Menu

సంచలనాల సినిమా …హ్యారీ పోట్టర్

JK రోలింగ్ రాసిన  హ్యారీ పోటర్ అనే ఈ 7 శ్రేణి  పుస్తకాలు   ప్రపంచ వ్యాప్తంగా  చాల సంచలనాలు సృష్టించింది. ఎన్నో రికార్డులని తిరగ రాసింది. మొదటి పుస్తకం  4౦౦ మిలియన్ కాపీలు అమ్ముడు  పోయింది . 67 భాషల్లోకి అనువదించబడింది. అక్కడితో  ఆగలేదు.  ఒక్కో పుస్తకం ఆధారంగా  నిర్మించ బడ్డ ఒక్కో సినిమా కూడా అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందాయి.. . మొదటి  ఆరు పుస్తకాలు సినిమాలుగా తీయబడ్డాయి, ఇక 7 పుస్తకం రెండు సినిమాలుగా, మొదటి భాగం  నవంబెర్ 19 న విడుదల అయింది .  పుస్తకం , సినిమా  ఆధారంగా గేమ్స్ కూడా సృస్టించ బడ్డాయి. అవికూడా పెద్ద హిట్టే. ఈ  సినిమా ఆధారంగా ఒక థీమ్ పార్క్ కూడా నిర్మించ బడుతోందంటే ఈ సినిమా ఎంత పెద్ద సంచలనమో అర్థం చేసుకోవొచ్చు.

నవల పరంగా, సినిమాపరంగా  హ్యారీ పోటర్ కి  విమర్శలు కూడా లేకపోలేదు. అయిప్పటికీ  అదిక సంఖ్యలో  పిల్లా, జల్లా, ముసలీ, ముతక, మేధావులు,  క్రిటిక్కులు  అని తేడా లేకుండా  అందరినీ  తెగ ఆకర్షించి  అభిమానులని చేసుకున్నాడు హ్యారీ పోటర్.

కథా వొస్తువు

ప్రస్తుత పరిస్థితికి సమాంతరంగా ఒక కాల్పనిక మాయ జగత్తు ని సృష్టించి  వాస్తవ విషయాలకి  మంత్ర తంత్రాలని అద్దిన కథ.

జీవితం లో ఎదురయ్యే అవాంతరాలకి  ఒక రూపం ఇచ్చి వాటిని తెలివితో   ఎలా ఎదురుకోవాలి అని చెప్పే ఒక వ్యక్తిత్వ వికాస సినిమా  అది,  కాని  కాల్పనిక జగత్తు దాని బ్యాక్ డ్రాప్.

జీవిత తత్వాన్ని, సత్యాలని  అందంగా ఆకర్షనీయంగా animation జోడించి  పిల్లలని  ఆకర్షించే  రీతి లో చెప్పబడిన కథ ఇది .

మంచి చెడు లా మధ్య పోరాటం లో మంచే చివరికి గెలిచేదని చెప్పే కథ ఇది.

“విలన్ తన తలిదండ్రులని చంపితే ..  ఆ విలన్ మీద పగ తీర్చుకోవడం, తద్వారా లోక కల్యాణం.. ” అనే ఒక  ప్రపంచ వ్యాప్తంగా  తిరుగులేని కథా వస్తువు ఇది.

స్నేహం, సాహసం, ప్రేమ .. జీవితం లో కావలసిన అతిముఖ్యమైన విషయాలు. ఒక రకంగా జీవిత పరమార్థాలు. వీటిని హైలైట్ చేసిన  సినిమా ఇది.

హాల్లీ వుడ్ లో అత్యదిక వసూళ్ళు చేసిన సినిమాల లిస్టు లో.. మొదటి పది సినిమాల్లో రెండు హ్యారీ పోటర్ సినిమాలు , తరవాత  పది లో ౩ హ్యారీ పోటర్ సినిమాలు , తరవాత 20 లో మిగతా రెండు  హ్యారీ పోటర్ సినిమాలు  ఉన్నాయి.  మొత్తంగా మొదటి 50 లో అన్నిహ్యారీ పోటర్  సినిమా భాగాలు చోటు చేసుకున్నాయి.

స్థూలంగా కథ

తలిదండ్రులని  కోల్పోయి పసిగుడ్డుగా తన పినతల్లి  ఇంట్లో చేరిన  హ్యారీ పోటర్  తన 11 వ ఏట   తనకి మంత్ర విద్యలో ప్రవేశం ఉందని తెలుసుకొంటాడు. Hogwarts School of Witchcraft and Wizardry.అనే విద్యాలయంనుండి  మంత్రవిధ్యలని నేర్చుకోటానికి  ప్రవేశం కొరకు  లేఖ అందుతుంది. అ విద్యాలయం లో ప్రవేశించిన హ్యారీ పోటర్ కి   ప్రతి సంవతరం అక్కడ  ఎదురయ్యే  వ్యక్తిగత, సామాజిక  విద్యా విషయక సమస్యలు, తను వాటితో  పోరాడి ఎలా అధిగమించాడు అన్నదే   కథ.

