Menu

ఒక సినిమా కోసం

సినిమా అనగానే అందరికి ఫిల్మ్‌నగర్ గుర్తుకువస్తుంది.కానీ సినిమా జీవితాలు మొదలయ్యేది మాత్రం కృష్ణనగర్‌లో,అది చాలమందికి తెలియదు. ఇక్కడికి వచ్చాకే తెలుస్తుంది కృష్ణనగర్ అంటే ఏమిటో…

కృష్ణనగర్‌లో జీవితాలు చాలా చిత్రంగావుంటాయి.నెలలో పది,పదిహేనురోజులు పనిచేసే సినిమావాళ్లను చూస్తే బయటప్రపంచం వారికి కాస్త వింతగా తోస్తుంది.ఏళ్ల తరబడి నిరీక్షణ బ్రేక్‌త్రూ కోసం పడిగాపు ఇక్కడ షరామాములే,కృష్ణనగర్‌కు వచ్చే వాళ్లలో ఎక్కువమంది ముఖ్యంగా డైరెక్టర్లు అవుదామనే వస్తారు.అలాంటివాళ్ల విషయానికి వస్తే మొదట అప్రంటీస్‌గా స్టార్ట్ అవుతుంది వీళ్ల ప్రస్థానం.కో-డైరెక్టర్ అనే మహాప్రస్థానికి చేరుకొనే సరికి,పదవితో పాటే ఏజ్ వచ్చేస్తుంది.వయసు 40 నుండి 60 వచ్చిన సినిమాపైన దాహం తీరదు ఇది కృష్ణనగర్ మహత్యం.

ఐదుపదేళ్లు పనిచేస్తేగాని డైరెక్షన్‌కి మోక్షంరాదిక్కడ,అదీ చిన్నచితక డైరెక్టర్ దగ్గర కాకుండా,పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేస్తే వచ్చే అవకాశం ఉంటుంది.ఇదీ దర్శకుల పరిస్థితి ఐతే కథానాయకులుగా వెలిగిపోదామని వచ్చేవారి పరిస్థితి మరోరకంగా వుంటుంది.హీరోలుగా ఎంట్రీ అవ్వలనుకునే కుర్రకారుకి ఛాన్సులు రావటం మరీ కష్టం ఎందుకంటే అల్‌రెడీ సెటిలయిన హీరోల శిబిరంలోంచి వాళ్ల వారసుల పరంపర వెల్లువెత్తుతూనే వుంటుంది.వీళ్లని ఎదుర్కోవటం చేతగాక హీరోల ఫ్రెండ్స్‌గానో,సీరియల్స్‌లో సెకండ్ హీరోలగానూ లేక NRI పెళ్ళికొడుకులగానో సరి పెట్టుకోవల్సిందే..

వారసులుగా ఆరంగేట్రం చేసే కుర్రహీరోలకి పై కష్టాలతో సంబంధంలేదు.అలాంటి హీరోలకి మొదటి సక్సెస్ రాగానే ఐదుగురు అసిస్టెంట్స్,పైన రెండు గొడుగులు,సెక్యూరిటీ,కారావాన్(అన్ని సౌకర్యాలతో కూడిన బస్సు) చుట్టూ ప్రత్యక్షమవుతాయి.ఈ సక్సెస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో బడా హీరోల నుంచి చోటా హీరోల వరకూ ఎక్కువగా చిత్రాలు ఫ్లాపుల బాట పట్టడానికి ఇదే కారణం.

ఇక సినిమా అనే మాధ్యమానికి మూలమైన వ్యక్తే ప్రొడ్యూసర్..ఇతను లేకపోతే సినిమా లేదు.అసలు ఇండస్ట్రీయే లేదు.మిగతా అందరిలా కాదు ఇతని పరిస్థితి ఒక సినిమా ఫ్లాపయితే మిగతావారికి(హీరోలు,డైరెక్టర్లు,టెక్నీషియన్స్)వాళ్ల దగ్గరుంది పోయేది ఏముండదు.వాళ్ల మార్కెట్ తగ్గుతుంది అంతే,కానీ ప్రొడ్యూసర్ మాత్రం అప్పులో పడతాడు.ఇంకా చెప్పలంటే రోడ్డున పడిపోతాడు.ఈయనగారి విషయానికి వస్తే కథల వెంట పరిగెత్తకుండా,హీరోల వెంట పరిగెడతాడు.ఉదాహరణకి వస్తే హీరోలు వెళ్లి గోతిలో దూకితే తాను దూకి కాళ్లు,చేతులు విరగ్గొట్టుకుంటాడు.హీరోలకి కాళ్లు చేతులు విరిగితే సానుభూతి తెలపడానికి అభిమాన సంఘాలున్నాయి.కాని పాపం మన నిర్మాతకి పలకరించే నాధుడే ఉండదు.That is the owner of the ship(Producer).ఓ పది పదిహేను ఏళ్లు పనిచేసిన కుర్ర అసిస్టెంట్ డైరెక్టర్స్ ఈ నిర్మాతల దగ్గరికి ఆవేశంగా పరిగెట్టి కథలు చెప్తే అవి వినరు,అంటే వాళ్లు చెప్పేది అర్ధం కాక కావు,వాటిలో విషయం లేక కాదు.ఎందుకంటే అసలు కథ విని ఓ.కే. చేసేది వీళ్లుకాదు హీరోలు గనుక.నిర్మాతలకి కావలిసింది సక్సెస్ హీరోల డేట్స్,హీరోలు ఏది చెప్తే అది విని డు..డు..డు..బసవన్నల్ల తల ఊపడమే వాళ్లకి తెలుసుకాబట్టి…ఇక మిగిలింది సినిమాకి వెన్నుముక వంటి దర్శకుని పాత్ర గురించి వారసులైన సూపర్‌హీరోలు ఎల చెబితే అలా చేసేవాడే ఆ సినిమాకి దర్శకుడు.”ఒకవేళ నేను captain of the ship”  అని అన్నాడే అనుకో అతని తోకని కట్ చేయటానికి ఎలాగు రెడీగా ఉంటాడు కత్తెరపట్టుకుని మన హీరో వెనుక సదరు నిర్మాత.ఎందుకంటే దర్శకుడికన్నా హీరో
ఆర్డర్సే అతనికి ముఖ్యం అవుతాయి గనుక.

ఈ హీమేన్,సూపర్ హీరోలు కొత్తగా డైరెక్షన్ ట్రై చేసే కుర్ర దర్శకులకి ఆఫర్ ఇవ్వరు.వాళ్ల ఫ్రెండ్ సర్కిల్లో ఉండే వాళ్లు అంటే సాయంత్రం తమతో పాటు పబ్బుల్లో కలుసుకునే వాళ్లు.లేక అల్‌రెడీ తమతో ఒకటీరెండో ఫ్లాపులు తీసిన దర్శకులకే అవకాశం ఇస్తారు.ఎందుకంటే దర్శకులంటే వాళ్ల దృష్టిలో తాము చెప్పినట్టు చేసేవాళ్లే గనుక.ఈ కథానాయకులను కలవడం మహాకష్టం మన ముఖ్యమంత్రినైనా అప్పాయింట్‌మెంట్ తీసుకొని కలవొచ్చునేమోగానీ
ఈ కుర్ర హీరోలని కలవలేం అదీ వాళ్ల లెవెల్…తీరా ఇంత బల్డప్‌లిచ్చే ఈ మహానాయకుల సినిమాలు కథలు లేకుండా తీస్తే ఫ్లాప్‌లు మూటకట్టుకోవల్సిందే.

ఇలాంటి గజిబిజి గందరగోళం వాతావరణంలోకి ఒక M.B.A చదువుకున్న పాతికేళ్ల కుర్రాడు వచిఇ ఒక అగ్రహీరోతో తను తీయబోయే చిత్రానికి ఎలా దర్శకత్వం వహించుకున్నాడు అనేది కథ.ఇలాంటి సినిమా నేపధ్యంలో కామెడీ ధ్రిల్లర్ తీయాలనుకునే దర్శకులు,నిర్మాతలు,హీరోలు నన్ను సంప్రదించగలరు.

వేణుగౌడ్
cell : 9032866063
email : venugoud18@gmail.com
venugoud18@yahoo.com

7 Comments
  1. Indian Minerva January 4, 2011 /
  2. రాజశేఖర్ January 4, 2011 /
  3. srikanth January 4, 2011 /
    • venugoud January 4, 2011 /
  4. swathitelugu January 6, 2011 /
    • Venugoud January 6, 2011 /
  5. suresh velpula January 19, 2011 /