రంగు అంటే ఒక కాంతి తరంగం. మన చుట్టూ ఉన్న భౌతిక వస్తువులు,జీవ పదార్థాలు తెల్లని కాంతి లోని కొన్ని తరంగాలను శోషించుకొని , కొన్ని తరంగాలను పరావర్తనం చెందించటం వల్ల మనం వాటిని ఆయా రంగులుగా చూస్తున్నాం.
తెల్లని కాంతి ఏడు రంగులుగా విడిపోతుందని తెలుసుకున్నాం. పట్టకం ద్వారా విడిపోయిన ఏడురంగులలలో స్పష్టంగా కనపడే రంగులు మూడు. అవి RED, BLUE, GREEN. వీటినే ప్రాథమిక రంగులు అంటారు . ( primary colors ) ఈ మూడు రంగులు కలిస్తే తెలుపు రంగు వొస్తుంది.
ఏదేని రెండు ప్రాథమిక రంగులు కలిసి ఒక గౌణ రంగు ఏర్పరుస్తుంది. (secondary colors)
Red+ Green = Yellow
Red + Blue = Magenta
Green + Blue = Cyan
ఈ మూడు గౌణ రంగులు కలిసి నలుపు రంగును ఏర్పరుస్తాయి.
Yellow + Magenta + Cyan = నలుపు (K)
ప్రతి ప్రాథమిక రంగు, ఒక గౌణ రంగుతో కలిసి తెలుపు రంగుని ఏర్పరిస్తే ఆ గౌణ రంగుని, ఆ ప్రాథమిక రంగుకి పూరక రంగు అంటారు.
అంటే ప్రతి ప్రాథమిక రంగు ఒక పూరకరంగుతో కలిపి తెలుగు రంగుని ఇస్తుంది.
అంటే ప్రతి ప్రాథమిక రంగుకి ఒక పూరకరంగు ఉంటుంది. ప్రాథమిక రంగు దాని పూరకరంగు ఒకదానికొకటి “వ్యతిరేక రంగు’లు (contrast colors ) కూడా.
Red + Cyan = white (Cyan = Green + blue)
Green + Magenta = white ( Magenta = Red + Blue)
Blue + Yellow = White (Yellow = red + Green)
కనక RED – CYAN , GREEN – MAGENTA , YELLOW – BLUE పూరక రంగులు. ( contrast color)
ప్రతి రంగు తెలుపురంగుతో కలిసి ఏర్పరిచే రంగును దాని tint అంటారు. (లేత రంగులు)
ప్రతి రంగు నలుపు రంగుతో కలిసి దాని shade ని ఏర్పరుస్తుంది. (ముదురు రంగులు)
ప్రతి రంగు గ్రే రంగుతో కలిసి దాని Tone ని ఏర్పరుస్తుంది .
ఒక్కో వర్ణం ఇంకో వర్ణం కొంత పాళ్ళలో మిశ్రమం చెంది ఓ కొత్త వర్ణాన్ని ఏర్పరుస్తుంది. మనకి రంగుల గురించిన జ్ఞానం,జ్ఞాపకం తక్కువనే చెప్పాలి. ఉదాహరణకి వాడుకలో మనం ఆకుపచ్చ అని చెప్పినా ఆ పచ్చదనం లో ఎన్ని పచ్చలో..చిలక పచ్చ, ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ , గోధుమ, పసుపు వర్ణాల కలగలిసిన ఆకుపచ్చ.ఆలివ్ ఆకుపచ్చ, పండిన ఆకుపచ్చ. అలాగే ఒక్కో చెట్టు ఆకులు ఒక్కో పచ్చదనం కలిగి ఉంటాయి.ఇలా ఒక్కో రంగు వెనక ఎన్నో రంగులు దాగున్నాయి.అలా మనచుట్టూ వేనవేల రంగులు ఉన్నాయి.