హ్యారీ పోటర్ – తాంత్రికుని రాయి

{Harry Potter and the Philosopher’s Stone (2001)}

professor డంబెల్డోర్,పసివాడుగా ఉన్నహ్యారీ పోటర్ ని అతని అంకుల్ ఇంటిముందు వదలటం తో సినిమా  మొదలవుతుంది. అతని పినతల్లి ఇంట్లో అడుగడుగునా అవమానాలకీ, నిరాదరణకి గురిఅవుతూ  అనాధగా పెరుగుతున హర్రి కి  తనకి మంత్ర శక్తులు ఉన్నట్టు తెలిదు. Hogwarts School of Witchcraft and Wizardry  నుండి లేఖ అందుకొని…హగ్రిడ్ అనబడే మహాకాయుడి వెంట స్కూలుకి  బయలుదేరతాడు. తనని అందరూ గుర్తించి పలకరించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలానే..తన తలిదండ్రులని వోల్డేమోర్ట్ అనబడే మాంత్రికుడు చంపేసాడనీ తెలుసుకుంటాడు. అలా స్కూల్ లో చేరిన హారి హీర్మియోన్ గ్రాన్జేర్ అనబడే చలాకి పిల్ల, రాన్ వీస్లె అనబడే బడుద్దాయి లతో స్నేహం కుదురుతుంది.

ఓ పక్క మంత్ర తంత్రాలు నేర్చుకుంటూనే మరోపక్క తాంత్రికుని రాయిని  దుష్టుల చేతుల్లో పడకుండా కాపాడటం తో మొదటి బాగం ముగుస్తుంది.

హ్యారీ పోటర్-  రహస్య స్థావరం

Harry Potter and the Chamber of Secrets (2002) :

హ్యారీ వాళ్ళ అంకుల్ హ్యారీని  మళ్లీ ఆ మంత్రిక స్కూలుకి  కి వెళ్ళకుండా బంధిస్తాడు. రాన్ సహాయంతో బయటపడి స్కూల్ కి చేరుకుంటాడు.   రెండోసంవత్సరంలో అడుగుపెట్టిన హ్యారీ కి వింత శాభాలు వినబడుతుంటాయి.  అవి ఏంటో ఎంతకీ అంటూ బట్టదు. స్కూల్ని స్తాపించిన నలుగురు మహా మాంత్రికులు  విభేదాలొచ్చి విడిపోయారనీ, అందులో స్లిదరిన్ అనే  మాంత్రికుడు ఒక రహస్య స్థావరాన్ని నిర్మించాడనీ, ఆది ఆ మాంత్రికుని తాలూకు వారసుడు వోచ్చినపుడు తెరవబడి  అందులో ఉన్న ఒక తెలియని మాయావి  మాంత్రికుల కుటుంబం కాని విద్యార్ధులని చంపెస్తుందనీ తెలుస్తుంది. ఆ  ప్రకారమే ఒక్కొక్కరు  శిల్పాల్లాగా చచ్చు బదిపోతుంటారు. తనకి సర్పబాష తెలుసనీ, తనకు  వినిపించే శబ్దాలే ఆ సర్పబాష అని తెలుస్తుంది హ్యారీకి . ఆ వారసుడు ఎవరు అనే సందేహం తీరకముందే స్నేహితురాలు హర్మోయిని కూడా చచ్చుబడిపోతుంది. స్నేహితుడు అయిన రాన్ చెల్లిని అ “మాయావి”   రహస్య స్థావరం లోకి ఎత్తుకొని పోతుంది. హ్యారీ  ఆ రహస్య స్థావరం  కనిపెట్టి ఆ మహా మాయావి ని మట్టుబెట్టటం తో రెండో భాగం సమాప్తం.

హారి పోట్టర్ – అస్కబాన్ ఖైదీ

Harry Potter and the Prisoner of Azkaban -2004

ఎప్పటిలాగే ఇంట్లో అవమానం ఎదుర్కొని మూడో సంవత్సరం లో చేరటానికి వస్తూన హ్యారి  ఒక పిశాచి బారినుడి ప్రొఫెసర్ లూపిన్ ద్వారా కాపాడ బడతాడు. సిరస్ బ్లాక్ అనబడే కరుడు గట్టిన  ఖైదీ  అస్కబాన్ జైలు  నుండి తప్పిన్చుకున్నాడనీ అతను ఏ క్షణం లో అయినా హాగ్వార్డ్ స్కూలుకి  రావోచ్చానీ.. అందుకే ఈ పిశాచాలు రక్షణ కోసం స్కూల్ చుట్టూ ఉంటాయని..పొరపాటున కూడా వాటి బారిన పడొద్దు అని   విద్యార్థులందరికీ  హెచ్చరిక చేయబడుతుంది.

