పరమ వీర చెత్త

Parama-Veera-Chakra

“యంగ్ ఇండియా” వంటి డిజాస్టర్ సినిమా తీసి ఈ మధ్య కాలంలో తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిపిన దాసరి తన తదుపరి చిత్రానికి బాలకృష్ణను హీరోగా ఎంపికచేసుకున్నాడనగానే అంతటా అంచనాలు కన్నా అనుమాలు ఎక్కువ మొదలయ్యాయి. అయితే సింహా ఇచ్చిన కిక్ తో బాలయ్య చాలా జాగ్రత్తగా ఉంటాడని, దాసరి కూడా తన 150 చిత్రం కదా అని చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని ఎవరకి వారే సర్దిచెప్పుకుని రిలీజ్ కోసం ఎదురుచూసారు. అయితే వారి ఆశలు నిరాశలే అయ్యాయి. అభిమానులు సైతం ఫరవాలేదు అనలేని స్ధితిలో చిత్రం తెరకెక్కింది. సైనికాధికారిగా, సినీ హీరోగా, రావణాబ్రహ్మగా, కొమురం భీమ్ గా రకరకాల గెటప్స్ లో బాలకృష్ణ కనపించి అలరించినా, అదంతా బాలకృష్ణ ఇన్నిగెటప్స్ వేసి ఒప్పించగలడు, ఇంత బాగా చేయగలడు అని చెప్పటానకి ప్రత్యేకంగా పనిగట్టుకుని తయారు చేసిన ప్రచార చిత్రంలా తయారైంది. కథా లోపమే కాక దశ, దిశ లేని దర్శకత్వం పాపం కూడా సినిమాను, బాలకృష్ణ క(ఇ)ష్టపడి చేసిన నటనాకౌశలాన్ని దారుణంగా దెబ్బతీసింది.

ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే స్టార్ హీరో చక్రధర్(బాలకృష్ణ). అతన్ని అభిమానిస్తూ వెంటబడే (షీలా) అతనికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూంటుంది. అయితే అతని తల్లి( జయసుధ  )కి అలాంటివి గిట్టవు. ఆవిడకి తన కొడుకు పెద్ద మిలిట్రీ మేజర్ అయ్యి, దేశానికి సేవ చేయాలనే జీవితాశయం. ఈ స్ధితిలో చక్రధర్ కు కొందరు ఆర్మీ ఆఫీసర్స్ పరిచయమై తమ దగ్గరో అధ్బుతమైన కథ ఉందని చెప్తారు. కథ నచ్చితే ప్రీగా చేస్తానని మాట ఇచ్చిన చక్రధర్ కి ఆ కథని జితేంద్ర(మురళి మోహన్)అనే మిలిట్రీ ఆఫీసర్ నోటిగుండా వినటానకి రెడీ అవుతాడు. ఆ కథ ఆర్మీలో సిన్సియర్ ఆఫీసర్ మేజర్ జయసింహ(బాలకృష్ణ)కి చెందింది. కథ వింటున్న చక్రధర్ అందులో లీనమై తనను తాను జయసింహాగా ఊహించుకుంటాడు. ఆ తర్వాత నిజంగానే ఆ కథ జరిగిందని తెలుసుకుంటాడు. విన్న ఆ కథ ప్రకారం కొందరు కుట్రదారులు (సినిమా ఈ రేంజి పాత వాసనలుతో ఉంటుంది) వల్ల నష్టపోయి, దేశద్రోహిగా మిగిలిన జయసింహకు న్యాయం చేయాలనుకుంటాడు. అందుకోసం సినిమా నటుడు, జయసింహ పోలికలతో ఉన్న చక్రధర్ ఏం చేసాడు. ఈ కథకీ పరమవీరచక్ర బిరుదుకీ సంభందం ఏమిటీ అన్నది మిగతా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

బాలకృష్ణ చేత ఈ చిత్రం బొబ్బిలిపులికి సీక్వెల్ కాదు…రీమేక్ అంతకన్నా కాదు అని ప్రత్యేకంగా ఇంటర్వూల్లో చెప్పించిన దాసరి ఈ చిత్రాన్ని బొబ్బిలిపులి సీన్ తోనే మొదలెడతారు. అలాగే మేజర్ జయసింహ కథంతా విన్న హీరో చక్రధర్ కి ఊహించని విధంగా ఏదో ట్విస్ట్ వస్తుందని ఎన్నో సినిమాలు చూసిన సగటు ప్రేక్షకుడు ఎదురుస్తాడు. అయితే వారి ఊహకు అందనిరీతిలో అంతసీనెందుకు అన్నట్లుగా రొటీన్ గానే కథనం సా…గు..తూంటుంది. కొన్ని సార్లు చాలా మందికి విజయేంద్రవర్మ చిత్రం కూడా గుర్తుకు వచ్చి ఆ ప్లాపుకి కనెక్టు అయిపోయారు.