వర్ణ తత్వం: సృష్టిలో ప్రతివర్ణం ఏకైకం. ప్రతి రంగు మనసులో ఒక్కో భావన కలిగిస్తుంది. వర్ణానికి సంబంధించిన శాత్రీయ,మానసిక, కళాత్మక విషయాలని వర్ణతత్వం అనవచ్చు.
Hue/ హ్యు : వర్ణపటం ఏర్పరచిన రంగులు ” నిజ వర్ణం” లేదా హ్యు అని అంటారు. అయితే ” నిజ వర్ణం” అనేది కేవలం ఒక ideal color గా చెప్పుకోవచ్చు. అంటే మనచుట్టూ ఉన్న వస్తువుల్లో, పదార్థాలలోఎక్కడా ఈ ” నిజ వర్ణం” ఉండదు. మిశ్రమ వర్ణాలుగానో , లేదా tint shade , tone గానో ఉంటాయి
color saturation : ఏదేని రంగులో “నిజ వర్ణం“ శాతాన్ని color saturation అనవచ్చు.
color brightness / color reflectance : ప్రతి వర్ణానికి వర్ణ తీవ్రత (intensity) లేదా “ప్రకాశం” ఉంటుది. దీనినే కలర్ brightness అంటారు. ఆరంజ్ , పసుపు, చిలకపచ్చ..ఇవన్నీ ఎక్కువ ప్రకాశవంతంగా కనబడతాయి. రంగులు. గోధుమ, ఆలివ్ గ్రీన్ లాంటి రంగులు తీవ్రత తక్కువ గలిగినవి. ఈ తీవ్రత ఆ వస్తు/వర్ణం యొక్క పరావర్తన ధర్మాన్ని బట్టి ఉంటుంది.
ఒక్కో రంగు, మానసికంగా ఒక్కో భావన కలగజేస్తుంది. దీనినే color psychology అంటారు. ఒక్కో రంగు గురించి ఆలోచిస్తే …రాసుకుంటూ పోతే ఒక్కో వ్యాసమే అవుతుంది. రంగులని అవి కలిగించే భావనని బట్టి రెండు వర్గాలుగా చెప్పుకోవచ్చు.
warm colors : మనసులో ఏదో తీవ్ర భావాన్ని, అలజడిని రేపుతున్నట్టు అనిపించే రంగులని warm colors అనవచ్చు. కళ్ళముందు ఓ నాలుగు రంగులుంటే ఈ రంగులను ముందుగా గుర్తిస్తాం . అంటే కొట్టొచ్చినట్టు కనపడే రంగులన్న మాట. ఎరుపు,పసుపు,మేజెంటా జాతికి చెందినా అన్ని రంగులు warm colors గా చెప్పుకోవచ్చు.
cool colors : మనసుకు ఆహ్లాదాన్ని, ప్రశాంతతని కలిగిస్తూ ఉండే రంగులని కూల్ కలోర్స్ అనవచ్చు. ఇవి బాక్గ్రౌండ్ రంగులుగా బాగా ఉపయోగపడతాయి. నీలం,ఆకుపచ్చ,సయాన్ జాతికి చెందిన అన్నీ cool colors గా చెప్పొచ్చు.
తరచుగా కనపడే కొన్నిరంగులు కలిగించే భావనలు:
ఎరుపు : చూపుని యిట్టె ఆకర్షిస్తుంది. తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉండటం వల్ల దూరం నుంచి కూడ చూడగలం. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ లో, పవర్ ప్లాంట్స్ లో..మిషిన్ లలో ” స్టాప్” కి ఎరుపుని సంకీత రంగు గా ఉపయోగిస్తారు.దృశ్య కళల్లో ఎరుపుని తీవ్రతకు,అక్రోశానికి,హింసకు సంకేతరంగుగా వాడుతారు.
