గీతని..ఆ గ్యాంగ్ నీ  భయపెట్టించి పరుగులేట్టిస్తాడు.

ఉక్రోషం  ఆగని గీత మార్కెట్టులో.. వాళ్ళ నానమ్మకి ప్రకాష్ ని చూపించి,  తన దగ్గరికి వచ్చి లేచిపోదామా అని అడిగాడని  లేనిపోనివి చెపుతుంది. ..ఆమె ప్రకాష్ ని  అందరిముందు తిడుతుంది. ఇందంతా ఎందుకు చేస్తుందో ప్రకాష్ కి అర్థం కాదు.

తెల్లారి…   ప్రకాష్, సరాసరి  గీత ఇంటికి వెళ్లి,  గీతని ఎత్తి కార్లో పడేసి .. 42 కిలోమీటర్ల దూరం లో వదిలేసి వస్తాడు కోపంలో. చీకటిపడి పోతుంది..గీత ఇంతకి రాలేదని అందరు ఆందోళన పడుతుంటే.. చంటిది  వచ్చి చెపుతుంది ప్రకాష్ కి ‘ అక్క ఇంకా ఇంటికి రాలేదు”  అని.  ప్రకాష్ గీత ని వెతుక్కుంటూ..వెళ్లి చివరికి చలిలో వణికి పోతున్న( నటిస్తున్న ) గీతని తీసుకొని ఇంతకి వస్తాడు.వాకిట్లోనే పిల్లలతో ఎదురు చూస్తున్న నానమ్మ…కంటి నిండా నీళ్ళతో అసలు విషయం చెపుతుంది.

”  పాపం అసలే అది అల్పాయిషుది.. నేదో రేపో అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతోందయ్యా.. ఏదైనా జరగరానికి జరిగితే నువ్వు ప్రాణం  పోస్తావా ?? అనుక్షణం కృశించి పోతుందయ్యా ఆ పిల్ల..బయటికేనయ్య ఈ చిరునవ్వులు చిందులాటలు..కాని.. ”

ప్రకాష్ కి మతి పోయింది.. నిజమా…

చూస్తున్న మనకీ ఓ షాక్.. నిజమా    ——————  ఇంటర్వెల్ బ్యాంగ్..

12 Comments
 1. రాజశేఖర్ March 30, 2011 /
  • Sasidhar March 30, 2011 /
  • chakradhar March 30, 2011 /
  • శంకర్ March 31, 2011 /
 2. suresh velpula March 30, 2011 /
 3. vinay March 30, 2011 /
 4. శంకర్ March 31, 2011 /
  • satish March 31, 2011 /
 5. rajendra kumar April 3, 2011 /
 6. సామ్రాజ్ఞి July 13, 2011 /