సినిమా ప్రారంభమైన చాలా సేపటికిగాని కథలోని సమస్యలోకి వెళ్ళకపోవటమే ఈ సినిమా కథకున్నప్రధాన సమస్య.ఎప్పటికో మురళిమోహన్ చెప్పే ప్లాష్ బ్యాక్ పూర్తి కావాలి, అప్పుడు గానీ మన హీరో చక్రధర్ చలనంలోకి వచ్చి విలన్స్ పనిపట్టడు. అప్పటివరకూ మనకెంత ఓపికకావాలి. అప్పటివరకూ ప్లాష్ బ్యాక్ లో కనపించే జయసింహకు సమస్యలు రావా అంటే కథ ప్రకారం చక్రధర్ కి సమస్య వచ్చి వాటిని ఫేస్ చేస్తేనే కదా కథనం రక్తి కట్టేది. ఇంతకు మించి రొటీన్ గా సాగే ఈ కథ, కథనాలను విశ్లేషించటానికి కూడాఏమీ లేదు.

అలాగే మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు కనపడి షాక్ ఇస్తాడు. మరో ప్రక్క కోడి రామకృష్ణ, బోయపాటి శ్రీను, జొన్నవిత్తుల, సింగీతం శ్రీనివాసరావు వంటి సినీ ప్రముఖులను చూపి ఆకట్టుకోవాలని చూడటం దాసరి వంటి మెగా(అప్పట్లో) దర్శకుడు ప్రయత్నించటం కూడా ఆశ్చర్యమనిపిస్తుంది. బాలకృష్ణతో కథకు సంభందం లేని వివిధ గెటప్స్, డైలాగులు, సెలబ్రేటీలను చూపటం ఇదంతా చూస్తుంటేనే ఏదో రకంగా ఒడ్డున పడాలని ప్రయత్నిచినట్లు స్పష్టంగా తెలిసిపోతూంటుంది. వీటిన్నట్టికీ తోడు హీరోయిన్స్ అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా…వీళ్ళలో ఒక్కరికీ సరైన పాత్ర, డైలాగులు, జస్టిఫికేషన్ ఉండదు. కేవలం బాలకృష్ణను ఎలా చూపాలా అని ఆలోచించి డిజైనా చేసినట్లుగా సినిమా అంతా జరుగుతూంటుంది.

ఇక సినిమాలో ప్లస్సులు లేవా అంటే…అది బాలకృష్ణే. ఆయన నటన, డైలాగులు చెప్పే తీరు సినిమా సినిమాకూ పదునెక్కుతోందని స్పష్టం చేస్తుందీ చిత్రం. అలాగే క్లైమాక్స్ లో కోర్టులో చెప్పే డైలాగ్స్ కూడా బావున్నాయి. అలీ, బ్రహ్మానందం చేసిన రోబో పేరడీ కామెడీ ఏ సి సెంటర్ల వారకన్నా ఎక్కాలేమో కానీ మిగతావారికి కష్టం. అదే దాసరి టార్గెట్ అయితే అంతవరకూ విజయం సాధించినట్లే. సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు, మురళి మోహన్, జయసుధ, రఘుబాబు వంటివారుకి పెద్ద పాత్రలు లేకపోయినా ఉన్నంతలో బాగా చేసారు. చాంతాడంత డైలాగులకు దాసరి నారాయణ రావు పెట్టింది పేరనే విషయం మరో మారు గుర్తుకు వస్తుంది. అయితే డైలాగులు కొన్ని చోట్ల బాగానే పేలాయి. అయితే ధియోటర్ నుంచి బయిటకు వచ్చాక ఏదీ గుర్తుండే అవకాశమేలేదు. ఇక పాటల విషయానికి వస్తే మణిశర్మ అప్పుడప్పుడూ ఎవియస్ చిత్రాలకు ఇచ్చిన సంగీతంలా నీరసంగా ఉంటుంది. నేపధ్య సంగీతమూ అదే రేంజిలో ఏడ్పిస్తుంది. కెమెరా, మేకప్, ఎడిటింగ్, ఆర్ట్ దాదాపు అన్ని విభాగాలు దాసరి గారి పురాతన దర్శకత్వానికి పోటీ పడి పనిచేసాయి.