నారింజ: ఎరుపు,పసుపు మిశ్రమంగా కనపడే నారింజరంగుల్లో మళ్ళీ ఎన్నో రకాలుఉన్నాయి. నారింజరంగుకి యిట్టె ఆకర్షించే గుణం ఉంది. ఓ రకమైన నారింజ shadeని warmest color గా చెప్పుకుంటారు. దాన్నే మనం “మంట రంగు” అనవచ్చు.యోగ శాస్త్రంలో నారిజ రంగుకు మంచి ప్రాముఖ్యతే ఉంది.రాజయోగాబ్యాసంలో ఒక్కోదశలో ఒక్కో రంగు గోచరిస్తుందనీ .. చివరి దశలో అబ్యాసకుడి బ్రూ: మధ్య బంగారు వర్ణం కలగలిసిన నారింజ రంగు కనబడుతుంది అని చెప్పబడింది. అందుకేనేమో సాఫ్రన్ కలర్ ని హిందుత్వానికి చిన్హంగా వాడుకుంటాం.
పసుపు : బాగా ఆకర్షణ కలిగిన రంగు. సంతోషానికి చిన్హం
.నీలం రంగుకు పూరక రంగు. కనక ఈ రెండు వ్యతిరేక రంగులు. (contrast colors ). నీలం రంగు మీద పసుపు ఉన్నా.పసుపు మీద నీలం ఉన్నా ఉత్తమ “వ్యతిరేకత” అనవచ్చు.
ఆకుపచ్చ : cool color . ‘ఎదుగుదలకి’ “యవ్వనానికి” సంకేతం. ఆకుపచ్చ. లేత ఆకుపచ్చ కంటిని ఆకర్షిస్తే, ముదురు ఆకు పచ్చ ముడుచుకొని పోతుంది. కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందుకేనేమో అడవులు..పార్కులు…resorts …లాంటి చెట్లు గల ప్రదేశాల్లో చల్లగా ..మనసు హాయిగా ఉంటుంది. ఆకుపచ్చ ఇతరరంగులపై పెద్దగా ప్రభావం చూపదు.అందుకే ఇది కూడా దాదాపు neutral color అని చెప్పవచ్చు
నీలం: cool కలర్. అనంతమైన మైన ఆకాశం నీలం. లోతైన సముద్ర్రం నీలం. ఆకాశంలో, సముద్రంలో ఎన్నో వింతలు దాగుంటాయి .అందుకే నీలం ఒక “నిగూఢత్వం” కి చిన్హం .
వంకాయ రంగు/ purple : ఎరుపు నీలం కలగలిసిన ఈ రంగు విచిత్రమైన ఆకర్షణ కలిగి ఉంటుంది. ముదురు వంకాయ రంగు అధికారానికి, దర్పానికి, లేత వర్ణం కోమలత్వానికి సంకేతం.
బూడిద రంగు : నలుపు, తెలుపుల మిశ్రమం ఈ బూడిద రంగు. ఇది neutral color .అంటే ఇది ఇతర రంగులతో కలిసి వాడినపుడు దాని మీద ఎలాంటి ప్రభావము చూపని రంగు. royal color గా చెప్పబడుతుంది. ఫోటోగ్రఫి లో గ్రే కార్డు అని ఒకటి ఉంటుంది. ఇది తెలుపులో 18 % నలుపు మిళితమైన బూడిద రంగు. ఈ రంగు కలిగిన కార్డు ని exposure సరి చూడటానికి ఉపయోగిస్తారు. ( ఈ విషయం బాగాతెలిసిన వాళ్ళు ఓ వ్యాసం రాస్తే బావుంటుంది.)
నలుపు : అన్నిరంగులని శోషణం చేసుకుంటే నలుపు. చీకటి నల్లగా ఉంటుంది. బ్రతుకు చీకటైపోయింది అంటుంటారు. అంటే అన్ని కోల్పోయామని.అందుకే బాధ, depression , భయం వీటన్నింటికి చిన్హం. నలుపు మీద ఎలాంటి వర్ణం అయినా దాని ప్రభావాన్ని రెట్టింపు చేసుకుంటుంది. నలుపు మీద ఎరుపు వాడితే ఆ ప్రభావం అంతా ఇంతా కాదు.
