సినిమాటోగ్రఫీ –7

aspectRatio

Aspect Ratio

భౌతికంగా వాడే ఫిలిం ఒకటే అయినప్పటికీ చిత్రీకరణ సైజు ని మార్చుకోవొచ్చు. కెమెరాలో మనం అమర్చుకున్న గేటు దీనిని నిర్ణయిస్తుంది. ఈ గేటు ని camera aperture అనికూడా అంటారు. అంటే గేటు సైజు మార్చటం వల్ల చిత్రీకరించబడే ప్రతిబింబం size మారుతుంది.35mm, super 35mm, cinema scope,vista vision, 70mm, i max, ఇలా రకరకాల కెమేరా aperture లు ఉన్నాయి.

చిత్రీకరణ చేయబడే లేదా projection చేయబడే ప్రతిబింబం పొడవు వెడల్పు నిష్పత్తిని aspect ratio అంటారు.

ఉదాహరణకి 35 మమ్ negative సైజు ఒకటే అయినప్పటికీ గేటు మార్చటం ద్వారా కింది aspect ratios లో చిత్రీకరణ చేయవొచ్చు.


1.33:1 ( 3:4 )

1.85:1 to 2.35:1 – super 35.

2.35:1 or 2.39:1 – cinema scope

సినిమా మొదలైన నాటినుండి ఎన్నో రకాల aspect ratio లు వొచ్చాయి. కాని ప్రస్తుతం విరివిగా వాడుకలో ఉన్నవి మాత్రం సినిమా విషయంలో 1.85:1 మరియు 2.39:1 ( 35 mm film వాడుతారు )

వీడియో విషయం లో 4:3 (1.33:1), 16:9 (1.78:1), I MAX అయితే 1 : 1.43 (70 mm film వాడుతారు)

దీంతో కెమేరా కి సంభంచిన ముఖ్య విషయాలని తెలుసుకున్నాం.

ఇప్పడు సినిమాటోగ్రఫీకి సంభందిచి సెకండ్ లెవెల్ లోకి వెళదాం.

సినిమాటోగ్రఫిని కొన్ని ముఖ్య బాగాలుగా విభజించుకొని వాటిని కూడా స్థూలంగా చర్చిద్దాం.

1 ) exposure

ప్రతిబింబం ఏర్పడాలంటే camera సహాయం తో కొంత కాంతిని, కొంత సేపు ఫిలిం లేదా సెన్సార్ ( sensitive materiel ) మీద పడేట్టు చేయాలి. దేనినే expose అంటాం. ఇది aperture మరియు shutter నిర్ణయిస్తుంది. ఎక్ష్పొస్రె చేయటాన్ని ఇలా aperture మరియు shutter లోతెలుపటాన్ని exposure అంటారు.

ఇది క్రింది సూత్రం వివరిస్తుంది

E = I x T

exposure = Intensity of light X amount of Time

intensity of light ని aperture , amount of time ని shutter తెలుపుతుంది.

సరి అయిన మోతాదు లో expose చేసినపుడు దృశ్యానికి సంభందించిన సమాచారం సరిగ్గా చిత్రీకరించబడుతుంది. చూడటానికి బావుంటుంది. దీనినే correct exposure అంటారు.

ఒకవేళ exposure ఎక్కువ అయినా , తక్కువ అయినా దృశ్యం సరిగ్గా రాదు.

Exposure తక్కువ అయితే దృశ్య సమాచారం సరిగ్గా చిత్రీకరించ బడదు. ఇది negative లో తెల్లగాను, పాజిటివ్ లో నల్లగాను గమనించవచ్చు. దీనినే under exposure అంటారు.

Exposure ఎక్కువ అయితే దృశ్యానికి సంబందించిన సమాచారం నాశనం( burn అవుట్/వాష్ అవుట్ ) అవుతుంది. ఇది negative విషయం లో నల్లగాను , పాజిటివ్ విషయం లో తెల్లగాను గమనించవొచ్చు . దీనినే over exposure అంటారు.

ఈ చిత్రం over , correct , under expose అయిన, negative , positive దృశ్యాలని చూపుతుంది .

హాస్యాస్పదం గా అనిపించినా దీనిని సరిగ్గా అర్థం చేసుకోడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.

exposure ని ఏదయినా వంటకం చేయటం తో పోలుద్దాం. ఉదా : ఆమ్లెట్ వేయటమే అనుకోండి

ఆమ్లెట్ సరిగ్గా కాలలంటే.. కొంత మంట కొంత సేపు పెనం కి తగలాలి.మంట ఎక్కువైనా.. లేదా ఎక్కువ సేపు పెట్టినా ..ఆమ్లెట్ మాడుతుంది.. ఇదే over exposure .

ఆమ్లెట్ రంగు రుచి నాశం అవుతాయి. :)

మంట తగ్గినా లేదా తక్కువ సేపు పెట్టిన ఆమ్లెట్ సరిగ్గా కాలదు ఇదే under exposure . ఆమ్లెట్ పచ్చి గా ఉండి తినలేము :)

సరియిన మోతాదులో మంట, సరిపోయినట కాలం తగిలితే.. ఆమ్లెట్ సరిగ్గా కాలి.. మంచి రంగు తో..ఘుమ ఘుమతో నోరురిస్తుంది ఇదే కరెక్ట్ exposure .

సినిమాటోగ్రఫీ లో దృశ్య సమాచారం సరిగ్గా చిత్రీకరించటం ప్రధాన మోలిక విషయం. దీనికి మూలాధారం ఈ exposure .

ఒక్కో ప్రదేశం లో ఒక్కోరకంగా కాంతి ఉంటుంది. ఉదాహరణకి.. interior ఆలో exterior లో “అందుబాటు కాంతి” తీవ్రత (ambient light) వేరుగా ఉంటుది. అదేకాక అవసరాన్ని బట్టి, mood create చేయటానికో, అందమయిన చిత్రీకరణ కోసంమో కృత్రిమ లైట్స్ ని వాడటం జరుగుతుంది. అలా కాంతి హెచు తగ్గులకి అనుగుణంగా aperture (f/no ) పెంచుకోవటమో తగ్గించుకోవటమో చెసి సరియిన exposure ని రాబట్టుకోవాలి. ఎలాంటి పరిస్తితుల్లో అయినా సరియిన exposure రాబట్టటం అనేది మౌలిక విషయం.

సినిమాటోగ్రఫీ లో ఎక్కువ సమయాల్లో exposure కోసం aperture(f/no ) నే మార్చుకుంటారు. చాల తక్కువ సమయాల్లో shutter angle ( amount of time ) ని మార్చి exposure రాబట్టుకుంటారు.

ముఖ్య మైన విశ్యయం ఏంటంటే.. exposure కోసం aperture మార్చినపుడు.. దృశ్యం యొక్క depth of filed మారి పోయే ప్రమాదం ఉంది. కనక అనుకున్న ఫ్రేం కి ఎంత డెప్త్ అఫ్ ఫీల్డ్ ఉండాలి అనేది కూడా పరిగణనలోకి తీసుకుంటూ exposure రాబట్టాలి. ఈ depth of field అనేది దృశ్య రసాత్మకతని నిర్ణయిస్తుంది.

సహజ కాంతి ని, కృత్రిమ లైట్స్ యొక్క కాంతిని కొలిచి exposure లెక్కించటానికి మనకి లైట్ మీటర్స్ ఉన్నాయి.

ఈ లైట్ మీటర్ సహాయం తో దృశ్యాన్ని సరిగ్గా చిత్రీకరించటానికి కావలసిన exposure సాధించగలుగుతాడు cinematographer .

మళ్లీ కలుద్దాం.

ఈ సీరీస్ లోని మిగిలిన వ్యాసాలుసినిమాటోగ్రఫీ – 6సినిమాటోగ్రఫీ – 8

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

చక్రధర్

రచయిత:

డిగ్రీ అయ్యిందనిపించాక..సృజనాత్మకత వైపు మనసు వెళ్ళింది.లలిత కళల్లో, ఫోటోగ్రఫి విభాగంలో డిగ్రీ చేశాను. కొంతకాలం ఫ్రీలాన్సు ఫోటోగ్రఫి చేశాను.తరవాత ..సినిమా వైపు గాలి మళ్ళింది. ఆ తరవాత ..."సినిమా' మొదలయ్యింది.

4 Comments to “సినిమాటోగ్రఫీ –7”

  • Beautiful..

  • Very good article.

    Besides aperture and shutter speed ND filters also play a major role in controlling exposure. Since aperture should be wide open for narrow depth of field, ND filters will help controlling the light intensity. I’ve seen a lot of first time filmmakers just not realizing the importance of ND filters ending-up with washed-out outdoor shots, especially white clouds in the low angle shots appears ugly without NDs. On a personal note I did make this mistake for my first short though I had on camera ND control, which I didn’t consider using ;) such is life… lol

    • థాంక్స్ శంకర్ గారు :)
      సినిమాటోగ్రఫీ మీద అవగాహన లేని వాళ్లకి ఒకేసారి అన్ని విషయాలు చెప్పి confuse చేయకుండా.. ఒక్కొక్కటి గా చేర్చుకుంటూ ఈ ఆర్టికల్స్ రాస్తున్నాను. మీరు చెప్పిన విషయం ” filters” లో ప్రస్తావనకి వొస్తాయి.

  • Very nice. Kudos

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories