గగనం – ఆశాజనకం

Gaganam-Movie-Wallpapers-2

ది నిమిషాలు.

ఐదుగురు టెర్రరిస్టులు  తమ అధీనంలో ఉన్న 100 మంది ప్రయాణీకులను పాడైపోయిన ఒక విమానంలోంచి ఇంకొ విమానంలోకి మార్చబోతున్నారు. ఈ మార్పిడికి పట్టే సమయం పది నిమిషాలు. వాళ్ళు రెండవ విమానంలోకి మారితే ఈ ప్రయాణీకులెవరూ ప్రాణాలతో మిగలరు. వాళ్ళను రెండో విమానం ఎక్కకుండా ఆపితే వారు తమదగ్గర ఉన్న శక్తివంతమైన బాంబును పేల్చే ప్రమాదం ఉంది. అలా ఐనా అందరూ చనిపోతారు.

ప్రయాణీకులెవరూ చనిపోకుండా ఈ టెర్రరిస్టులను అంతమొందించటం కమాండో గ్రూపు నాయకుడి లక్ష్యం. ఆ పని చేయటానికి అతనికి ఉన్న అవకాశం ఈ పది నిమిషాలే. కానీ ఎవరు టెర్రరిస్టులో, ఎవరు నిజమైన ప్రయాణీకులో అతనికి తెలీదు. ఐనా, అతని ప్లాన్లు అతనికి ఉన్నాయి.

పది నిమిషాలు.

విమానం తలుపులు తెరుచుకొని మొదటి మనిషి మెట్లు దిగుతున్నాడు.
తెర మీద డిజిటల్ గడియారం కౌంట్‌డౌన్ మొదలయ్యింది.
అప్పట్నుంచి పది నిమిషాలపాటు ఆ గడియారం మనకు కనిపిస్తూనే ఉంటుంది.

తెలుగు తెర మీద, ఏ మాత్రం వదులుతనం లేకుండా, మంచి ఉత్కంఠతో తీసిన పది నిమిషాలు ఇవి.
గగనం చిత్రం పతాకసన్నివేశం ఇది.

రెండేళ్ళ క్రితం ఆకాశమంతా చిత్రం చూసినప్పుడే దర్శకుడు రాధామోహన్‌మీద చాలా ప్రేమ కలిగింది. తండ్రీ కూతుళ్ళ అనుబంధాన్ని చాలా సున్నితంగా, హాస్యభరితంగా, హృద్యంగా చూపిన చిత్రం అది. ఈ రెండో చిత్రం తీరే వేరు. ఇది పూర్తి నిడివి యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రాన్నీ అంతే మనోరంజకంగా తీశాడు. ఇతనికి సినిమాల మీద ప్రేమ ఉంది. మంచి సినిమాలు ఎలా ఉంటాయోనన్న జ్ఞానం ఉంది. చేసే పని మీద శ్రద్ధ ఉంది. సెన్సూ, సెన్సిబిలిటీ ఉన్నాయి. అన్నిటికీ మించి తన సినిమాలు చూసే ప్రేక్షకుల మీద గౌరవం ఉంది. అందుకే తీసిన రెండు సినిమాలూ ఇంత బాగా తీశాడు.

తెలుగులో యాక్షన్ థ్రిల్లర్‌ను వేరే కలగలుపులేమీ లేకుండా తీయడం ఈ చిత్రం ప్రత్యేకత. కథలో అంతర్భాగంగా మంచి హాస్యం ఉంది. ఈ హాస్యం చిత్రం టెంపోకు ఎలాంటి ఆటంకాలూ కల్పించదు. ఈ చిత్రానికి ఒక హీరో ఉన్నాడు కాని హీరోయిన్లు లేరు. డ్యూయెట్లేకాదు, అసలు పాటలే లేవు.  ఫారిన్ లొకేషన్లూ లేవు. ఈ చిత్రంలో నటించటానికి ముందుకు వచ్చిన నాగార్జునకు, ఇతర నటులకు, ఈ చిత్ర నిర్మాతలకు, సాంకేతిక వర్గానికి నా అభినందనలు.