తెలుపు : అన్ని రంగులని పరావర్తనం చెందిస్తే తెలుపు… నలుపుకు వ్యతిరేకం తెలుపు.శాంతికి చిన్హం తెలుపు. అన్ని రంగులని పరావర్తనం చెందిస్తే తెలుపు రంగుతో వాడిని కొన్నిముదురు రంగులు తమ ప్రభావాని రెట్టింపు చేసుకుంటే..కొన్ని లేత రంగులు తమ ప్రభావాన్ని కోల్పోతాయి.
ఒక్కో రంగు కలిగించే మానసిక భావనని ఆధారంగా దృశ్య కళల్లో వాటిని వాడుకోవటం జరుగుతుంది. వాడుతున్న దుస్తుల్లో కానీ, వస్తువుల్లో కానీ, బ్యాక్ గ్రౌండ్లో కాని సినిమా భావాన్ని ప్రతిఫలించేలా రంగుల ఎంపిక జరుగుతుంది. సినిమా కథని బట్టి, సినిమాకి ఓవరాల్ గా ‘look’ ఉంటుంది.అంటే సినిమా మొత్తం కొన్ని ప్రధాన రంగుల్లో కనబడుతుంది. అలా ఉండేలా చూసుకుంటారు. ఫిలిం ద్వారానో. ఫిల్టర్ల ద్వారానో, lighting ద్వారానో.. ఆ “లుక్” ని సృజించటానికి ప్రయత్నిస్తాడు సినిమాటోగ్రాఫర్. ఉదాహరణకి కౌబోయ్ సినిమాలు వారం కలోర్స్ లో ఎక్కువగా మట్టి రంగుల్లో కనపడుతుంది. అలాగే horror సినిమాల్లో ఎక్కువ నీలం, నలుపు ప్రతిపలిస్తుంది. కాలేజీ కథలు ప్రకాశవంతమైన రంగులు కలుగి ఉంటాయి.
సినిమా కథ వినగానే ప్రధాన రంగులని ఎంపిక చేసుకోవటం అవసరం. దాని ఆధారంగానే, పరిసరాలు, కళాదర్శకుడు, costume designer పనితనం.సినిమాటోగ్రాఫర్ యొక్క సాంకేతిక అవసరాలు ఆధారపడి ఉంటాయి.
కొన్ని సినిమాల్లో ఇంత లోతుగా ఆలోచించక కేవలం “ఆకర్షక ” రంగులని వాడుతుంటారు. అంటే కంటికి టపీ తగిలే రంగులన్న మాట. ముఖ్యంగా మన తెలుగుసినిమా వాళ్ళు. పచ్చని పొలంలో..ఎర్రని / తెల్లని చీరతో slow motion లో పరిగెత్తు తున్న హీరోయిన్ (ఇది కొంచం ఓకే ..కాని) చిలక పచ్చ డ్రెస్సుతో వందమంది గ్రూప్ daancarlu ముందు నారింజో..ఏరుపో వేయించి హీరోని డాన్సుచేయిస్తారు.ఎరుపు,పసుపు,తెలుపు,చిలక పచ్చ,నలుపు ఇలాంటి రంగులు ఎక్కువగా వాడుతుంటారు. హీరో హీరోయిన్ లని హైలైట్ చేయటానికి పరిసరాలకి వ్యతిరేక రంగులని వాడుతుంటారు.
కళాత్మక, అర్థవంత సినిమాల్లోరంగులకి చాలా ప్రాధాన్యత ఉంటుంది.
Assignment : మీ చుట్టూఉన్నరంగులలోకాన్ని గమనించండి.రంగులని ఆస్వాదించి అనుభవించండి. appreciate చేయండి.కెమేరా ఉంటే క్లిక్ మనిపించండి.
అందరికీ “రంగులపండగ” శుభాకాంక్షలు.


