Menu

నవతరంగం పాఠకులకు ఒక విజ్ఞప్తి

Update:ఇప్పటి వరకూ అందిన విరాళాలు:
1)Purnesh Konathala: INR 10,000
2)Venkat Siddareddy: INR 10,000
3)Ranjani Siddareddy: INR 15,000
4)Hari Krishna Dandamudi: INR 15,000
5)Anonymous: INR:1000
6)Phanindra KSM: INR 5000
7)Krishna Priya: INR 5000
8)Ayodhya Kumar:INR 5000
9)Ravindra Papineni : USD 10
10)Uma Yalamanchili : USD 100
11)Kiran Chakravarthula: USD 11
12)Kiran Enjam: USD 100
13)Vamshi Naarani:USD 15
14)mandava chand : USD 22
15)Ram Teja: USD 11

16) Aruna USD 100

17)Apoorva chitra INR 5,000

18) Sriram Chadalavada INR 5,000

We still need around 18,000 INR  to go ahead. We request you to please help us in raising the remaining money.

నవతరంగం పాఠకులకు నమస్కారం.

గత మూడేళ్ళుగా నవతరంగం నిరంతరంగా కొనసాగించడానికి సహకరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఈ మధ్యనే నవతరంగం ముచ్చటగా మూడవ వార్షికోత్సవం జరుపుకుని నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నవతరంగం ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా సినిమాకి సంబంధించిన పుస్తక ప్రచురణ చేపట్టదలిచాం.

గతంలో, సత్యజిత్ రే వ్యాస సంపుటి “Our Films, Their Films” వ్యాసాలను సౌమ్య గారు తెలుగులోకి అనువదించగా కొన్నింటిని నవతరంగంలో ప్రచురించిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యాస సంపుటి లోని అన్ని వ్యాసాలను సౌమ్య గారు తెలుగులోకి అనువదించారు. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోని వివిధ విషయాలతో పాటు వివిధ దేశాల సినిమాల సంగతులతో కూడిన ఈ వ్యాస సంపుటి, కాబోయే సినిమా దర్శకులకే కాకుండా ప్రేక్షకులకు కూడా ఎన్నో విషయాలు తెలియచేస్తుంది.

ఇటువంటి అమూల్యమైన పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి అందరికీ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో త్వరలో ఈ పుస్తకాన్ని ప్రచురించాలని ఆశిస్తున్నాము. నవతరంగం సభ్యులు ఆనంద్ వారాల గారి సహకారంతో ఈ పుస్తక ముద్రణ జరుగుతుంది. ఇప్పటికే “Orient Longman” వారి నుంచి తెలుగు అనువాదం కొరకు కావలసిన హక్కులు, అనుమతులు తీసుకున్నాము. ఈ పుస్తక ప్రచురణ కోసం దాదాపు 80 నుంచి 90 వేల రూపాయలు దాకా ఖర్చు అవుతుందని అంచనా వేశాము.

ఈ పుస్తక ప్రచురణ కోసం విరాళాల రూపంలో మీ అందరి సహాయం కోరుతున్నాము. మీరు అందజేసే విరాళాలతో ఈ పుస్తకాన్ని ప్రచురించి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆ వచ్చిన ఆదాయంతో మరి కొన్ని పుస్తకాలు ప్రచురించాలని మా సంకల్పం. అంటే మీరు ఇచ్చే ప్రతి ఒక్క విరాళం ఈ ఒక్క పుస్తకానికే కాక మరెన్నో సినిమా పుస్తకాలను ప్రచురించేందుకు సహాయపడుతుంది. ఆ విధంగా తెలుగు భాషలో కరువైన మంచి సినిమా పుస్తకాలను భావితరాలకు అందించడంలో మనమందరం భాగస్వాములమౌతాం.

నవతరంగం పాఠకులు మరియు అభిమానులు ఈ పుస్తక ప్రచురణలో భాగం కావలసిందిగా మనవి చేసుకుంటూ మీ విరాళాలు Paypal ద్వారా అందచేయాలనుకుంటే ఈ కింద ఉన్న Paypal బటన్ నొక్కి మీ విరాళాలు అందచేయండి. లేదా మీరు బ్యాంక్ ద్వారా transfer చెయ్యాలనుకుంటే navatarangam at gmail dot com కి మైల్ చేస్తే బ్యాంక్ వివరాలు తెలియచేయగలము.


11 Comments
  1. dnchari December 11, 2010 /
  2. చక్రధారి December 11, 2010 /
  3. sreenivas December 11, 2010 /
  4. kcube December 11, 2010 /
  5. lakshmi.p December 11, 2010 /
  6. శ్రవణ్ January 6, 2011 /
    • Venkat January 7, 2011 /
  7. రాజశేఖర్ January 7, 2011 /
  8. santosh January 13, 2011 /
  9. Venkat Uppaluri February 7, 2011 /