పాట్యంశంలో భాగంగా బక్ బీక్ అనే  వింత జంతువైన  ని మచ్చిక చేసుకోటం ఎలాగో చెపుతాడు హాగ్రిడ్. ప్రేమ నిజాయితి కనబరిస్తేనే బక్బీక్  పై స్వారి చేయొచ్చు.హ్యారి అవలీలగా మచ్చిక చేసుకొని దానిపై స్వారి చేస్తే , డ్రేకోని  మాత్రం తంతుంది.  కోపంతో డ్రేకో కంప్లెయిన్ చేస్తాడు. విద్యార్థులకి ప్రాణ హాని కలిగించే జంతువు కనక దాన్నిచంపెయాలి  అని మేజిక్ మినిస్టర్ నుండి ఆదేశాలు  అందుతాయి.ఇది హ్యారి కి, స్నేహితులకీ చాల బాధ కలిగిస్తుంది. కాని ఏమి చేయలేక బక్బీక్ ని చంపటం కళ్ళారా చూస్తారు. ఇదిలా ఉండగా ఆ ఖైదీ(సిరస్)  కూడా తన తల్లిదండ్రుల చావుకి కారకుల్లో ఒకడని భావిస్తున్న  హారి అతని పై కక్ష పెంచుకుంటాడు.

హగ్వార్డ్ కి వొచ్చిన ఆ ఖైదీని చంపాలని హ్యారి అనుకుంటుండగా ప్రోఫెసేర్ లూపిన్ ద్వార అతను హారి కి మిగిలిన ఒకే ఒక్క రక్త సంబందీకుడని   తెలుస్తుంది. తనిదండ్రులని చంపే కుట్రలో peter petigerw కి సంభంధం ఉన్నదనీ.. అతన్ని చంపాలనే సిరస్ వోచ్చాడనే ఆ పీటర్ ఎలక రూపం లో ఉన్నదనీ తెలుస్తుంది. ఈ గలాటలో.. సిరుస్ హారిలు  పిశాచాల బారిన పడతారు.

కాని హరిమోయినీ వెంటరాగా, ప్రధానోపాధ్యాయుడు  అల్బాస్ డంబుల్డోర్  సహాయంతో కాలంలోకి వెనక్కి వెళ్లి అన్నింటిని సరిదిద్ది తన తాత అయినా సిరస్ నీ బక్బీక్ నీ  కాపాడటం తో మూడవ భాగం ముగింపు.

హారి పోట్టర్ – అగ్ని పాత్ర

Harry Potter and the Goblet of Fire

హ్యారీ పోటర్ ని ఓ  పీడకల వెంటాడటం  – Quidditch వరల్డ్ కప్ ..అక్కడ death eater అనే vondle mart అనుచరులు సృష్టించే  కలకలంతో మొదలవుతుంది. ఆతర్వాత మంత్ర తంత్రాల విద్యాలయాల నుండి వొచ్చిన విద్యార్థుల మధ త్రికోణ పోటి మొదలవుతుంది. కాని పోటిలో ప్రాణాపాయం ఉండొచ్చు కనక ౧౭ సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నావాళ్ళకి ప్రవేశార్హత ఉండదు. చేతిమెడ పేరు రాసి అగ్నిపాత్రలో వేయాలి. అదే పోటికి అర్హమైన ముగ్గురిని ఎంపిక చేస్తుంది. కాని వయస్సు తక్కువున్నా హారిని కూడా ఎంపిక చేస్తుంది. దానిక్కారణం ఎవ్వరికి అంతుబట్టదు. పోతినుంది న్శామించటానికి వీలులేదు కనక.. హారి కూడా పాలుగొంటాడు. ఉత్కంత తో కూడిన పోటితో పాటు …స్నేహితుల మధ్య ఉండే అభిమానం, అపార్థం, అసూయా లని కూడా బాగా మిళితం చేసారు. చివరి అంకం మొదలవుతుంది. ఉత్ఖంట తో కూడిన పోటి ముగిసి గెలుపుని పంచుకుందాం అనుకొన్న హారి, సిడ్రిక్ లు  ..హారి పీడకలలో కనిపించే స్మశాన వాటికకొచ్చి పడతారు. పేరు చెప్పటానికి , వినటానికి భయపడే  లార్డ్  వోల్డేమోర్ట్కి  శరీరం లభించేది హరీ పోట్టర్ , వందలే మార్ట్ ముఖా ముఖి తల పడేది  ఈ భాగం లోనే.

హారి పాటర్ని పోటిలోకి నెట్టింది ఎవరో ఎందుకు అలా జరిగిందో దానికి కారణం ఎవరో కూడా తెలుస్తుంది  ఈ భాగం లో.

మిగతా సినిమా భాగాలు, మరిన్ని ఇతర విశేషాలు  ఇంకో టపా లో..

Chakradhar Rao

2 Comments
  1. Madhu January 10, 2011 /