Menu

రివ్యుల వల్ల సినిమాలు హిట్టు-ఫట్టు అవుతాయా

నమస్కారం,
మొదటి టపాలోనే ఏంటి సామి ఈ గోల అంటారా, మా “పండు” చెపినట్టు “ఎప్పుడోచ్చం అన్నది కాదు ……..” ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను, నా పేరు రాజశేఖర్, అమెరికా లో ఇooకా స్థిరపడుతున్న ఒక SOFTWARE ENGiNEER ని. అది సంగతి
ఇక టపా విషయానికి వస్తే, నిజంగా రివ్యుల వల్ల సినిమాలు హిట్టు-ఫట్టు అవుతాయా. ఎంతమంది రివ్యూ ప్రభావం లో పడి సినిమాలు చూస్తారు, అసలు ఈ రివ్యూలు ఎంత మంది చదువుతారు. ఇదంతా ఎందుకు మొదలు పెట్టాను అంటే KSD Appalraju వల్ల. నేనింతే లో ఈ అంశాన్ని టచ్ చేసిన KSD కాస్త మోతాదు మించింది అనిపించింది నా వరకు, అసలు ఈ రివ్యూలకు ఇస్తున్న అంత సీన్ లేదు అంటాను. రివ్యూల మీద ఏడిచే వాళ్ళకు నా ప్రశ్నలు సూటి ప్రశ్నలు, వాటి జవాబులు కూడా చెబ్తను.
౧. ఒక చెత్త సినిమా తీసుకొని బాగా ఉంది అని చెబితే ప్రేక్షకులు ఆ సినిమాకి ఎగబడతారా, అలా ఎగబడట్టు ఎమన్నా దాఖలాలు ఉన్నాయ్య?
౨. ఒక మంచి సినిమా తీసుకొని (బొమ్మరిల్లు, మగధీర) బాలేదు అని ఏ ఒక్క పత్రికో, ఛానల్ వారో చెబ్తే ప్రేక్షకులు ఆగిపోతార
౩. అసలు అలా రాసిన దాఖలాలు ఉన్నాయా, మహా ఐతే negative పాయింట్స్ రాస్తారు, లేదా taking బావుంది అనో, ఇంకోటి బావుంది అని రాస్తారు కాని, అబ్బే మగధీర లో హీరో బాలేదు, మీరు చూడకండి, వాళ్ల combination చెత్త మీరు చూడకండి అని రాసిన దాఖలాలు ఉన్నాయా?
౪. ఆనంద్ సినిమాకి ఎంత మంది రివ్యూలు రాసారు. వాళ్ల వల్లే హిట్ అయ్యిందా.
౫. OK , మీరు మంచి సినిమా తీస్తే మేము NEGATIVE గా రాస్తామా, అలా రాసే వాడికి CREDIBILITY ఉంటుందా.
౫. పోనీ, రివ్యుల వల్ల సినిమాలు హిట్టు-ఫట్టు అవుతాయి అనుకుంటే, డబ్బులకి రాసేది చాలా కొద్ది మంది మాత్రమే, ఈ అంతర్జాలం లో కనీసం కొన్ని వందలమంది రివ్యూలు రాస్తునారు, వాళ్ళు మీ మాట ఎందుకు వింటారు. నవతరంగం లోనే కొన్ని పదుల మంది రివ్యూల రూపంలో, కామెంట్ల రూపం లో వాళ్ల వాళ్ల భావాలూ వ్యక్త పరుస్తునారు, వాటిని ఏమి ఇచ్చి మార్చగలరు.
౬.సామాన్య ప్రేక్షకుడు పెద్ద సినిమాలు రివ్యూ బావున్న, రివ్యూ బాలేక పోయిన చూస్తాడు,
౭.చిన్న సినిమాలు పెద్దగా మా వాళ్ల, అనగా రివ్యూలు చదివే సో-కాల్డ్ SOFTWARE ENGiNEER వల్ల హిట్ కావు,
౮. ఈ మధ్య రతింగ్ సరిగ్గా లేకపోతె మేము రివ్యూ వ్రాయము అనే సైట్స్ ఉన్నా మాట వాస్తవమే కాని అంత కంటే రెట్టింపు సైట్స్లో సినిమా మీద అభిప్రాయం తెల్సుతుంది.
౯. శివ, గులాబీ లాంటి సినిమాలకు ఎంత మంది రివ్యూలు రాసారు.
ఇక పొతే నా లాంటి సినిమా పిచి వాళ్ళు, రివ్యూ చూడక ముందే సినిమా చూస్తాడు, పక్కన ఒక్కని వేసుకొని, so, మా వాళ్ల మీకు టికెట్స్ గారంటీ
కాకపోతే ఇక రివ్యూలు రాసే వారి విషయానికి వస్తే, ఎక్కడో ఒక్కల్లిద్దరు కాస్త హద్దులు దాటి రాసినా, చాలా మంది స్వచ్చందంగా వారి సమయము, వ్యయము వెచ్చించి వారి వారి స్పందనలు తెలియజేస్తునారు. అప్పుడప్పుడు వాళ్ల reviews MIS FIRE అయినా కానీ భావ వ్యక్తీకరణ స్వేఛ్చ ఉంది కాబట్టి ఎం చెయ్యలేం 🙂 మా కోసం సినిమాలు తీసుకుంటాం అని DIRECTORS అనట్టు, మా కోసం REVIEWS రాసుకుంటాం అంటే ఎం అనలేం కదా.
కాకపోతే రివ్యూ ని రివ్యూ లా (నా లాగా యుద్ధం లాగా కాక) రాస్తే బావుటుంది, ఈ మార్పు నాతో నే మొదలు అవుతుంది అని హామీ ఇస్తూ
నేను మాట్లాడిన దాని వల్ల ఎవరన్న నొచ్చుకుంటే నేను క్షమార్హుణ్ణి.
మీ
పోట్లురి

2 Comments
  1. kiran February 28, 2011 /