Menu

రాష్ట్రవ్యాప్తంగా క్యాంపస్ ఫిలిం క్లబ్ లు

ఆధునిక యువత ముఖ్యంగా విద్యార్థులు సమాజంపై దుష్ప్రభావం చూపే కార్యక్రమాలు చూస్తూ వ్యసనాల ఊబిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి ధోరణి నుంచి నవ సమాజాన్ని రక్షించడమే కాకుండా వారిలో సృజనాత్మకత శక్తిని పెంచుతూ ఉపాధి అవకాశాలు విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సృజన, కళలు, సందేశాత్మక, పర్యావరణం, విద్యాపరంగా గుణాత్మక విజ్ఞానం అందించే మంచి సినిమాలు చూపించి విద్యార్థులను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దీనికోసం డిగ్రీస్థాయి విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంది.

భారత సినిమా సంస్థల సమాఖ్య సంకల్పం దీనికి తోడు కావడంతో కళాశాలల్లో క్యాంపస్ ఫిలిం క్లబ్ ల పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. తొలిదశలో భాగంగా పది డిగ్రీ కళాశాలల్లో ఈ క్లబ్బులు ఏర్పాటు చేయాల్సిందిగా కళాశాల విద్య కమీషనరేట్ ఆదేశాలు జారీ చేసింది. బేగంపేట (హైదరాబాద్), కరీంనగర్, కర్నూలు, ఒంగోలు, వరంగల్ (మహిళా), కరీంనగర్ (పురుషులు), ప్రభఉత్వ డిగ్రీ కళాశాలలు, విశాఖపట్నం, కాకినాడ, చిత్తూరు, విజయవాడ కళాశాలలు ఉన్నాయి. పర్యావరణం, సాహిత్యం, విద్య, విజ్ఞానం, తదితర ముఖ్యమైన రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలకు ఎంపికైన సినిమాలు మాత్రమే ఈ క్లబ్బుల్లో ప్రదర్శిస్తారు. ఈ ఫిల్మ్ క్లబ్బుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతల్లి సమాఖ్య కార్యదర్శి, ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కరీంనగర్) లైబ్రేరియన్ వారాల ఆనంద్ కు అప్పగించారు.

ఇంతవరకూ ఆయన ఎనిమిది కళాశాలల్ని సందర్శించి ఈ క్లబ్ లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్లబ్ ను ప్రారంభించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విజయవాడ, చిత్తూరు కళాశాలల్లో స్థాపించాల్సి ఉంది. ఏర్పాటు అనంతరం వాటి ఫలితాలపై సమాచారం పంపాల్సిందిగా కళాశాల విద్యాకమీషనర్ అదర్ సిన్హా ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించారు. వీటి సంతాలను చూసి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఈ క్లబ్బులు ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ ఉద్దేశ్యం :
సినిమాలు చూడడంతో పాటు సినిమా నిర్మాణం, దర్శకత్వం, వీడియోగ్రఫీ, ఎలక్ట్రానిక్ మీడియా ఎడిటింగ్ తదితర రంగాల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంచడం.
సినిమాలు, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విస్తృతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడం.
డిజిటల్ ఫోటో, వీడియో తదితర రంగాల్లో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్ది చిన్న సినిమాలు, డాక్యుమెంటరీల నిర్మాణం పట్ల యువతను ప్రోత్సహించడం.

వీక్షణ… సమీక్ష…
విద్యార్థులు కళాశాల్లో ప్రదర్శించే సినిమాలు వీక్షించడంతో పాటు వాటిపై సమీక్ష రాసి పంపాల్సి ఉంటుంది. ఇలా సేకరించే సమీక్షల్లో ఉత్తమమైన రచనను స్వీకరించి బహుమతుల ద్వారా విద్యార్థులను ప్రోత్సహిస్తారు.

ప్రభుత్వ నిర్ణయం సంతోషకరం

ఇంతవరకూ ఇలాంటి క్లబ్బులు ప్రధాన నగరాలకే పరిమితమయ్యాయి. కొంతమంది రచయితలు, కళాకారులు, అధ్యాపకులు మాతరమే వాటిల్లో సభ్యులుగా ఉండేవారు. ఈ సంస్కృతిని కళాశాల విద్యార్థులకు కూడా విస్తృతం చేయాలనే సంకల్పంతో చిత్ర నిర్మాణ అభివృద్ధి సంస్థను కోరగా సంప్థ ఎండీ పార్థసారధి (ఐఏఎప్) ఆదేశాల మేరకు కళాశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా ఈ క్లబ్బులను ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాశాం. ఔత్సాహిక కళాశాలలు తమను సంప్రదిస్తే క్లబ్బులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

One Response
  1. చక్రధర్ March 13, 2011 /