శంకర్ says:
18% gray exposure గురించి నాకు తెలిసింది
In any given lighting condition the camera should know what is the neutral exposure, so it will decide the highlights and shadows exposure according to that. 18% gray card supposed to reflect that reference light intensity so camera will adjust according to that. Once camera knows this value the shutter speed and optimum aperture will be decided based on this. Then you can choose desired f stop or T stop based on that calibration.
కొంతమంది gray cardని white balance చెయ్యడానికి కూడా వాడుతారు .colors will be more enhanced or the picture look more saturated, I think this can be self explanatory.
chakradhar says:
@ shanker
thank you
good explanation.
శిద్దారెడ్డి వెంకట్ says:
చక్రి చాలా ఓపిగ్గా వివరిస్తున్నారు. ధన్యవాదాలు.
చాలా విలువైన సమాచారం.
ఇకపోతే మీరు ప్రతి వ్యాసానికి అంతకు ముందు వ్యాసాల లింక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు.మీరు వ్యాసం పోస్ట్ చేస్తున్నప్పుడు క్రింద సినిమాటోగ్రఫీ అనే సీరీస్ కు ఈ వ్యాసాన్ని లింక్ చేయండి చాలు. ఆటోమాటిక్ గా వ్యాసం చివర్లో లింకులు వచ్చేస్తాయి.
త్వరలో ఇంకా ఇలాంటి సీరీస్ మొదలుపెట్టబోతున్నాం కాబట్టి ఇది అందరు రచయితలకూ సౌకర్యంగా ఉంటుంది.
chakradhar says:
ఈ విషయం చెప్పి శ్రమ తగ్గించినందుకు థాంక్యు వెంకట్.
శ్రీకాంత్ says:
చక్రధర్..మీరు ఓ సినిమా కి సినిమాటోగ్రాఫర్ గా చేస్తే చూడాలని వుంది. నవతరంగం లో ని మిగిలిన సభ్యులు సైతం మరీ ముఖ్యం గా స్క్రిప్ట్ కన్సల్ట న్సీ వారు సినిమా తీస్తే చూడాలని వుంది. కథ మొదలుకోని మిగిలిన అన్ని విషయాల పట్ల సరైన నాలెడ్జ్ వున్న మీ లాంటి వారి సినిమాలే ప్రస్థుతం తెలుగు వాళ్ళు కోరుకుంటున్నది. నవతరంగం ఆలోచనల్లో నే కాదు, ఆచరణ లో నూ అని దైర్యం గా మీరు చెప్పగలిగిన రోజు నవతరంగం పై ఏ విమర్సలూ వుండవని నమ్ముతున్నాను. మీరు వీలైనంత త్వరగా ఓ సినిమా తీస్తే చూడాలన్న అభిలాష నాది. ఆల్ ది బెస్ట్.
chakradhar says:
శ్రీకాంత్.. అవకాశం వస్తే ..ఇస్తే ..సినిమాటోగ్రఫీ చేస్తాను. ధన్యవాదములు.
నాకు తెలిసిన..చదివిన.. ఆలోచించిన విషయాలని ఇక్కడ రాస్తున్నాను. ( అదీ నాకోసం. నాలాంటి వాళ్ళకోసం. నాకు తెలుసు ఇది ఎంతవరకు.. ఎందరికి …ఎవరికి use అవుతుందో.)
ఇక్కడి వాళ్ళూ అందరూ అంతే..తెలిసింది పంచుకోవటం.. నచ్చిన సినిమాని appreciate చేయటం..నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పటం.అందుకే ఈ నవతరంగం ఉన్నది .
అలాగే సినిమా లో అవకాశం కోసం ఇక్కడ దాదాపు అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ..చేసిన చేయకపోయినా . తెలుసుకోవటం ముఖ్యం. తెలిసింది పంచుకోవటం ముఖ్యం .
ఏం నవతరంగం వాళ్ళు సినిమా తీయక పోతే మీరు చదవరా ఈ సైట్ ని ?