Menu

Monthly Archive:: February 2011

దీనమ్మ జీవితం: ఏ సాలీ జిందగీ

మనిషి బలహీనతల్లోంచీ బలవత్తరమైన కోరికలు పుడతాయి. ఆ కోరికలు జీవన విధానాన్ని నిర్మిస్తాయి, జీవితాన్ని శాసిస్తాయి, జీవితాన్ని సమూలంగా మార్చేస్తాయి. అలాంటి కోరికల పర్యవసానంగా ఏర్పడే ఘటనలూ, ఆశల్లోంచీ వచ్చిన పరిస్థితులూ ఒక్కోసారి గమనించేవాళ్ళకు/ చూసేవాళ్ళకు హాస్యాస్పదంగా ఉంటాయి. అలాంటి బలహీతల, బలవత్తర కోరికల, తికమక జీవితాల ఘటనల్లోంచీ పుట్టిన హాస్యాన్ని సినిమా భాషలో “బ్లాక్ కామెడీ” అంటారు. అలాంటి బ్లాక్ కామెడీకి దాదాపు పర్ ఫెక్టు ఉదాహరణ “ఏ సాలీ జిందగీ”. ఒక మితృడు ఈ

ప్రేమకథ తో ‘జై బోలో తెలంగాణ’

నిజాముకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణా సాయుధ పోరాటంతో పోల్చినా, 1969లో ఉవ్వెత్తున ఎగిసిన తొలి తెలంగాణ ఉద్యమంతో పోల్చినా ప్రస్తుతం సాగుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ రాష్ట్ర డిమాండుతో పాటు ఇక్కడి సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు, కళలకూ ఈ ఉద్యమ కాలం ఒక పునరుజ్జీవన (Renaissance) దశవంటిది. ఈ కాలంలో తెలంగాణ నేపధ్యంగా కొన్ని వందల పుస్తకాలు వచ్చాయి. అలాగే వందల సంఖ్యలో పాటలూ వచ్చాయి. కానీ ఉద్యమ నేపధ్యంలో సినిమాలు

ఆడుకళమ్ – కోడిపందెం

అబ్బ ఏం సినిమా అండీబాబూ! కోడిపందాల నేపధ్యంలో ఇంత గొప్పగా ఒక సినిమా తియ్యొచ్చని దర్శకుడు వెట్రిమారన్ నిరూపించాడు. కోడిపందాల చిత్రీకరణలో వాడిన గ్రాఫిక్ మహేంద్రజాలం ఎంత సహజంగా ఉందంటే, ఎనిమల్ రైట్స్ యాక్టివిస్టులు కేస్ వేసినా వేసేంత సహజంగా. ధనుష్ పాత్రకు సరిపోతే, తాప్సీ ఆంగ్లోయిండిన్  గా చాలా అందంగా ఉంది. నటనలో హైయ్యెస్ట్ మార్క్స్ మాత్రం ‘పెట్టై కారన్’ గా చేసిన జయబాలన్ కు దక్కుతుంది. ద్వితీయార్థంలో కొంచెం హింసపాళ్ళు ఎక్కువేగానీ…తప్పకుండా చూడాల్సిన చిత్రం.

వందేమాతరం (1939)

బహుశా ఇదేనేమో నేను చూసిన ఓల్డెస్ట్ సినిమా, తెలుగులో! వందేమాతరమ్ లేక మంగళసూత్రమ్ – అని టైటిల్ పడ్డంతో మొదలైంది నాకు కుతూహలం. ఏమిటీ, అప్పట్లో రెండు పేర్లతో సినిమాలు రిలీజ్ చేసేవారా? లేదంటే ఈ సినిమాకి వందేమాతరం అన్న పేరు వివాదాస్పదం కావొచ్చని అలా పెట్టారా? అని. ఇక, టైటిల్స్ మొత్తం ఆంగ్లం లో పడ్డాయి! పేరు బట్టి ఇదేదో దేశభక్తి, స్వాతంత్ర్య సంగ్రామం కథాంశం అనుకున్నాను కానీ, ప్రధానంగా – వరకట్నం, నిరుద్యోగం వీటిపై

Canon 5D Mark II – సినిమాటోగ్రఫీ విప్లవం

Canon 5D Mark II, సినిమా నిర్మాణ పరంగా  .. సినిమాటోగ్రఫీ పరంగా  ఒక పెద్ద సంచలనమే రేపుతోంది. పాతతరం, కొత్తతరం తో నిమిత్తం లేకుండా ..దర్శకులు, సినిమాటోగ్రాఫర్ లు ఈ కెమేరా వైపు మొగ్గు చూపుతున్నారు. మొన్నటికి మొన్న వర్మ గారు తన బ్లాగ్ లో, అతి తక్కువ మంది crew తో Zero budget లో   సినిమా తీసి విడుదల చేస్తాను అని చెప్పుకున్నాడు. ఇలా చెప్పగలిగే  దైర్యం  వొచ్చింది అంటే ఆది కేవలం