ఇది ప్రయోగాత్మక చిత్రం అని వాడుకలో ఉన్న మాట. 2011లో, అరవైఐదేళ్ళ చరిత్ర ఉన్న చిత్రరంగంలో, ఇలాంటి చిత్రాలు మనకు ఇంకా ప్రయోగాత్మకమే అవ్వటం మాత్రం నిజంగా మన చిత్రరంగపు దౌర్భాగ్యానికి నిదర్శనం.

ఇంగ్లీషు యాక్షన్ సినిమాలు చూసే అలవాటు ఉన్నవారికి ఈ చిత్రం ప్రత్యేకంగా అనిపించకపోవచ్చు. చాలా లోపాలూ కనిపించవచ్చు. కానీ, ఈ స్థాయి భారతీయ చిత్రాలు చాలా తక్కువగా వచ్చాయి.  తెలుగులో ఐతే లెక్క పెట్టడానికి ఒక్క చేయి వేళ్ళు సరిపోతాయి.  ముప్పై ఏళ్ళ క్రితం రాజ్ సిప్పీ (ఇన్కార్), ఇరవై ఏళ్ళ క్రితం రామగోపాల వర్మ (శివ), మూడేళ్ళ క్రితం నీరజ్ పాండే (A Wednesday) ఆశపెట్టారు.  ఇప్పుడు రాధామోహన్.

ఈ చిత్రాన్ని మన ప్రేక్షకులు (తమిళ ప్రేక్షకులు కూడా – ఇదే చిత్రం పయనం పేరిట తమిళంలో విదుదలయ్యింది) ఆదరిస్తారనీ, ఇలాటి చిత్రాలు మనకు ఎక్కువగానే వస్తాయనీ ఆశిద్దాం.

V. Chowdary Jampala

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

17 Comments to “గగనం – ఆశాజనకం”

  • మంచి చిత్రం ఒక ప్రయోగమైపోయిన తెలుగు చిత్రసీమలో…ఇలాంటి చిత్రాల్ని ఆదరించాల్సిందే. I am ready to buy one ticket this week for GAGANAM.

  • ప్రొమోలు చూసినప్పుడే కొంత ఆశ కల్గింది ఈ సినిమా మీద! అయితే ఇది “డెల్టా ఫోర్స్” అవునా కాదా?

  • I must add one more name; its a low budget original pic made in telugu.. Aithe!!

  • excellent film

  • ద్రోహి(కమల హాస్సన్, అర్జున్) చిత్రం గురించి మర్చిపోయారు :)

    • ద్రోహి చిత్రం గోవింద్ నిహలానీ ద్రోహ్‌కాల్ (నసీరుద్దీన్ షా, ఓం పురి, అశీష్ విద్యార్థి)కు అనుసరణ కదా!

      • @జంపాల: అవును ద్రోహ్ కాల్ కు రీమేక్. పి.సి.శ్రీరామ్ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్ అడాప్షన్ వర్క్ చాలా వరకూ కమల్ హసన్ చేశారు. గగనం దర్శకుడు తమిళ్ వాడు. మొదట ప్రకాశ్ రాజ్ తమిళంలో మాత్రమే నిర్మించాల్సిన చిత్రం ఇది.దిల్ రాజు ముచ్చటపడితే ద్విభాషాచిత్రం అయ్యింది.

        అంటే ద్రోహి తెలుగు భాషలో ఉన్న హిందీ/తమిళ చిత్రమయితే, గగనం తెలుగు భాషలో ఉన్న తమిళ చిత్రం ;) కాబట్టి ఇప్పటికీ “ఐతే” మాత్రమే తెలుగు చిత్రం. ఆ కోవలోకి వచ్చే మరోచిత్రం షో…ఇంకా చెప్పాలంటే గ్రహణం.

  • I am sick and fed up with the stranglehold that a few “film mafia families” have on our Telugu industry. Either a cinema has to be produced by this families or one of their sons, grandsons or nephews have to be heroes even though they cannot act to save their lives.(for some reason they do not have any women folk from their famiies acting in movies. May be it is a blessing in disguise.)
    I have decided not to watch Telugu movies however well made these may be as long as they have this “mafia” connection.

    • I agree with you. Entire తెలుగు సినిమా ను కేవలం మూడు లేక నాలుగు కుటుంబాలు శాసిస్తున్నై.
      నటన వారి నరాల్లో, రక్తం లో వున్నదని యావత్తు తెలుగు ప్రజానీకాన్ని నమ్మించటానికి ప్రయత్నిస్తూ మనల్నిమోసం చేస్తున్నై . ఒక NTR ఒక ANR వలన మూడు తరాల ఈ కుటుంబాలు గుత్తాదిపత్యం చేస్తున్నై.

      తద్వారా మనకు మరో ANR ని మరో NTR ని లేకుండా చేసారు.

      ఈ కుటుంబాలు సినీ వ్యాపారం లో నైపుణ్యం ఉన్నవాళ్ళే సందేహం లేదు. కాని సర్వం మేమే అని జనాన్ని మోసం చేస్తూ వీరు తెలుగు సినిమాకి, తెలుగు ప్రజలకి ద్రోహం చేస్తున్నారు…దోచేస్తునారు.

      సినీ కళ మీద అంత ప్రేమే వుంటే , సినీ కళ వీరి నరాల్లో ప్రాకేస్తుంటే మరి ఈ కొత్త generation దర్సకత్వం ఎందుకు చేయరు?

      K.Raghavendra rao’s son is only one exception.

      • అయన కూడ హీరో గా తన లక్కు …చెక్కు చేసుకున్నాకే దర్శకత్వం లో కి అడుగు పెట్టారు. :) :)

  • సినిమా అదుర్స్ నాకు చాలా బాగా నచింది

  • మొత్తానికి దిల్ రాజు ఓ మంచి డిఫరెంట్ సినిమా తీసి చాలా మందికి ఆనందం కలిగించాడు. తప్పక అభినందించాల్సిన విషయమే.

    రాధామోహన్ ని తప్పక అభినందించాలి.. మూస చిత్రాల ఒరవడిలో కొట్టుకుని పోకుండా.. మనకి ఓ డిఫరెంట్ సినిమా చూపించినందుకు..ఇంటర్వెల్ బాంగ్ కూడా నావెల్ గానే ఉంది. సో యీజ్ ద ఎండ్..

    నాగార్జున ని మెచ్చుకోకతప్పదు. డైలాగులకి మాత్రమే పరిమితమైన రోల్, – ఇద్దరు భామలు, ఓ అరడజను పాటలు, ఓ నాలుగు ఫైట్ లు లేని సినిమా అయినా ఒప్పుకున్నందుకు. కాస్త ఇలానే ఆలోచిస్తే మరిన్ని మంచి సినిమా లు తెలుగులో వస్తాయి.

  • manchi film thappakunda andaroo chooda valiosina film..

  • @Ravi….good comment..

  • గగనం బాగుంది.
    ఈ మధ్య కాలంలో చూసిన తెలుగు సినిమాల్లో గగనంలో టేకింగ్ లో కొత్తదనం కనిపించింది. అయితే బహుషా తమిల్ లో ముందుగా ప్లాన్ చేసిన తరువాత తెలుగులో కూడ ప్లాన్ చేసినట్టున్నారు. ఎక్కువ మంది నటులు తమిల్ వారే కనిపించారు. నాగార్జున లేని సీన్లు అన్ని కూడా తమిల్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ఇంకో విచిత్రమైన విషయం ఒకటి. హైజాకర్లలో ఒకరు అధికారులతో మాట్లాడుతున్నప్పుడు మాస్క్ లో కనిపించడం, ప్యాసింజర్లతో మాట్లాడినప్పుడు మాస్క్ లేకుండా కనిపించడంలో అర్థమేమిటో తెలియలేదు. మొత్తం మీద నాగార్జున సినిమాల్లో రొమాన్స్ లేకుండా, అస్సలు హీరోయినే లేకుండా సినిమా తీయగలిగినందుకు దిల్ రాజు గారికి అభినందనలు.

  • @ ravi

    yes nijamE, raghavendra rao koduku try chesi workout avvadani telisE direction meeda paddadu(ofcourse adi antha veasy kaadu ani arthamayyE untundi already andukE ekkuva movies lEvu).

    naaku telisi renDE rendu teesadu one is raagam(remake of morning raga ikkada peddagaa sontha creativity lO high competencies avasaram lEdu)

    next ee madya vacchina anaganaga O dheerudu kontha ok, but naakaithE personal ga ee so called established families kothaga adugu pettina disney vaadini kooda vaLLa moosa mariyu mediocre ideas thO munchEstaayi emO ani bhayamga undi

    I wish disney should not become a victim of these falsy experts

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories