Menu

తెలుగు సినిమా నిడివి తగ్గాలి…

తెలుగు సినిమాకి కథ కరువై..  ప్రేరణ పేరుతో మక్కి కి మక్కి కాపి కొడుతున్న సందర్భం లో..కథనం లో ఏవో ఏవో కొత్తదనం తీసుకుని రావాలన్న తాపత్రయం తో.. ఇష్టం వొచ్చినట్టు కథని ముక్కలుగా చూపించటం.

అనవసరంగా.. ఓ అయిదు పాటలు.. నాలుగు ఫైట్లు.. రెండు సెంటిమెంట్ సీన్లుగా విడగొట్టుకొని.. మూలకథకి   సరిపోయే  ఓ నాలుగు ఇతర భాష సినిమాలు ముందేసుకొని .. వాటిల్ల్లోంచి ముక్కలు ఏరుకోని  అతికించి సినిమా తయారు చేస్తున్నారు.

రెండున్నర గంటల వినోదం  పేరుతో.. సీసా ఝండుబాం రాసుకొనే పరిస్తితి కల్పిస్తున్నారు. అవసరాన్ని బట్టి రెండున్నర కాకపోతే మూడు గంటలైనా ఉండొచ్చేమో ,

మరీ పెద్దదయితే  రెండభాగాలుగా తెసి sequel చేయొచ్చేమో గాని , అనవసరంగా ఉంటే మాత్రం తలనెప్పే.

సినిమా అంటే కళ అన్న మాట చాలా దూరమైన విషయం. కనుక ఆది వొదిలేస్తే…సినిమాని, సినిమా చరిత్రని, దాని ప్రస్తుత  పోకడనీ, అవసరాన్ని చదివి,కనీసం ఒక సాఘీక నిబద్దత ఉన్న మాధ్యమం అని అర్థం చేసుకొని సినిమాని తయారు చేయగల సమర్థులు కరువై.. వెలవెల లాడుతున్నది.  సినిమా అంటే ఒక వినోదం  వ్యాపారంగా మాత్రమే అన్నట్టు గా ఉన్నది మన తెలుగు సినిమా.

త్రేతాయుగం లోనే సీతని రావణుడు ఎత్తుకు  పోయాడంటే, నిండు సభలో ద్రౌపది  వస్త్రాపహరణం జరిగిందంటే..హింస..రాజకీయం.. వ్యభిచారం లాంటివి సమాజం లో ఎప్పుడూ ఉన్నాయి.. ఇప్పుడూ ఉన్నాయి. ప్రస్తుతం వాటిని ప్రతిబింబించే సినిమాలే తప్ప   జీవితపు అర్థం, ఆనందం ని తెలియజెప్పే సినిమాలు తక్కువయ్యాయి.

మూల కథ మంచి వస్తువే అయినా.. దాని రెండున్నర గంటలు సాగదీయాలి కనక అనవసర విషయాల్ని చొప్పించాల్సి వొస్తోంది.. తద్వారా అసలు కథకే ఎసరు వొస్తోంది. కథనాన్ని పరిగెత్తించలేక అనవసరం లేని పాత్రలు, పట్టాలు వేయాల్సి వొస్తోంది.

అపుదేపుడో సినిమాని మృష్టాన్న భోజనం తో పోల్చారు. అన్ని రసాలు ఉండాలని పండాలని.. ఇలా అన్ని రసాలు వండి వార్చే నలభీములు లేక.. సినిమా రుచి కోల్పోతున్నది.అదీకాక  ప్రస్తుతం జనాల నాలికలోని రుచి మొగ్గలు కొత్తగా వేశాయని తెలీక మృష్టాన్నం  పెడదాం అనుకుంటే ముష్టి ఘాతాలు తగులుతున్నాయి. ఆకలికి ఏ బర్గరో , పిజ్జాలో లాగించే పరుగుల ప్రపంచంలో  ఒకటో రెండో రసాలు చాలు. ఈ భోజన పథకం లో  అవసరమైన చోట ఫీల్ కావటానికి  ప్రేక్షకులకి కావలసిన టైం దొరకక, ఏ రుచిని ఆస్వాదించాలో తెలియక తికమకతో సినిమాని తిప్పి కొడుతున్నారు.

కనక ఈ నేపథ్యం లో… తెలుగు సినిమా తన నిడివిని తగ్గించు కోవలసిన అవసరం ఎంతయినా ఉంది.

సినిమా నిడివిని ఒకటిన్నర లేదా  రెండుగంటల లోకి తగ్గించుకుంటే  “అనవసర కలల”  పాటలు తగ్గి తెలుగు కథకి ఫారిన్ locations అవసరం ఉండదు.

సెక్స్ కామిడిలో సెంటిమెంట్ లేకుండా, పక్కా  action పక్కదారులు తొక్కకుండా, ప్రేమలో దోమలు లేకుడా.. పాట వచ్చినపుడు గుండె కాల్చుకోకుండా, fighting వోచ్చినపుడు  పామాట  ఆడకుండా ఉంటారు.

ఎలాగు మన హీరోలకి ఏ సీన్  ఇచ్చినా,   ఒచ్చిన ఒకే expression  పెడతారు కనక వాళ్ళకు ఆ నట పరీక్షా తప్పుతుంది.. చూసేవాళ్ళకి  అగ్ని పరీక్షా ఉండదు.

అప్పటిదాకా కొంగు కప్పుకున్న హీరోయిన్ అమాంతంగా..పోట్టిలంగా తో గెంతటమూ  ఉండదు. అలా పొట్టి లంగాతో కనిపించాలనుకుంటే  దానికోసం ఇంకో సినిమా చేస్తుంది కాని ఒకే సినిమాలో ఇలా doable  action ఉండదు.

అపుడు సెన్సార్ వాళ్ళకి కూడా భక్తి సినిమాకి A సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరమూ  రాదు.

ఒకటో రెండో రసాలని వండి వడ్డిస్తున్నారు కనక, ఫామిలి మొత్తం ఒకే సినిమాకి రాకపోయినా. ఎలాగూ multiplex లు ఉన్నాయి  గనక పక్క పక్క theater లలోనైయినా  తమతమ సినిమాలని చూసెళ్ళి పోతారు.అ వొచ్చే నాలుగు రాళ్ళు నలుగురు పంచుకుంటారు, తెలుగు సినిమా నాలుగు కాలాలపాటు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఓ నలుగురు నవ దర్శకులకి అవకాశమూ దొరుకుతుంది.

(ఈ పని పక్క  వాడు చేయకముందే  జాగ్రత్త పడటం బెటర్. లేదా దీనికోసం కూడా ఇంకోసారి పొగడాల్సి ఉంటుంది).

– చక్రధర్

9 Comments
  1. Phanindra December 1, 2010 /
  2. srikanth December 1, 2010 /
    • phanindra December 2, 2010 /
  3. చక్రధర్ December 2, 2010 /
  4. phanindra December 3, 2010 /
    • చక్రధర్ December 3, 2010 /
  5. rgv_pil December 7, 2010 /
  6. chakradhar December 10, 2010 /