Menu

In to the wild.

ఈ ప్రకృతి , ప్రపంచం, ఈ సమాజం, వ్యక్తి  ప్రతీదీ ఒక వ్యవస్థే. ఆ వ్యవస్థ ఎందుకు ఎలా ఎవరిద్వారా ఏర్పడిందో తెలిదు. వ్యవస్థ ని అర్థం చేసుకున్నవాళ్ళకి, లేదా అనుకూలంగా కాలం గడుపుతున్న వాళ్ళకి పెద్ద బాధేమి ఉండదు. కాని ఏ వ్యవస్థ ఇలానే ఎందుకు ఉంది అని ప్రశ్నించే వాళ్ళకి మాత్రం ప్రతి క్షణం నరకమే. సమాధానం దొరికే దాకా కుదురుగా ఉండనివ్వదు. ఆ సమాధానం కనుగొనే ప్రయత్నమే వాళ్ళ జీవితం అవుతుంది. ఆ ప్రశ్న ఎప్పుడు ఎవరిని తడుతుందో..తట్టి లేపుతుందో ?  ఆ ప్రశ్నకి జవాబు ఎవరికీ వారే తెలుసుకోవాలి. ఎందుకంటే వేరే ఎవ్వరి సమాధానం వాళ్ళని సంతృప్తి పరచదు కనక. యువరాజుగా సర్వ సుఖ బోగాలు అనుభవిస్తున్నగౌతముడు అంతఃపురం దాటి సామాన్య జనాల దీనావస్థ చూసి ఆ ప్రశ్న ఉదయించింది…అ ప్రశ్న అతన్ని బుద్ధుడిగా మార్చింది.

” its mystery to me.. we have a greed..

with which we have agreed;

u think u have to want more than u need

until u have it all, u wont b freed..

society; ur a crazy breed

I hope ur not lonely with out me u want more than u have ,, u think u need

and u think u want more than u want; ur thoughts begin to bleed

. I think I need to find a bigger place ; cause when u have more than u think; u need more space..

society; ur a crazy breed

i hope ur not lonely with out me

society, crazy indeed; i hope ur not lonely with out me”

 

Christopher McCandless అనే ఒక నవ యువకుడు ఈ materialistic సమాజం మీద విసుగు పుట్టి ,  ఉన్న డబ్బుని దానం చేసి అలస్కా గమ్యంగా ప్రయాణం సాగిస్తాడు. ఆ ప్రయాణం లో కలిసిన స్నేహితులు.. పొందిన అనుభవాలు.. చెందిన అనుభూతులు..దర్శించిన సత్యాలు… ఇదే ఈ సినిమా కథ.

దర్శకత్వం..సంగీతం, సినిమాటోగ్రఫీ..ఎడిటింగు ఇలా అన్ని సాంకేతిక విభాగాలు అద్భుతంగా కుదిరి ఆసక్తి కరమైన కథ..కథనం తోడయ్యి అసాధారణ నటన కలగలిసి ..మన భావోద్వేగాలు తట్టి లేపే సినిమా ఇది.

Christopher McCandless అనే యువకుని నిజ జీవితం ఆధారంగా by Jon Krakauer రాసిన పుస్తకానికి Sean Penn ఇచ్చిన తెర రూపమే ఈ సినిమా. ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ సినిమా పండుగలలో ప్రదర్శించబడి. ఎన్నో విభాగాల్లో .అవార్డులు కుడా గెలుచుకుంది. ‘ప్రపంచ సినిమా ‘ ప్రియులు చూసి దాచుకోవలసిన సినిమా ఇది.

3 Comments
  1. srikanth March 23, 2011 / Reply
  2. srikanth March 23, 2011 / Reply
  3. Venkat March 25, 2011 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *