Menu

లఫంగే పరిందే

కొన్ని కొన్ని సినిమాలు బాగా ఉండి కుడా ఎందుకు ఆడకుండా పోతాయి అనేది ఇప్పటికి అర్థం కాని ప్రశ్న. అలాంటి కోవకే చెందిన సినిమా “లఫంగే పరిందే”.
యష్ రాజ్ ఫిల్మ్స్ బానేర్ లో వచ్చిన ఈ సినిమాకి దర్శకత్వం ప్రదీప్ సర్కార్. పరిణీత మరియు లాగా చునరిమే దాగ్ లాంటి సినిమాలు తీసిన ప్రదీప్ చాలా సింపుల్ సబ్జెక్టు ని ఎన్నుకొన్నా కాని సినిమా ఆద్యంతము ఆసక్తికరంగా మలిచాడు. నీల్ నితిన్ ముకేష్, దీపిక పదుకొనే జంట మొదట్లో అంతగా అక్కట్టుకోలేక పోయిన (అది వాళ్ల పాత సినిమాల ప్రభావం) సినిమా సాగేకొద్దీ ఆకట్టుకున్నారు. ఇది గొప్ప సినిమా అని కాని లేక టేకింగ్ గొప్పగా ఉందనో నేను చెప్పాను కాని, ప్రదీప్ ఎంచుకున్న కథకి మంచి స్క్రీన్ ప్లే అందించాడు. ఒక పాత్ర ని, సందర్భాని ఎంత వరకు వాడుకోవాలో అంతే వాడుకోవడం  నాకు బాగా నచ్చిన అంశం.
తన వల్ల కళ్ళు పోగొట్టుకున్న ఒక యువతికి, ఆమెకు కళ్ళు లేవు అన్న నిస్పృహ నుండి బయటకి తెచ్చి తగిన మానసిక స్థైర్యాన్ని ఇవ్వడమే కాక ఆమె కన్న కలలను సాకారం చెయ్యడానికి తను డాన్సు, స్కేటింగ్ నేర్చుకొని అండగా నిలబడతాడు ఒక బాక్సర్. ఇది స్థులా కథ. ఈ మధ్యలో వాళ్ల మధ్య ఏర్పడే బంధం, ఆమె వల్ల అతని ఈ జీవితం ఈ విధంగా బాగుపడింది అనేది కథనం. “నువ్వు వస్తావని”కి (నాగార్జున, సిమ్రాన్) చాలా దగ్గర పోలికాలు ఉన్న ఈ
సినిమాలో ముందు పెద్ద పెద్ద సెట్టింగ్స్ తో ఒక విల్లన్ గ్యాంగుని, హీరోని పట్టుకోవడాని తీవ్రమైన కృషి చేస్తున్న ఒక పోలిస్ ఆఫీసర్ని చూపించినా వాళ్ళని కథకు ఇంతకు వాడుకోవాలో అంతే వాడుకొని, కథలో చికాకు మలుపులు, పెద్ద హీరోయిజ్జాన్ని potray చెయ్యకపోవడం, కథని సింపుల్ గా డీల్ చెయ్యడం బావుంది.
చివరిగా వచ్చే స్కేట్టింగ్ మీద డాన్సు బాగా ఆకట్టుకున్న తగ్గినా మ్యూజిక్ లేకపోవడం సినిమాకి మైనస్. ఎగరటం కంటే ముందు ఎగిరాక ఎలా దిగాలో తెల్సుకోవాలి, చూడటానికి కళ్ళు కాదు బలమైన కోరిక కావాలి అన్న డైలాగులు ఆకట్టుకుంటాయి. హీరో హీరోయిన్ని నీళ్ళలో ముంచే సన్నివేశం, చివరగా వచ్చే డాన్సు చాలా బావునయ్యి.
వరసబెట్టి సినిమాలు తీసే యష్ రాజ్ ఫిల్మ్స్ కనక కాస్త ఈ సినిమా మ్యూజిక్ మీద, ప్రమోషన్ మీద శ్రద పెట్టుంటే సినిమా ఇంకా బావుండేది. ఈ సినిమా చూడక పొతే గొప్ప సినిమా మిస్ అయ్యారు అని అనను కాను, మంచి సినిమాల్ని ప్రోత్సహిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి అని అభిప్రాయం
–Raj Potluri