పైనల్ గా ఈ చిత్రం బాలకృష్ణకు ఎలాంటి దర్శకులను, కథలను ఎంచుకోవాలి అన్న విషయంలో స్ఫష్టమైన ఆలోచనలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సింహాతో పోల్చుకుంటే ఈ చిత్రం ఎక్కడ దెబ్బతిందో ఇట్టే కనిపెట్టేయచ్చు. అలాగే అదే సమయంలో దాసరిగారు ఇంత దారుణమైన ప్లాపులు ఇవ్వకుండా ఉండటానికి ఏకైక మార్గం కొంతకాలం పాటు దర్శకత్వానికి దూరంగా ఉండటమే బెస్ట్ అని ఈ చిత్రం చెప్తుంది. ఇక మనలాంటివారికి సింహా లాంటి హిట్ తర్వాత వచ్చే ప్రతీ చిత్రం సింహా కానక్కర్లేదని, ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని నిరూపిస్తుంది.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

32 Comments to “పరమ వీర చెత్త”

  • :D

    Everything is fair in this review, except for the comment on Balayya. He acted well? Yes. From a well. Hmm

  • ఈ బాధితుల కోసం ఓదార్పు యాత్ర మొదలెడతా!

    • bayaludere mundhu cheppu brother nee kutumbanni nenu oodhrchaligaaa…..

  • aite “dasari” expectations ni reach ayyarannamata

    • lol …. expect cheyyaledu. expectation reach ante ila kuda annamata

  • ప్రతుత సినిమా వేరు, గత పది, పదిహేనేళ్ళ కిందటి సినిమా వేరు.
    అప్పటి ప్రేక్షకులు వేరు. ఇప్పటి ప్రేక్షకులు వేరు. కంప్యూటర్, ఇంటర్నెట్ అందుబాటులోకి వొచ్చాక సినిమా విషయం లో ఒక పెను మార్పు వొచ్చింది.కంప్యూటర్ ఒక్కటే కాదు.. మొత్తానికి మొత్తంగా మీడియా & communication లో ఎంతో మార్పు వొచ్చేసింది. దాంతో మొత్తం మీద ప్రేకకుడి దృక్పథం లో కొంత మార్పు వొచ్చింది.
    మనిషికి బావోద్వేగాలు ఎప్పుడూ ఒకటే అయినప్పటికీ , సన్నివేశాల ప్రకారం, అవి చూపించే విధానం,పాత్రలు వాటిని వ్యక్తం చేసే విధానం, ప్రేక్షకులు వాటిని స్వీకరించే విధానం లో చాల మార్పు వొచింది. ప్రపంచ సినిమా మొత్తం ప్రేక్షకుడికి అందుబాటులో ఉంది. కథా కథనాల విషయం లో పాత పోకడలు సహించే స్థితిలో లేరు.80వ దశకం లో ప్రతీకారం ఇతివృత్తంగా దాదాపు వందల సినిమాలు వొచ్చినా ప్రేక్షకులు చూసారు. ఎందుకంటే అప్పటి పరిస్తితి వేరు. అప్పట్లో వారానికి ఓ సినిమా వేసేవాళ్ళు టీవీ లో. కనక సినిమా అనగానే అదో పెద్ద విశేషంగా.. ఏ కథ చూపించినా ఫరవేలేదు అన్న ధోరణి లో ఉండేవాళ్ళు . ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక ప్రేక్షకుడికి కి ఎన్ని రకాల,ఎన్ని బాషల,ఎన్ని దేశాల సినిమాలు అందుబాటులో ఉన్నాయో ఒక్కసారి గమనించి,ఈ పరిస్త్తితుల్లో తెలుగు సినిమా నుండి ఏం ఆశిస్తున్నాడో కొంచం research చెసి.. సినిమా కథా, కథనాలను తయారు చేస్తే బావుంటుంది. సీనియర్ దర్శకులు ఈ పోకడ ని బహు జాగ్రత్త గా గమనించాలి. ఎందుకంటే వయసు తో పాటే కొన్ని అలవాట్లకి, కొన్ని ఆలోచనలకి.. అభిరుచులకి, నియమాలకి అలవాటు పడిపోయుంటాం. వాటిని మార్చుకోవాలంటే కొంచం కష్టమే అయినా మార్చక తప్పదు. అప్పుడు మాత్రమే ఈ తరం ప్రేక్షకులని కూడా రంజింప చేయగలం. కొంతమంది హూలీవుడ్ దర్శకులని గమనిస్తే వాళ్ళు ప్రపంచం,దాని పోకడతో పాటు తామూ ఎలా ప్రయాణించారు? ఎలా నూతన ఒరవడిని అలవారచుకున్తున్నారో తెలుస్తుంది. ఇది హీరోలకీ వర్తిస్తుంది. మునుపటిలా కాకుండా “వ్యక్తి”ని అతని ప్రతిభని మాత్రమే గుర్తిస్తున్న రోజులివి. ఎప్పుడో తాతల కాలం నాటి విషయాలు, నేటి, రాబోయే తరానికి తెలియదు.. తెలుసుకోవలసిన అవసరం లేదు. వాళ్ళ సంఖ్య రాను రాను పెరుగుతూ ఉంటుంది. కనక ఆ ” నవీన ప్రేక్షకుడిని ” దృషిలో పెట్టుకొని సినిమా తయారు చేయాల్సిన అవసరం ఉంది.

  • Fans were expecting this right from day one this project was announced.Infact they were mentally prepared for worst.They are satisfied now for one reason that there are no stupid graphics in this movie.

    Balakrishna should atleast realize now and avoid outdated directors like Dasari.Heard that he rejected two storied prepared by Puri Jagannath.Though Puri is going through rough patch I bet he would have delivered a better product than Parama veera chakra.

  • Balakrishna ki maro sari burra ledhu ani ee cinema chesi niroopinchukunnadanna mata. Review antha bagane undhi except ‘Balakrishna acting improving from 1 cinema to another’, i think this is the time for balakrishna retirement…so in the retirement stage he is improving his acting…what a pity .

  • Ram annai..

    Nuvvu school museyyi.Nobody is forcing u to watch his movies.

  • మొత్తానికి బాలక్రిష్ణ మెరుగయ్యాడన్నమాట….ఏంత కాలానికి అతని నటన మెరుగయ్యింది…ఇక మణిరత్నంతొ సినిమా ఒకటె మిగిలింది..

    • Aaa nee certificate kosam chustunnadu veelu brother….

      • అది నేను ఇచ్చిన సర్టిఫికెట్ కాదు…సమీక్శకుడు ఇచ్చిందె…

  • యంగ్ ఇండియా రిలీజైందా? :-) )

    పండగ ముందు ఇంత ఘోర చేదు అనుభవం మూటగట్టుకోడానికి మీకు మనసెలా ఒప్పిందసలు?

  • నవతరంగ్ వారికి ప్రేమతో విన్నపములు. ఇందువెంట చెప్పేదేమిటంటే… ‘పరమవీరచక్ర’అనేది సైనికులకు ఇచ్చే గొప్ప అవార్డు. అలాంటి అవార్డును ఇలా ‘చెత్త’ చేర్చి రాయడం తప్పు. ఎందుకంటే ఇది సైనికుల త్యాగలకు సంబంధించిన విషయం. కనుక గమనించగలరు.

  • @adinarayana: ఒక చెత్త సినిమాకు పరమవీర చక్ర అనే శీర్షిక పెట్టడమే పెద్ద తప్పు, ఇప్పుడు ఆ సినిమాను చెత్త అనక ఏంచేయ్యమంటారు చెప్పండి? అయినా ఇక్కడ అంటున్నది ఆ శీర్షిక ఉన్న సినిమాను అవార్డును కాదు.

    • @కత్తి మహేష్ కుమార్ గారు,
      పరమ వీర చెత్త అన్న శీర్షికే సరైనది.బాలకృష్ణ,దాసరి కాంబినేషన్ లో పరమ వీర చక్ర అనగానే
      రిలీజ్ అయ్యాకా పరమ వీర చెత్త అనొచ్చు అని ఫిక్స్ అయ్యాను
      అంత యాప్ట్ అది

  • దాసరి కి కొన్ని ప్రష్నలు:

    1. అయా, మీరు స్టేజ్ ఎక్కితే చాలు..తెలుగు నిర్మాతలు, దర్శకులు పరాయి భాషల వారికి అవకాశాలు ఇచ్చి తెలుగు వారిని థొక్కేస్తున్నారని ఉపన్యాసాలు దంచుతారు..మొసలి కన్నీరు కారుస్తారు..మరి నేహా ధూపియా, అమీషాపటేల్, షీలా ల ని తీసుకునేటప్పుడు మీ మనస్సాక్షి మిమ్ముల్ని “నీకు సిగ్గూ షరం ఉందా” అని ప్రశ్నించలేదా?

    2. పరమవీరచక్ర అన్న టైటిల్ పెట్టినపుడు సైనికులు అభ్యంతరపెడితే సైనికులు గర్వించేలా, పరమవీరచక్ర అన్న బిరుదు ప్రతిష్ఠ ఇనుమడించేలా సినిమా తీస్తాను అన్నారు..హిట్టు ఫట్టు ప్రక్కన పెడితే ఒకసారి నేహధూపియా సాంగ్ చూసి మీ గుండె మీద చేయి వేసుకుని “పరమవీరచక్ర” బిరుదు ప్రతిష్ట ని ఈ సినిమా ఇనుమడింపజేయడం ప్రక్కనపెట్టి దాన్ని అవహేళన చేయలేదని చెప్పండి చూద్దాం..

    3. భాను లాంటి ఫ్యాక్షనిస్టుల బినామీ పెట్టుబడుల తో ఈ సినిమా తీసారని ఆరోపణలు వస్తున్నాయి..అదే గనక నిజమైథే కేంద్రమంత్రిగా పనిచేసిన మీరు “పరమవీరచక్ర” పదాన్ని తుంగలో తొక్కినట్టే..
    ఆ ఆరోపణలని ఖండించగలిగే దమ్ము మీకుందా దాసరి గారూ..

    4. నా బెబ్బులిపులి ని కాపీ కొట్టి శంకర్ సినిమాలు తీసాడు..నా శివరంజని కాపీ కొట్టి వర్మ రంగీలా తీసాడు అని పొద్దస్తమానం ఏడ్చే మీరు, కనీసం వాళ్ళ సినిమాల స్థాయి లో పదోవంతు లేనివిధంగా పరమవీరచక్ర తీసారు..ఇక మీదయినా అలాంటి మూర్ఖపు కామెంట్లకి స్వస్తి పలకగలరా..

    5. ఈ సినిమా ని తొక్కేయడానికి ఎవరో కుట్ర చేస్తున్నారు అని మీరన్నారు..కేంద్రమంత్రిగా పనిచేసిన, తెలుగు పరిశ్రమకి పెద్దన్న అయిన మీ సినిమాని ఎవరు తొక్కగలరు..అయినా ఇంథ చెత్త సినిమాని ఎవర్యినా తొక్కాల్సిన అవసరముందా??

    • chaala baaga adi(kadi)garu Mr. Raj…

    • చాలా సూటిగా అడిగారు

    • అసెంబ్లీ అదిరేలా అడిగారు.
      ప్రతిపక్ష నాయకుడి లెవెల్లో.
      దాసరి గారు వాకౌట్ చెయ్యడం తప్ప దారి లేదు

      • YES……………..

    • బాగా అడిగారు..

  • బాగ కడిగారు సారీ అడిగారు.

  • yes, movie narration chettagaa undi. The one and only thing that can keep u in your seat is balayya’s action. I wonder why his potential was less explored earlier? hmm..may b we can expect few good movies from him in future. His action in this disastrous movie is the only consolation for fans.

  • ఒక విషయం ….బాలకృష్ణ …రామారావు కొడుకు కాకపోతే అసలు తెలుగు సినిమాలోకి ఎంట్రీనే దొరికేది కాదు
    వాడి వాచకం ఒక హీరో కి తగినది కాదు. తినగా తినగా వేప తియ్యన అన్నట్లు తెలుగు ప్రజానీకం అడ్జస్ట్ అయి పోయారు అంతే

    వీడి కన్నా జూనియర్ NTR వెయ్యి రెట్లు మెరుగు.

    కొడుకుల్ని ప్రేక్షకుల మీద రుద్దటం ఎపుడు ఆగుతుందో అపుడే తెలుగు సినిమా మరో NTR ని, మరో చిరంజీవి ని పొందగలదు.

    • ORANGE chusake nenu ade anukunnaa….

      • 100% agree

  • ఈ సినిమా కథ చదివితేనే, నేను సింహ సినిమాలో అనుభవించిన క్షోభ గుర్తుకువచ్చి, చాలా భయంవేసింది. పొరపాటును కూడా ఇంకో ఏఁడాది వరకూ తెలుగు సినిమా చూడకూడదని సింహా గుర్చుచేస్తే, ఈ సినిమా దాన్ని పదేళ్ళకు తోసింది.

    • telugu cinema ke padelu nee Daridram vedilindhu annamata…………..Aadrustam….

      • eraa nuvvemannaa pedda puskii gaadivaa?
        andari comments venaka nee yedava gola enti?
        mundu cinema flop ani telusu kaabatti mooskuni kurcho.
        ee despo gaallani tattukolekapotunnam.
        mee balayya torture ni bharinchaleka ikkadikocchi ediste em upayogam??

  • పరమ బోరు చక్ర

  • watch ” bendu apparao RMP” .. its more sensible than recent movies of so called STARS

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories